ప్రభువు యొక్క మార్గమును సిద్ధపరచుటకు నాలుగు సంగతులను చేయుటకు దేవుడు తనను పంపియున్నాడని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు (లూకా 3:5).
(1) ప్రతి పల్లము పూడ్చబడును;
(2) ప్రతి కొండయు, మెట్టయు పల్లము చేయబడును;
(3) వంకర మార్గములు తిన్ననివగును; మరియు
(4) కరకు మార్గములు నున్ననివగును.
వీటినే మన జీవితములో చేయవలెనని పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు.
1. మన జీవితములలోని పల్లములను ఆయన పూడ్చును అనగా భూసంబంధమైన సిరిసంపదలు, లైంగిక వాంఛలు, మానవ ఘనత మొదలగువాటి చేత పరిపాలించబడుట.
2. గర్వము, అహంకారము, మొండితనము మరియు ఇతరుల కంటె గొప్పవారమని అనుకునే తలంపులన్నియు పల్లము చేయబడవలెను.
3. మనలో ఉన్న వంకర మార్గములన్నియు తిన్ననివిగా చేయబడును.
4. మనలో ఉన్న కఠినత్వము, కరకుతనము మెత్తనివిగా చేయబడును.
అప్పుడు దేవుడు వాగ్ధానము చేసిన రక్షణ ప్రతి ఒక్కరి జీవితములలోనికి వచ్చును (లూకా 3:6). అప్పుడు మన శరీరమంతయు దేవుని మహిమను ప్రత్యక్షపరచును. మనలో ఉన్న శరీరసంబంధమైనదంతయు లయమగునట్లు దేవుని మహిమ అగ్నివలె కొద్దికొద్దిగా మరియు ప్రతి విషయములోను విస్తరించును.
యిర్మీయా 48:10లో "యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును (అనగా ప్రభువైన యేసుకు మన జీవితములో ప్రతి విషయములో ప్రభువుగా చేయుట) మరియు రక్తము ఓడ్చకుండ ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును (అనగా శరీరేచ్ఛతో తీవ్రముగా పోరాడకుండుట)". తరువాతి వచనములో మోయాబు, ఈ కుండలోనుండి మరొక కుండలోనికి కుమ్మరించబడనందు వలన, దాని వాసన ఎప్పటివలె నుండెను.
'ఒక కుండలోనుండి మరొక కుండలోనికి పోయబడుట' అను శీర్షికను వ్రాసిన జాన్ ఫొల్లెట్ మనలో వ్యర్థమైన పదార్థములు పోవుటకు దేవుడు అనేక పాత్రలలో పోయుబడుటను గూర్చి చెప్పుచున్నాడు - అనగా అపార్థము, నిందారోపణ చేయుట మరియు అనేక పరీక్షలు అనే పాత్రలు గురించి చెప్పాడు. మన జీవితములలోని వ్యర్థమైనవన్నియు తీసివేయబడి మరియు ద్రాక్షారసము మాత్రము మిగులునట్లు, వ్యర్థమైనవన్నియు క్రిందకు చేరును. ఒకసారి వ్యర్థమైనవి పాత్ర క్రిందకు చేరిన వెంటనే దేవుడు మనలను మరియొక పాత్రలో పోయును. కాని మనలను మనము సమర్థించుకొనకుండా విశ్రాంతిలో ఉండటం నేర్చుకొనవలెను. లేనట్లయితే వ్యర్థమైన వాటినుండి ద్రాక్షారసము వేరుచేయబడదు. కాని దేవుని ప్రజలు తమ్మును తాము సమర్థించుకొనుచు మరియు తమ చింతయావత్తు దేవుని మీద వేయరు గనుక అనవసరముగా శ్రమపడుచున్నారు.
జెకర్యా 2:13లో "సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులైయుండుడి" (10వ వచనము కూడా చూడండి). అన్ని సమయములలో మనలో ఈ విధముగా జరగాలి.