వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము సంఘము శిష్యులు
WFTW Body: 

నిజమైన క్రైస్తవ సహవాసం వెలుగుపై ఆధారపడి ఉండాలి. మనం వెలుగులో నడచుటకు ఇష్టపడినప్పుడు మాత్రమే మనం ఒకరితో ఒకరు నిజమైన మరియు లోతైన సహవాసంలో నడవగలము. దీనిలో అన్నివిధములైన నటన మరియు వేషధారణను విడిచిపెట్టి మనం నిజానికి ఎలా ఉన్నామో ఒకరియెడల ఒకరు అలా ఉండుట ఉన్నది. క్రైస్తవులు ఒకరి యెడల ఒకరు ఈ విధముగా నడువవలెనని దేవుడు ఉద్దేశించెను. ఆది సంఘములో దేవునిచేత బహిరంగముగా శిక్షింపబడిన పాపము వేషధారణ అని జ్ఞాపకముంచుకొనుడి (అపొ.కా. 5:1-14 లో అననీయ సప్పీరాల గూర్చి వ్రాయబడిన భాగమును చూడండి).

మన పరస్పర సంబంధాలలో మనమందరము ముసుగులు ధరించుకొనునట్లు పాపం చేసెను. మనం ఎలా ఉన్నామో అలాగే తెలియబడుటకు భయపడుదుము మరియు సిగ్గుపడుదుము. మనం ముసుగులు ధరించిన జనులతో నిండియుండిన లోకంలో జీవించుచున్నాము; జనులు క్రైస్తవులుగా మారినప్పుడు, వారు ముసుగులు తీసివేయరు. వారు ముసుగులు ధరించి కూటములకు వెళ్ళుదురు, ఇతరులను కలుసుకొందురు మరియు దానిని సహవాసమని పిలుచుదురు. కాని అటువంటి సహవాసం ఒక హాస్యనాటకం. అయినప్పటికీ అనేకమంది క్రైస్తవులు కేవలం దానితో సంతృప్తి పొందేటట్లు సాతాను చేసెను.

మనలో ఎవరైనా మన ముసుగులను పూర్తిగా తీసివేయుట అసాధ్యమైనదన్న విషయం యధార్థం. పాపముతో నిండిన లోకంలో జీవించుట, పరిపూర్ణం కాని ఒక సంఘములో సహవాసంలో ఉండుట, మనకుండిన మాంస శరీరములో ఉండుట వలన ఇతరులతో పూర్తి నిజాయితీ కలిగియుండుట సాధ్యం కాదు మరియు కోరుకునేది కూడా కాదు. మనలను మనం సంపూర్తిగా చూచుకొనలేము కాబట్టి, సంపూర్ణమైన నిజాయితీ సాధ్యం కాదు. అది ఇతరులకు ఆటంకముగా ఉండవచ్చు కాబట్టి అలా ఉండమని చెప్పుట కూడా మంచిది కాదు.

నిజాయితీగా ఉండుటలో తప్పనిసరిగా మనకు జ్ఞానం అవసరమైయున్నది. కాని మనలో లేని దానిని ఉన్నట్లు ఎప్పుడూ చూపకూడదు. అది వేషధారణ - వేషధారణను యేసుప్రభువు పూర్తిగా ఖండించారు.

స్వనీతితో కూడిన పరిసయ్యతత్వపు వైఖరి, ఇతరులకు సహాయపడే మరియు ప్రోత్సహించే వారిగా ఉండకుండా అనేకమంది క్రైస్తవులను ఆటంకపరుస్తుంది. మన తోటి విశ్వాసులు మరియు ఇతరులు మనయొద్దకు వచ్చుటకు స్వేచ్ఛగా ఉండి మరియు వారు ఎటువంటి సంకోచం లేకుండా, వారి భారం దించుకొనగలుగునట్లు వారియెడల మన వైఖరి ఉండవలెను. వారు మన దగ్గరకు వచ్చినప్పుడు, వారి అజ్ఞానాన్ని బట్టి లేక వారి ఓటములను బట్టి తృణీకరింపబడమని, సానుభూతితో అర్థం చేసుకొనబడుదుమని అనుకొనేటట్లు మన వైఖరి ఉండవలెను.

లోకం, ఒంటరియైన, ఏమి జరుగునో అనే ఉద్వేగముతో ఉన్న, భయకంపితులైన, మనోస్థైర్యం కోల్పోయిన వారితో నిండి ఉన్నది. వారి సమస్యలకు జవాబు క్రీస్తు దగ్గర ఉన్నది. కాని ఆ జవాబు తన శరీరమైన సంఘము ద్వారా రావలెను. కాని, అయ్యో ఎక్కువమంది క్రైస్తవులు ఎంతో స్వనీతిపరులు మరియు యధార్థతలేని వారుగా ఉండి అవసరములో ఉన్న జనులను తరిమివేయుచున్నారు.

కీత్ మిల్లర్ "ది టేస్ట్ ఆఫ్ న్యూ వైన్" అను పుస్తకములో, "మన ఆధునిక సంఘం పవిత్రముగా కనబడుచు, పవిత్రముగా వినబడుచు, అంతరంగములో వారి బలహీనతలతో, వారి భంగపాటులతో, వారి చుట్టూ యధార్థత లేని వారితో, విసిగివేసారిన వారితో నిండియున్నది. మన క్రైస్తవేతరులైన స్నేహితులు, 'అక్కడ ఉండిన యిబ్బందులు లేని జనులు నా సమస్యలను ఎప్పటికీ అర్థం చేసుకొనలేరు' అనైనా అనుకొందురు లేక మనం స్థూలంగా భద్రపరచబడి మానవ పరిస్థితి గురించి అవగాహన లేకుండా ఉన్నామని లేక వేషధారులుగా ఉన్నామని, ఎక్కువ గ్రహింపు కలిగి, సాంఘీకంగా వృత్తిపరంగా మనకు తెలిసిన అన్యజనులు అనుకొందురు".

ఇతరులతో వ్యక్తిగతమైన స్థాయిలో నిజాయితీతో సహవాసం చేయుట అనగా ఏమిటనేది మనం నేర్చుకోవలసి ఉంది - మనమందరము ఒక్క వ్యక్తితో ప్రారంభించవచ్చు.