WFTW Body: 

పౌలుయొక్క సన్నిహిత సహపరిచారకుడైన తీతు యూదుడు కాదు, పౌలు చాలా బలమైన యూదుడైయుండి పరిసయ్యులకే పరిసయ్యుడైయున్నాడు. లూకా సువార్త మరియు అపొస్తలుల కార్యములు వ్రాసిన గ్రీకువాడైన డాక్టరు లూకా ఎల్లప్పుడు పౌలుతో ప్రయాణించేవాడు. తిమోతి కూడా అతనితో కలిసి పరిచర్య చేసియున్నాడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడైనందున అతడు కొంతవరకు గ్రీసువాడైయున్నాడు. తీతు కూడా గ్రీసు దేశస్థుడే. కాబట్టి అనేక దేశములకు చెందిన పౌలు, తీతు, తిమోతి మరియు లూకా - వేరు వేరు సమాజములకు చెందినవారైనప్పటికిని వారందరు కలిసి క్రొత్తనిబంధన సువార్తకు సజీవ సాక్షులుగా ఉన్నారు.

నీవు కేవలము నీ దేశస్థులతోను మరియు నీ సమాజమువారితో మాత్రమే కలసి పరిచర్య చేసినయెడల, నీ క్రైస్తవ్యంలో తప్పు ఉన్నది. నీవు మలయాళీయుడవైయుండి మరియు నీవు మలయాళీయులతోనే కలసి పరిచర్య చేయగలిగిన యెడల, నీవు సువార్తను అర్ధము చేసుకొనలేదు. వేరే దేశస్థులతోను మరియు వేరే భాషలు మాట్లాడువారితోను పౌలు పరిచర్య చేయగలుగునట్లు సువార్త చేసియున్నది. ప్రభువైనయేసు శిష్యులైనయెడల వారు ఏ దేశస్థులైనను - అనగా చైనీయులైనను, ఆఫ్రికనులైనను, రష్యనులైనను, ఉత్తర అమెరికన్లు అయినను లేక దక్షిణ అమెరికన్లయినను, ఇతరులలో సులభముగా కలసేవారైనను లేక కలవనివారైనను వారితో కలిసి పరిచర్య చేయుటకు మనము ఇష్టపడాలి. వేరే వేరే దేశస్థులతోను మరియు వేరు వేరు భావోద్వేగముల కలవారైనను కలిసి పని చేయవచ్చును. మన స్వంత దేశస్థులతోను మనలాంటి భావోద్వేగములు గలవారితోను మరియు కేవలము మన సమాజము వారితోను పరిచర్య చేయుటనుండి విడుదలపొంది మరియు క్రీస్తు శరీరములో ఉన్న ఎవరితోనైనను కలిసి పరిచర్య చేయుటకు నేర్చుకొనవలెను.

కొన్ని దేశములలోను మరియు కొన్ని సమాజములలోను కొన్ని ప్రత్యేకమైన విధానములు కలిగియుందురు. కానీ వారు ప్రభువైనయేసు క్రీస్తులోనికి వచ్చినప్పుడు ప్రత్యేకమైన విధానముల నుండి విడుదల పొందెదరు. తీతు క్రేతులో ఉన్నప్పుడు, పౌలు అతనితో ఇట్లనెను - క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండిబోతులునైయున్నారు (తీతు 1:12). ఇది నిజమైయుండవచ్చును కాని క్రేతీయులు క్రీస్తులోనికి వచ్చిన తరువాత మరియు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, వారు అబద్ధికులుగాగాని లేక దుష్టమృగములుగాగాని లేక తిండిబోతులుగాగాని ఉండరు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క దేశమునుబట్టి గాని లేక సమాజము గురించి గాని తీర్పు తీర్చకూడదు. ఒక క్రైస్తవుని సమాజమును బట్టి(కులము) పక్షపాతము కలిగియున్నయెడల ఆత్మీయముగా బీదవారమైయుండెదము.

నేను అనేక దేశస్థులుతోను మరియు అనేక సమాజములవారితోను అనగా చైనీయులతోను, ఆఫ్రికనులతోను, ఇండియాలోని అనేక సమాజములవారితోను, యూరోపియనులతోను, అమెరికన్లతోను మొదలగు వారితో కలిసి సహవాసము చేసినందున, దేవుడు నన్ను ఆత్మీయముగా ఎంతో ధనవంతునిగా చేసెను. దైవభక్తి ఒక దేశములో లేదు గనుక అన్ని దేశములలోను మరియు అన్ని సమాజములలో ఉన్న దేవుని ప్రజలకొరకు నా హృదయము తెరవబడియున్నది. ధనిక దేశస్థులలో కొందరు గర్విష్టులైయుండుటను నేను గమనించాను. కాని ఆ దేశములోని నిజమైన విశ్వాసులు దీనులైయుండెదరు. కాబట్టి క్రేతీయులు అబద్ధికులైనను, క్రేతులో ఉన్న క్రైస్తవులు అబద్ధికులుకారు. కొన్ని సమాజములలో కుటుంబ విలువలు చాలా తక్కువగా ఉండును, కాని ఆ సమాజములోని క్రైస్తవులు ఇతరులవలె ఉండవలెను. కాబట్టి తన యొక్క సమాజమును బట్టి ఒక క్రైస్తవున్ని మనము తీర్పు తీర్చకూడదు అందువలననే పౌలుకు ఇతర దేశస్థులు సన్నిహితమైన సహపరిచారకులుగా ఉన్నారు. క్రీస్తు శరీరములో నీకంటే వేరుగా ఉండే వారితో కలిసి పరిచర్య చేయుటకు నీవు ఇష్టపడనియెడల నీ జీవితములోని దేవునిచిత్తమంతయు నీవు నెరవేర్చలేవు. ఒకవేళ దేవుడు, నీవు వేరే దేశస్థులతో గాని లేక ఇండియాలోని వేరే ప్రదేశములో నుండి వచ్చిన వ్యక్తితో కలిసి పరిచర్య చేయవలెనని కోరినయెడల, నీవు ఇష్టపడుటలేదు గనుక దేవుడు నీకు వారిని చూపించడు.

మనలో ఎటువంటి భేదములేకుండా క్రీస్తుశరీరములోని ఇతరులతో కలిసి పనిచేయుటకు మనలోని తప్పుడు వైఖరులు విరుగగొట్టబడవలెను. కేవలము మన వంటివారితో మాత్రమే కలిసి పరిచర్య చేయుటకు ఇష్టపడినయెడల, అప్పుడు దేవుడు మనలను నడిపించడు. మన తోటిపరిచారకులను మనమే ఏర్పరచుకొని మరియు దేవుడే వారిని నాయొద్దకు నడిపించియున్నారని చెప్పినయెడల - అది నిజము కాదు, అది శరీరానుసారమైన విధానము. వారు మనవంటి తెలివిగలవారుకాబట్టి మరియు మన సమాజములోని వారుకాబట్టి మరియు మనవంటి భావోద్వేగముగలవారుకాబట్టి వారిని ఎన్నుకొన్నాము. వివాహవిషయములో ఈ విధముగా చేయవచ్చును. కాని దేవుని పరిచర్య విషయములో, దేవుడు ఏర్పరచిన వారితోనే మనము కలిసి పరిచర్య చేయాలి.