WFTW Body: 

అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో మొదటిసారిగా అన్యుల యొద్దకు సువార్త వెళ్ళుటగురించి చదువుతాము. యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందును భూదిగంతములవరకును నాకు సాక్ష్యులై యుంటారని ప్రభువు తన శిష్యులతో చెప్పారు. 2వ అధ్యాయంలో యెరూషలేము మరియు యూదయలోని యూదులతో సువార్త ఆరంభమైంది. 8వ అధ్యాయంలో సమరీయుల దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు సువార్త మొదటిసారి అన్యుల దగ్గరకు వెళ్ళుచున్నది. యూదులకును మరియు అన్యులకును మొదటిసారి సువార్త చెప్పే ధన్యత పేతురు కివ్వబడింది.

కొర్నేలీ, బైబిలునుగాని దేవుణ్ణిగాని కొంచెంకూడా ఎరుగనివాడు. కాని అతడు దేవునియందు భయభక్తులు కలిగియుండి, ధర్మముచేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు (అ.కా. 10:2). దేవుని దూత అతనికి ప్రత్యక్షమై దేవుడు అతని ప్రార్ధనలను ధర్మకార్యములను అంగీకరించాడని చెప్పాడు (అ.కా. 10:4). కాబట్టి అన్యజనులు దేవునియందు భయభక్తులు కలిగి , యదార్ధంగా ఉన్నట్లయితే, తండ్రిలోనికి వచ్చుటకు ఏకైక మార్గమైయున్న క్రీస్తుయొద్దకు ఆయన నడిపిస్తాడు (యోహాను 14:6). అనేకులు పేతురువలె క్రైస్తవేతరులకంటే వారు గొప్పవారనుకుంటారు. కాని కొర్నేలీలాంటి క్రైస్తవేతరులు అనేకమంది క్రైస్తవులకంటే ఎక్కువ భయభక్తులు కలిగియుంటారు. పేతురు అన్యులకంటే తాను ప్రవిత్రుడననుకున్నాడు. కాని దేవుడు పేతురు అభిప్రాయాన్ని మార్చి, అతని హృదయాన్ని విశాలపరచియున్నాడు. క్రైస్తవేతరుల విషయంలో మనవైఖరినికూడా దేవుడు మార్చవలసియుంటుందేమో. పేతురు ఎంత కఠినంగా ఉన్నాడంటే అతని వైఖరిని మార్చుటకు దేవుడు దర్శనాన్ని ఇవ్వవలసి వచ్చింది (అ.కా. 10:11). ఆదర్శనంలో పేతురు పవిత్రమైన మరియు అపవిత్రమైన జంతువులను చూశాడు మరియు ఆ జంతువులను చంపి, తినమని ఒక స్వరం వినిపించింది. కొన్ని జంతువులను తినకూడదని మోషే ధర్మశాస్త్రము చెపుతుంది కాబట్టి యూదులు వాటిని తినరు. అందువలన పేతురు వాటిని తినడానికి నిరాకరించాడు (లేవీకాండము 11 అధ్యాయము). కాని దేవుడు పవిత్రపరచిన దానిని అపవిత్రమైనదని పిలువవద్దని దేవుడు చెప్పాడు. ఆ దర్శనము మూడుసార్లు వచ్చింది. పేతురుకొరకు మనుష్యులను పంపమని దేవునిదూత కొర్నేలీతో చెప్పియున్నాడని తన ఇంటికి వచ్చి వారు చెప్పియుండగా పేతురు దర్శనం విషయమై కలవరపడ్డాడు.

అప్పుడు యూదులు అపవిత్రులుగా యెంచిన అన్యుల ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పుచున్నాడని పేతురు గ్రహించాడు. ప్రభువైన క్రీస్తు లోక పాపములకొరకు చనిపోయాడని మరియు మూడవ రోజున తిరిగి లేచి యున్నాడనియు సువార్త సందేశం కొర్నేలీ యొద్దకు పంపబడిన దూతకు నిశ్చయముగా తెలియును. అయితే తానే స్వయంగా కొర్నేలీకి సువార్త చెప్పకుండా, పేతురును పిలిపించుకొని అదేసువార్తను వినమని దూత ఎందుకు చెప్పాడు? దూత కలిగియుండకుండా, పేతురు మాత్రమే కలిగియున్నదేంటి? పేతురుకంటే దూత పదిరెట్లు శ్రేష్టముగా చెప్పగలడని నేను చెప్పగలను అయితే పేతురు పొందిన రక్షణానుభవం దూతకులేదు. కేవలం కృపద్వారా రక్షణ పొందిన పాపిమాత్రమే రక్షణనుగూర్చి చెప్పగలడు. దీనినే అపో.కార్యములు మొదటి వచనంలో చూస్తాము: ప్రభువైన యేసు చేయుటకును బోధించుటకును ఆరంభించెను. నీవు దేనినైతే అనుభవించలేదో దానినిగూర్చి నీవు మాట్లాడకూడదు. ఈ దైవిక నియమాన్ని దూతకూడా గౌరవించెను. కాబట్టి నీవు దేనినైతే అనుభవించలేదో లేదా నీ అనుభవమగుటకు నీవు వెదకి ప్రయత్నించుటలేదో దానిగూర్చి బోధించవద్దు.

పేతురు కొర్నేలీ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లన్నాడు, “ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” (అ.కా. 10:35) (ప్రతి దేశమునుండి మాత్రమేకాదు ప్రతి డినామినేషన్ నుండికూడా). వారు రక్షణ పొందునట్లు, భయబక్తులు కలిగిన ప్రతి మతములో ఉన్నవారినికూడా దేవుడు క్రీస్తుయొద్దకు నడిపిస్తారు. పేతురు కొర్నేలీ ఇంటికి వెళ్ళుటకు ఒప్పుకొననట్లయితే ఏమి జరిగియుండేది? పేతురు అవిధేయత చూపినట్లయితే, కొర్నేలీ నశించేవాడా? పేతురు అవిధేయతనుబట్టి కొర్నేలీ శ్రమపడినట్లయితే , అప్పుడు దేవుడు నీతిమంతుడు కాకపోవును. పేతురు వెళ్ళియుండకపోతే దేవుడు యాకోబునుగాని లేక యోహానునుగాని లేక ఇంకొకరిని పంపేవాడు. తార్సువాడైన సౌలు యొద్దకు అననీయ వెళ్ళియుండకపోతే, దేవుడు ఇంకొకరిని పంపేవాడు. దేవుడు వెళ్ళమన్న స్తలానికి నీవు వెళ్ళనిచో, దేవుడు నీ పరిచర్యను వేరేవారికి ఇస్తాడు. అ.కా. 10:38 లో పేతురు ప్రభువైనయేసు పరిచర్యగూర్చి చెప్పుచున్నాడు “అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను”. ప్రభువైన యేసు జీవితంలోకూడా దేవుని శక్తియే పరిశుద్ధాత్మయొక్క అభిషేకానికి ఋజువుగా ఉంది. ఆ శక్తితోనే ప్రభువైనయేసు మేలు చేయుచు, అపవాదిచేత పీడింబబడుచున్న వారినందరిని విడిపించియున్నాడు. మనము కూడా ఇతరులకు మేలు చేయునట్లును, అపవాదిచేత పీడింపబడుచున్నవారిని విడిపించుటకును దేవుడు మనలను పరిశుద్ధాత్మతో నింపును. అపవాదిచేత పీడింపబడుతూ నిరాశలోను, సంతోషంలేని వివాహజీవితం గలవారు, వివాహ భాగస్వామిచేత బాధించబడువారు, తల్లితండ్రులచేత నిర్లక్ష్యం చేయబడుచున్నవారు, మరికొందరు ఆత్మహత్య చేసుకోవాలని కోరేవారు మన చుట్టూ ఉన్నారు. మన సహాయంద్వారా వారు పాపమునుండి మరియు సాతానునుండి విడుదలపొంది, వారు సంతోషించునట్లు దేవుడు అటువంటివారిమధ్య మనలను ఉంచియున్నాడు. ఈ పరిచర్య చేయటానికి ప్రభువైన యేసుకే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైతే మనకు ఎంత అవసరమోగదా! ప్రభువైన యేసు అభిషేకించబడ్డాడు మరియు “దేవుడాయనకు తోడైయున్నాడు”, మనం పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు, దేవుడు మనకుకూడా తోడుంటాడు”. మనం ప్రజలతో మాట్లాడునప్పుడు లేక దయ్యములను వెళ్ళగొట్టునప్పుడును, ప్రజలను ఆశీర్వాదించుటకు దేవుడు మనకు తోడైయుంటాడు.