దానియేలు (ఈ ప్రవచనములను వ్రాసినవాడు) అతడి తరములో దేవుడు వాడుకొన్న వారిలో ఒకడు. అతడు 17 సంవత్సరముల యౌవ్వనుడుగా నుండినప్పుడు తన్ను అపవిత్ర పరచుకొనకూడదని ఉద్దేశించెను (దానియేలు 1:8). ఎప్పుడైతే హనన్యా, మిషాయేలు మరియు అజర్యా తమతోటి యౌవ్వనుడైన దానియేలు దేవుని కొరకు నిలువబడుటను చూచారో (దానియేలు 1:11), వారికి వారుగా నిలువబడుటకు వారికి కూడా ధైర్యము తెచ్చుకొనిరి. ఈనాడు దేవుని కొరకు వారికి వారుగా ధైర్యముగా నిలువబడలేని అనేకమంది, దానియేలు వంటివారు నిర్ణయము తీసుకొని నిలువబడుట కొరకు చూచుచున్నారు. అప్పుడు వారు కూడా అతడితో ఏకమగుదురు.
నీవు అటువంటి దానియేలుగా యుందువా? “నన్ను నేను అపవిత్ర పరచుకొనను, రాజును లేక ఏ వెనక్కు జారిపోయిన పెద్దను లేక ఎవరినైనా సంతోషపర్చుటకు నేను చూడను. నేనే 100% దేవుని వాక్యము ఏమి చెప్తుందో అది చేయుటకు నిలువబడుదును” అని నీవు చెప్పగలవా?
అనేకులను నీతి మార్గములోనికి త్రిప్పు (దానియేలు 12:3) దానియేలు పరిచర్యకు, స్త్రీ పురుషుల అవసరత ఈనాడు మన దేశములో ఎంతో ఉన్నది. ఈ వచనము నీతిని గూర్చి బోధించే బోధకులగురించి చెప్పుటలేదు. కాని, వారి జీవితమే మాదిరిగా కలిగి ఇతరులను నీతి మార్గములోనికి త్రిప్పు వారి గూర్చి చెప్పుచున్నది. మనము లేఖనములలో మరియొక పరిచర్యను గూర్చి చదువుదుము. అది దానియేలు పరిచర్యకు పూర్తిగా వ్యతిరేకమైన లూసిఫరు పరిచర్య.
దేవునికి విరోధముగా తిరిగుబాటు చేయుటకు తనను వెంబడించుటకు కోటానుకోట్ల దేవదూతలను త్రిప్పుటలో లూసిఫరు విజయం సాధించాడు (ప్రకటన 12:4). అంతమంది దేవదూతలను తప్పుదారి పట్టించునట్లు లూసిఫరును దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఎందుకంటే దానిద్వారా తిరుగుబాటు మరియు అసంతృప్తి కలిగిన దేవదూతల నుండి పరలోకము పవిత్ర పర్చబడినది. వారి మధ్య లూసిఫరు లేచి వారిని దేవునికి విరోధముగా తిరుగుబాటుకు రేపక పోయినట్లయితే వారి దుష్ట హృదయములు బయటపడి యుండేవికాదు.
అందుచేత ఈనాడు కూడా సహోదర సహోదరిలు సంఘములో లూసిఫరు పరిచర్య కలిగియుండునట్లు దేవుడు అనుమతించును. వారు ఇంటింటికి వెళ్లి నేరారోపణ చేయునట్లును, కొండెములు చెప్పుకొనునట్లు, అబద్దములాడి చెడు మాట్లాడునట్లు దేవుడు అనుమతించును. దానిని బట్టి సంఘములో నుండిన తిరుగుబాటు, అసంతృప్తి మరియు లోకతత్వపు విశ్వాసులు గుర్తింపబడి, బయట పెట్టబడి, అటువంటి వారందరు ఏకమై సంఘము నుండి బయటకు వెళ్లిపోవుట ద్వారా క్రీస్తు శరీరమైన సంఘము పవిత్రపరచబడును.
దేవుడు ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం పరలోకములో మొదట లూసిఫరును ఆపనట్లుగానే, సంఘములో తిరుగుతూ లూసిఫరు పరిచర్య చేయుచుండు వారిని దేవుడు ఆపడు. అది దైవికమైన జ్ఞానము.
సాతాను గూర్చి మనము విశ్వాసులను హెచ్చరించునట్లు ఇటువంటి లూసిఫరులను గూర్చి కూడా హెచ్చరించవలెను (రోమా 16:17).కాని ఇటువంటి లూసిఫరులను గూర్చి భయపడము. వారు సంఘమును చెడగొట్టలేరు. వారు దేవుని వనములోనుండి గురుగులను మాత్రమే తీసివేయగలరు. దేవుడే సంఘమును భద్రపర్చును. తగిన సమయమందు సంఘమును అపవిత్ర పర్చువారిని ఆయన నాశనము చేయును (1 కొరింథీ 3:17). ఎవరూ నశించిపోవుట ఆయన కిష్టముండకపోవుటను బట్టి ఆయన దీర్ఘశాంతము చూపును. కాని దేవుడు తీర్పు తీర్చునప్పుడు ఆయన తీర్పు తీవ్రముగా ఉంటుంది.
అందువలన సంఘము ఎప్పుడు చీలిపోలేదని అతిశయించుట బుద్ధిహీనతయై యున్నది. ప్రారంభములో పరలోకములోనే దేవదూతలలోనే చీలికవచ్చినది. అటువంటి చీలికలు అవసరము. ఎందుకంటే “మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు” (1 కొరింథీ 11:19).
బైబిలులోని మొట్టమొదటి వచనములలో విభజన గూర్చి చదువుతాము. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను (ఆ.కా. 1:4). ఆ విభజన కూడా అవసరము. ఈనాడు సంఘములోని ప్రజలు ఆవిధముగా వేరుచేయబడనట్లయితే, భూమిపై దేవుని సాక్ష్యము అపవిత్రపరచబడును.
వెలుగు చీకటి నుండి వేరుపరచబడినది, దానిని నీవు చీలిక అని పిలువలేవు. అది శుభ్రపరచు ప్రక్రియ. అది లేనట్లయితే ఈ భూమిపై దేవుని యొక్క సాక్ష్యము అపవిత్రపరచబడును.
మనమందరము దానియేలు పరిచర్యను కలిగియుండి సంఘములో ఐకమత్యమును మరియు సహవాసమును కట్టవచ్చును లేక లూసిఫరు పరిచర్య కలిగి విబేధమును విత్తవచ్చును (సామెతలు 6:16-19).
మనము మధ్యస్థముగా ఉండలేము. ఆయనతో కలసి సమకూర్చనివాడు చెదరగొట్టు వాడని యేసు ప్రభువు చెప్పెను. సంఘములో రెండు పరిచర్యలేయున్నవి. అవి సమకూర్చుట మరియు చెదర గొట్టుట (మత్తయి 12:30).
భారతదేశములోని మన సంఘములలో ఎవరైతే పదవిని లేక గౌరమును లేక తర్కించే ఆత్మ లేదా వారికంటే చిన్నవారు ఆత్మీయముగా ఎదుగుటను చూచి అసూయపడేవారు మొదలగువారిని దేవుడు బహిర్గతపరచి జ్ఞానులను మరియు సంఘములో గొప్పవారనుకొనువారిని వారి ‘కుయుక్తి’ లో పట్టుకొని (1 కొరింథీ 3:19) మరియు సంఘమును ‘హైజాక్’ చేయాలని వారు వేసే రహస్య ప్రణాళికను వమ్ముచేశాడు. ప్రభువు మన గూర్చి జాగ్రత్త వహిస్తున్నాడనటానికి అది ఋజువు మరియు మన దేశములో తన నామ మహిమకొరకు స్వచ్ఛమైన సాక్ష్యము ఉండాలని దేవుని బలమైన కోరిక అయిఉన్నది.
సైతాను యొక్క కుయుక్తుల నుండి మనలను కాపాడుటకు ఎల్లప్పుడు ప్రభువు దృష్టి మనమీద ఉంటుంది కాబట్టి ప్రభువునకు స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించనియెడల దానికట్టువారి ప్రయాసము వ్యర్ధమే (కీర్తన 127:1). ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి నివసించెదరో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు (కీర్తన 133:1,3). ఐక్యత కలిగిన సంఘము మాత్రమే పాతాళలోక ద్వారములను జయించును. మన క్రైస్తవ సహవాస సంఘములలో పరిశుద్ధాత్మ బహుబలముగా పనిచేసి అటువంటి ఐక్యతను కలుగజేయునుగాక.
మనతో ఉన్నవారు కూడా గర్వించే అవకాశమున్నది కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభువు తనకార్యమును మనలో కొనసాగించునట్లు మనము నిత్యం ప్రార్ధించాలి. అయినప్పటికి మనకు దేవుని వాగ్ధానము ఉన్నది. “ ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించువారిని నీలోనుండి వెళ్ళగొట్టెదను___ మరియు దు:ఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించువాని జనశేషముగా నీ మధ్యనుండనిత్తును” (జెఫన్యా 3:11,12). తమ్ముతాము తగ్గించుకొను వారితోను, దీనులతోను దేవుని సంఘము కట్టబడును.
ఆయన సంఘము పవిత్రమైనదై ఉండాలని దేవుడు కోరుచున్నాడు గనుక సరియైన సమయములో రూకలు మార్చువారిని దేవాలయములోనుండి పంపినట్లు తమ్ముతాము హెచ్చించుకొనువారిని ఆయనే స్వయముగా తన విధానములో మరియు తన సమయములో సంఘములోనుండి తోలివేయును. సమస్త మహిమ మరియు ఘనత ఆయనకే చెల్లునుగాక ఆమెన్.