WFTW Body: 

లూకా 1:34,35లో గబ్రియేలుదూత మరియ యొద్దకు వచ్చినప్పుడు ఆమె, "నేను పురుషుని ఎరుగనిదానినే; యిదేలాగు జరుగుననియు, ఒక కన్యక గర్భవతి ఏవిధంగా అవుతుందనియు" అడుగుట సహజమే. అప్పుడు దూత ఇట్లనెను, "పరిశుద్ధాత్మశక్తి నీమీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును" పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు దేవునిశక్తిని మనలోనికి తెస్తాడు (అపొ.కా. 1:8 మరియు 10:38).

మరియలో యేసును కలుగజేయుటకు వచ్చిన దేవునిఆత్మ మనలోను క్రీస్తును కలుగజేయుటకు దేవునిఆత్మ మనలోనికి వచ్చును. పరిశుద్ధాత్ముడు మనలోను పనిచేస్తాడు మరియు మనం పరిచర్య చేయుటకు శక్తినిస్తాడు. మరియ గర్భములో బిడ్డ ఎదిగినట్లే, క్రీస్తు మనలో జీవించి మరియు క్రీస్తుసారూప్యము మనలో ఏర్పడుటకు సమయం పడుతుంది.

అనేకులు దేవునివాక్యాన్ని అంగీకరించి ఇట్లన్నారు, "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక"(లూకా 1:38). మరియ అటువంటి దైవజనురాలు కాబట్టి నేను రోమన్ క్యాథలిక్కును కాకపోయినప్పటికీ నేను ఆమెను ఎంతో గౌరవిస్తాను. భయభక్తులు గల ఒక యవ్వన స్త్రీ కొరకు దేవుడు ఇశ్రాయేలు దేశమంతయు చూచాడు. అప్పుడు సుమారు 18సంవత్సరములు గల మరియను ఆయన కనుగొన్నాడు. లూకా 1:46-55 వరకు చదివి ఆమె వాక్యముతో నింపబడి లేఖనములను ఎంతగా ఎరిగియున్నదో తెలుసుకొనగలరు. దేవునియెడల భయభక్తులు కలిగియున్న యెడల 18 సంవత్సరాలకే ఎంత అభివృద్ధిని పొందుతామో చూడండి. తాను ఎన్నుకునే వారి విషయంలో దేవుడు పొరపాటు చెయ్యడు.

ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నజరేతులో ప్రజలు ఏవిధంగా చెడ్డమాటలు చెప్పుకుంటారో ఆమెకు తెలియును. అది పరిశుద్ధాత్మ కార్యమని ఎవ్వరు నమ్మరు. క్రీస్తు శరీరమును తెచ్చుటకు ఆమె ఎటువంటి నిందనైనను భరించుటకు సిద్ధమైయున్నది. ఇప్పుడు దీనిని నీకు అన్వయించుకొనుము. మీ పట్టణములో క్రీస్తుశరీరమనే సంఘము నిర్మించబడాలని కోరుచున్నావా? దానిని ఘనత కోరక లేక "క్రీస్తును గూర్చిన నిందను" భరించుటకు కోరుచున్నావా? దేవుని పనిలో ఘనతను కోరువారిని దేవుడు సమర్ధించడు. అటువంటి వారు కేవలం ఒక సమాజాన్ని కడతారు గాని క్రీస్తుశరీరమైన సంఘాన్ని నిర్మించలేరు. నజరేతులోని మరియవలె క్రీస్తు శరీరమైయున్న సంఘమును నిర్మించాలంటే నిందలు. అపార్ధాలు, కొండెములు చెప్పబడుట ఉండును. అయితే ఆమె దాని గురించి చింతించలేదు. ఆమె ద్వారా క్రీస్తు శరీరధారియై వచ్చియున్నారు.

ఈనాడు కూడా అలాగే జరుగుతుంది. "మతానుసారమైన క్రైస్తవ్యము నుండి బయటకు వచ్చి మరియు నిందను భరించుటకు ఇష్టపడు వారిద్వారా దేవుడు క్రీస్తుశరీరమును నిర్మిస్తున్నాడు".

ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఆమె ఫిర్యాదు చెయ్యలేదు. ఆమె ఈనాటి యవ్వనస్థురాళ్ళ వలె ఉన్నదని ఊహించండి. అప్పుడు ఆమె "ఇక్కడ మనకు ఒక గది కూడా దొరుకలేదు. నేను బిడ్డను కనుటకు రహస్యస్థావరము లేకుండా పోయింది. పశువులపాకలో జన్మనివ్వాల్సి వచ్చింది. రెండు రోజులు ముందే బయలుదేరవలసి ఉన్నది గదా! ఎంత బాధ్యతలేని భర్తగా నీవు ఉన్నావు" అని అరిచేది. ఆవిధంగా సణుగులు, గొణుగుల మధ్యలో ప్రభువైనయేసు పుడతారని మీరు ఊహించగలరా? దానిని దేవుడు అనుమతించేవాడుకాదు. కాబట్టి ఫిర్యాదు చేయని అమ్మాయి ఆయనకు కావాలి. కష్టపరిస్థితులలోను మరియు బీదరికములోను ఉండుటకు నేర్చుకొనిన మరియను దేవుడు యేసుకు తల్లిగా ఉండుటకు ఎన్నుకున్నాడు. అందువలననే ఇశ్రాయేలీయులలో వేరే అమ్మాయిని ఆయన ఏర్పరచుకోలేదు.