వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు Religious or Spiritual
WFTW Body: 

జెఫన్యా 1:4,5లో ప్రభువిట్లనుచున్నాడు "నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను. మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలు దేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను". ఇశ్రాయేలీయులను వారి స్థాయికి దిగజార్చుటలో కనానీయులు సఫలీకృతులయ్యారు. కనానీయులకు దేవుణ్ణి ప్రత్యక్షపరుచుటకు ఇశ్రాయేలీయులు కనానుకు వెళ్ళియున్నారు కాని వారు ఇశ్రాయేలీయులను వారి స్థాయికి దిగజార్చియున్నారు.

నీవు బల్లమీద నిలువబడియున్నప్పుడు క్రిందినేల మీద ఉన్న వ్యక్తి నిన్ను క్రిందికి లాగుటకు ప్రయత్నిస్తే, అది చాలా సులువుగా ఉంటుంది. ఇదే యూదులకు జరిగింది. కనానీయులతో ఎటువంటి వ్యాపారమైనను పెట్టుకొనవద్దని దేవుడు వారిని హెచ్చిరించారు. కాని వారు వినలేదు. దాని ఫలితమేంటి? కనానీయులు దేవుడైన యెహోవాను ఆరాధించేటట్లు వారు చేయలేకపోయారు. యూదావారు బయలుదేవతను, సూర్యుని, చంద్రుని మరియు నక్షత్రములను ఆరాధించేటట్లు కనానీయులు చేశారు.

క్రైస్తవసంఘము కూడా వారి ఆరాధనను "భారతదేశపద్ధతిలో" చేయుటకు ప్రయత్నించినట్లయితే అలాగే జరుగుతుంది. చివరకు వారు కూడా క్రైస్తవేతరపద్ధతులలోనే చేస్తారు. ఒక "క్రైస్తవ" యాజకుడు(ప్రీస్ట్) వ్రాసిన ఒక పుస్తకముమీద పాము యొక్క ఏడు పడిగలమీద ప్రభువైనయేసు కూర్చొనినట్లుగా పటము వేశారు. ఏడంతల పరిశుద్ధాత్మకు ఆ పాము సూచనగా ఉందని వారి భావం. ఇండియనైజ్ చేస్తే ఇలాగే ఉంటుంది. మరికొన్ని సంఘాలలో లోకతత్వము ద్వారా దిగజారిపోవుచున్నారు.

ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని పెళ్ళి చేసుకొన్నట్లయితే, ఇలాగే జరుగుతుంది. అవిశ్వాసి విశ్వాసిని, అతని లేక ఆమెయొక్క స్థాయికి దిగజారుస్తారు. వివాహసమయములో కట్నం ఇవ్వమని అడుగుట కూడా చాలామంది క్రైస్తవులు చేస్తున్న అన్య ఆచారం. ఒక స్త్రీని, అమ్మే ఒక వస్తువుగా చేసే కట్నం తీసుకొనే ఆచారాన్ని దేవుడు ద్వేషిస్తాడు. ప్రవక్తలు ఇటువంటి వాటికి వ్యతిరేకంగా నిలిచియున్నారు మరియు ఇశ్రాయేలు యొక్క మతనాయకులు దాని నిమిత్తం వారిని ద్వేషించారు. ఈనాడు కూడా పరిస్థితి అలాగే ఉంది. కట్నానికి వ్యతిరేకంగా నిలిచే సంఘం ఇండియాలో దాదాపుగా లేదు. ఈ విషయంలో క్రైస్తవులు కూడా లోకస్థుల స్థాయికి దిగజారియున్నారు. వారు ప్రభువైనయేసు నామములో విశ్వాసముంచియున్నామని చెప్తారు గాని వారు వారి చుట్టూ ఉన్న లోకస్థులవలె జీవిస్తారు.

"యెహోవా యేర్పరచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును. మరియు ఇనుప గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును" (జెఫన్యా 1:8,9). నాయకులు అన్యదేశస్థుల ఆచారాలను వెంబడించి ధనాపేక్షగలవారై మరియు వారి యిండ్లను బలాత్కారముతో నింపియున్నారు. దేవుని ప్రజలయొక్క నాయకులు ధనాపేక్షగలవారై, తప్పుచేశారు. కాబట్టి ప్రవక్తలు మొదటిగా వారికి వ్యతిరేకంగా మాట్లాడారు. కాబట్టి ఈ నాయకులు ప్రవక్తలను "మతభ్రష్టులని" పిలిచి మరియు వారిని హింసించారు. ఈనాడు కూడా సంఘముయొద్దకు దేవుడు ప్రవక్తను పంపినట్లయితే, ధనాపేక్షకలిగి, రాజీపడే పాస్టర్లకు, బిషప్పులకు వ్యతిరేకముగా అతడు మాట్లాడును. పాతనిబంధనలోని ప్రతిఒక్క ప్రవక్త కూడా హింసించబడ్డాడు. ఒక్కరుకూడా తప్పించుకోలేదు. యూదా నాయకులను స్తెఫెను ఈ విధముగా ప్రశ్నించాడు, " మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకయుండిరి?" (అపొ. కా. 7:52). వారు ఒక్కరి పేరు కూడా చెప్పలేకపోయారు. నాయకుల యొక్క పాపములను వారు బట్టబయలు చేశారు. కాబట్టి వారు ప్రవక్తలును హింసించారు.

ప్రభువైనయేసు బోధించినప్పుడు, అప్పుడున్న త్రాగుబోతులకు, వ్యభిచారులకు హంతకులకు లేక సుంకరులకు వ్యతిరేకముగా బోధించినట్లు చూస్తామా? అలా చూడము. వాళ్ళకు వ్యతిరేకముగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. "పాపులను వెదకి రక్షించుటకే నేను వచ్చియున్నాను" అని ఆయన చెప్పారు. కాని వారి సొంతబైబిలు కలిగియుండి కూటాలలో బోధిస్తూ, ధనాపేక్షగలవారై మరియు వేషదారులుగా జీవిస్తున్నవారితో కనికరము లేకుండా మాట్లాడియున్నారు. కాబట్టి వారు ఆయనను చంపియున్నారు. నీవు ఈ నిజమైన యేసును మరియు నిజమైన ప్రవక్తలను వెంబడిస్తావా లేక లోకానుసారమైన స్నేహంచేసి మరియు వారితో సంతోషించే అబద్ధప్రవక్తలను మరియు "మరియొక యేసు" ను వెంబడిస్తావా?

తీర్పు మొదటిగా నాయకులమీదకు వస్తుంది. జెఫన్యా 1:12లో ప్రభువిట్లనుచున్నాడు, "ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షరసమువంటివారై-యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును". ప్రభువు ఆజ్ఞలను లెక్కచేయక బోధించుట ద్వారా ధనవంతులై, సుఖభోగాలను అనుభవిస్తున్న నాయకులు ఈనాడు కూడా సంఘంలో ఉన్నారు. "డైరెక్టరని", చీఫ్పాస్టరని, బిషప్పులని మొదలగు బిరుదులను వారు ప్రేమిస్తారు. ప్రభువు వారందరినీ బట్టబయలు చేస్తారు.

ఒక సంఘం ఆత్మీయముగా దిగజారినప్పుడు ప్రార్ధనలేని జీవితానికిని, ఇతరుల అవసరాలను పట్టించుకోని సుఖభోగాలతో జీవించుటకు నడిపిస్తుంది. అనేకమంది యౌవ్వనస్థులు ఆసక్తితోను, సమర్పణతోను, ప్రార్ధనతోను మరియు దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించుటతోను ఆరంభించారు. కాని 30సంవత్సరాల తరువాత "ధనమోసాన్ని" బట్టి వారు ఆసక్తిని కోల్పోయారు. శరీరయిచ్ఛలతో నమ్మకముగా పోరాడుచూ మరియు క్రైస్తవ్యములోని భ్రష్టత్వముతో పోరాడనట్లయితే నీవు కూడా అలాగే దిగజారే ప్రమాదమున్నది. నీవు యదార్ధముగా ఆరంభించినను కేవలం ఆదివారం మాట్లాడే బోధకుడిగా ఉండి, డబ్బును మరిఎక్కువగా పోగుచేసుకొంటూ, సౌఖ్యముగా జీవిస్తూ, అభిషేకం లేకుండా ఉంటావు. జెఫన్యా కాలములో అలాగే జరిగింది మరియు ఇప్పుడు కూడా జరుగుతుంది.

ఆ విధంగా పాపం చేయువారు "గ్రుడ్డివారైనడుతురు" (జెఫన్యా 1:17). నాయకులే గ్రుడ్డివారైనప్పుడు, వారిని వెంబడించే వారు కూడా గోతిలోపడే అవకాశముంటుంది.

అప్పుడు జెఫన్యా ఇట్లనుచున్నాడు, "దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు" (జెఫన్యా 2:3). "మరి ఎక్కువ దీనత్వాన్ని వెదకుడి", ఎంతమంచి వాక్యమిది. దేవుడు దీనులను ఆశీర్వాదిస్తాడని జెఫన్యా అర్ధం చేసుకున్నాడు. ఒకవైపేమో బాబెలోను యొక్క గర్వం మరియొక వైపు యెరూషలేములోనున్న దీనులు.

కయీను మరియు హెబేలు నుంచి మానవాళిలో బాబెలోను మరియు యెరూషలేమనే రెండు ప్రవాహలు ఉన్నట్లు మనం గమనిస్తాం. భ్రష్టుపట్టిన మతమే బాబెలోను. యెరూషలేమే నిజమైన సంఘం. ఈ సంఘం అద్భుతాలు, సూచకక్రియలతో కాదుగాని దీనత్వముతో కట్టబడుతుంది. దీనత్వాన్ని మరి ఎక్కువగా కోరుకొనుచూ మరియు ఎక్కువ దీనులగుటకు వారు విసుగుచెందరు.

మిగిలిన శేషములో ఉన్నవారు ఎదుర్కొనే అపాయమేమిటి? వేరే సంఘాలతో పోల్చుకొని, వారు అతిశయించుట. అపవాది దీనినే చెయ్యవలెనని కోరుచున్నాడు ఎందుకనగా నీవు ఆ విధముగా గొప్పగా ఆలోచించిన వెంటనే దేవుడు నీకు శత్రువై తరువాత నీవు కూడా వారి వలె అగుదువు. ఎంత త్వరగా వీరు బాబెలోనుగా మారే అవకాశమున్నదో ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి ప్రభువులో ఉన్న దీనత్వాన్ని పొందుకోవటాన్ని కోరండి. ఎల్లప్పుడు నీముఖం దుమ్ములో పెట్టుకొనుము. వేరే వారితో పోల్చుకోవద్దు. ప్రభువైనయేసుతోనే పోల్చుకొనుము. ఈనాడు దేవుని శేషమైన ప్రజలకు నేను చెప్పే సలహా ఇదియే.