ప్రవచనత్మాకమైన పరిచర్యనుగూర్చి మీకు చూపించవలెనని నేను కోరుచున్నాను. 2 రాజులు 3:15 లో ఎలీషా ప్రవచించుటకు దేవుని మనసును వెదకుటకు తనయొద్దకు వీణ వాయించగలయొకనిని తీసుకొని రమ్మనెను. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి దిగివచ్చెను గనుక అతడు శక్తివంతముగా ప్రవచించెను. అక్కడ దైవికమైన సంగీతమును చూడగలము.
ఆదివారపు ఉదయపు కూటములలో, స్తుతి మరియు ఆరాధన సమయములో నా జీవితములో అనేకసార్లు దేవుని హస్తము నామీదికివచ్చి, ఆకూటమునకు రాకముందు లేని వాక్యమును దేవుడు నాకు ఇచ్చియున్నాడు. అభిషేకము కలిగిన సంగీతము, ఎలీషా మీదకు ప్రవచనాత్మను తెచ్చుటకు శక్తిని కలిగియున్నది.
కొన్నిసార్లు ఒక ప్రవక్తకు కూడా వాద్యగాండ్ల అవసరము ఉండును. కాబట్టి సంగీతమును నడిపించేవారు అభిషేకించబడినవారై యుండాలి. వారు కేవలము మంచి వాద్యగాండ్లైతే సరిపోదు. వారు మంచి మనస్సాక్షిని కలిగియుండి అభిషేకము గలవారై యుండాలి. దావీదు పాటలు పాడేవారిని మరియు వాద్యగాండ్లను నియమించాడు మరియు వారు అభిషేకించబడవలసి వచ్చింది. ఆసాపులాంటి సంగీత నాయకులు అద్భుతమైన 12 కీర్తనలు వ్రాసారు (కీర్తనలు 50,73-83). ఇద్దరు సంగీత నాయకులు ప్రవక్తలని పిలువబడ్డారు. వారు హేమాను ( 1 దిన. 25:5) మరియు యెదూతూము (2 దిన. 35:15).
అభిషేకించబడిన ప్రవక్తలను ప్రోత్సహించి మరియు సహాయపడుటకు అభిషేకించబడిన వాద్యగాండ్లు దేవునికి అవసరము. ఆవిధముగా సంఘము కట్టబడుతుంది. మీలో కొందరు ప్రవక్తలుగా పిలువబడక పోవచ్చును. వాద్యగాండ్లుగా పిలువబడియుండవచ్చును. అభిషేకము కలిగిన వాద్యగాండ్లుగా ఉండుడి.
ఆదినము వాద్యగాడు లోకానుసారముగా వీణను వాయించినయెడల, బహుశా ఎలీషా ప్రేరేపించబడియుండడు. ఆసంగీతము కొద్దిగా పరలోక సంబంధమైనదిగా ఉన్నది. పరలోక సంబంధమైన మరియు లోకానుసారమైన సంగీతము కలదు. పరలోకసంబంధమైన సంగీతము నీవు వినినప్పుడు దానిని నీవు స్పర్శించి మరియు దేవుని ఆరాధించుటకు నీవు పురికొల్పబడుదువు. ఒక రకమైన సంగీతము, వాద్యగాండ్లనే మెచ్చుకొనేటట్లు చేస్తుంది. నీవు అభిషేకమును కలిగిన వాద్యగాడివైతే, దేవుని ఆరాధించుటకు ప్రజలను నడిపించి మరియు కూటములోనికి ప్రవచనాత్మను తీసుకొనిరాగలవు.