వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
WFTW Body: 

మత్తయి 8వ అధ్యాయములో ప్రభువైనయేసు చేసిన కొన్ని అద్భుతాలు గురించి చదువుతాము. ఆయన బోధించుట మాత్రమేగాక ప్రజలగురించి జాగ్రత్త వహించారు. ఎవరూ ముట్టుకొనని కుష్టురోగులను ఆయన ముట్టుకొనియున్నారు. ఆయన వారిని స్వస్థపరచుటయేగాక వారికెంతో విలువనిచ్చారు. ఒక రోమా శతాధిపతి ఎంతో దీనుడైయుండి మరియు విశ్వాసముతో నిండినవాడై, తన దాసుని స్వస్థపరచుటకు ప్రభువు తనయింటికి వస్తానని చెప్పినప్పటికీ, అతడు “ప్రభువా, నీవు నాయింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడనుగాను. నీవు మాటమాత్రము సెలవిమ్ము అప్పుడు నాదాసుడు స్వస్థపరచబడును” అని అన్నాడు (మత్తయి 8:8). విశ్వాసము మరియు దీనత్వము రెండు కలసి వెళతాయి. వెంటనే ప్రభువైనయేసు ఇట్లన్నారు “ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదు” (మత్తయి 8:10).

ప్రజలను మెచ్చుకొనుటలోను మరియు ప్రోత్సహించుటలోను ప్రభువైనయేసు ఎంతో ప్రవీణుడు(ఆరితేరినవాడు). ఒకసారి అందరిలో ప్రభువు పేతురును ఇలా మెచ్చుకున్నాడు, సీమోను బర్‍యోనా, నీవు ధన్యుడవు పరలోకమందున్న నాతండ్రి “నీకు ఈ సంగతి బయలుపరచియున్నాడు” (మత్తయి 16:17). ఆయన నతనయేలును ఇలాగున మెచ్చుకున్నాడు(ప్రశంసించాడు) “ఇదిగో ఇతనియందు ఏకపటమునులేదు” (యోహాను 1:47). వారెవరు పరిపూర్ణులు కాకపోయినప్పటికీ ప్రభువైనయేసు వారిని ఎంతో విస్తారంగా ప్రశంసించారు. రోమా శతాధిపతి, పేతురు మరియు నతనియేలు లోపముగల అసంపూర్ణులు. కాని వారందరిలో ప్రశంసించుటకు ప్రభువు ఏదొకటి కనుగొన్నారు. రక్షణపొందని వారిలోను, విగ్రహారాధికులలోను, శతాధిపతిలోను అనగా బైబిలునుగాని లేక నిజదేవునినిగాని కొంచెంముకూడా ఎరుగనివారిలోను మంచిని ప్రశంసించుటకు ఆయన వెనుదీయలేదు. తన జీవితకాలమంతటిలో ఆ రోమాశతాథిపతి ప్రభువు తనతో అనిన మాటలను మరచిపోతాడనుకొనుచున్నారా? మరచిపోడు. ఆ మాటలనుబట్టి అతడు ఎంతో ప్రోత్సహించబడి, బహుశా ప్రభువైనయేసుకు ఒక శిష్యుడుగా మారియుండవచ్చును.

ఇక్కడ మనము నిజమైనభక్తిని మరియు పరలోకరాజ్యము గురించి కొంత నేర్చుకొనుచున్నాము. ఆదాము సంతానము ప్రజలను మెచ్చుకొనుటలో ఎంతో పిసినిగొట్టులుగా ఉండి మరియు తీర్పు తీర్చుటలో ఎంతో ప్రావీణ్యము కలిగియుంటారు. వారు ఉప్పొంగి పోతారేమోనని ఇతరులను మనం బహిరంగముగా మెచ్చుకొనము. నిజముగా భయభక్తులుగల వారినికూడా మనం మెచ్చుకొనలేము. ఈ అలవాటును చాలామంది విశ్వాసులు క్రీస్తులోనుండి నేర్చుకొనలేదు. సాతానునుండి కలిగే ముఖస్తుతులు మనం చేయకూడదు, కాని నిజముగా యోగ్యమైనవారిని మెచ్చుకొనుట దేవుని లక్షణము. ఒక దైవజనుడు ఒక సహోదరుని మెచ్చుకొనినట్లయితే, అతడు ప్రభువైనయేసును వెంబడించుటకు ఎంతో ప్రోత్సహించబడతాడు.