వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు పురుషులు
WFTW Body: 

పౌలు యేసుక్రీస్తుప్రభువుయొక్క రాయబారియైయున్నాడు (2 కొరింథీ 5:20). యేసుక్రీస్తుయొక్క రాయబారికి 12 గుర్తులు ఉన్నవి. ఈ గుర్తులు మీ జీవితములో ఉన్నవేమో ఆలోచించండి.

1. అతడు దేవునిచేత పిలువబడియున్నాడు (2 కొరింథీ 1:1). "దేవునిచిత్తము వలన క్రీస్తుయేసు యొక్క అపొస్తలుడు". అతడు తన్నుతానే పిలుచుకొనలేదు. దేవుడే అతనిని పిలిచియున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయము. దేవుడు నిన్ను పిలువనియెడల రాయబారిగా నీవు పరిచర్య చెయ్యవద్దు.

2. అతడు ఎంతో నిష్కపటమైనవాడు(కపటములేనివాడు)(2 కొరింథీ 1:12). యధార్ధతను మరియు నిష్కపటతను అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనయొద్దనుండి కోరుచున్నాడు. నీలో చాలా బలహీనతలు ఉన్నప్పటికీ, నీవు యధార్ధవంతుడవును మరియు నిష్కపటుడవును అయినట్లయితే దేవునికి నిజమైన సేవకుడవుగా ఉండవచ్చును.

3. అతడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడియున్నాడు (22వ వచనము). నీకు ఎన్ని అర్హతలున్నప్పటికీ నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొందనియెడల దేవుని సేవించుటకు ప్రయత్నించవద్దు. దానిని మరచిపోయి, ఏదైనా వేరే పని చేసుకొనుము.

4. తాను ఎవరికైతే పరిచర్య చేశాడో వారిని మొదటిగా అతడు ప్రేమించాడు(2 కొరింథీ 2:4). మీ యెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.

5. అతడు సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడియున్నాడు (2 కొరింథీ 3:5). "మా సామర్ధ్యము దేవునివలననే కలుగుచున్నది". అతడు మనుష్యుల మీద ఆధారపడలేదు. అతడు ప్రజలు ఇచ్చిన వస్తువులను ఉపయోగించుకొనియుండవచ్చును గాని ప్రజలమీద ఆధారపడలేదు. అతడు దేవుని మీదనేగాని మరిదేని(ఎవరి)మీదను ఆధారపడలేదు.

6. అతడు ఎప్పుడైనను అధైర్యపడి విడిచిపెట్టలేదు(2 కొరింథీ 4:1). "కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణించబడినవారమై అధైర్యపడము". పరిచర్య విడిచిపెట్టాలని నీవు శోధించబడవచ్చును కాని పౌలు మాత్రము విడిచిపెట్టలేదు.

7. అతడు ఇతరులకు మాదిరిగా ఉన్నాడు(2 కొరింథీ 6:3,4). "ఏ విషయములోనైనను అభ్యంతరము కలుగజేయక దేవుని పరిచారలకులమైయున్నాము". తన జీవితముద్వారాను మరియు అనేక పరిస్థితులలో తన ప్రవర్తనద్వారాను అతడు ఇతరులకు మాదిరిగా ఉన్నాడు.

8. అతడు ఎవరికి అన్యాయము చేయలేదు. ఎవరినీ తనకొరకు ఉపయోగించుకొనలేదు(2 కొరింథీ 7:2). ఇతరులను తనకు సేవకులనుగా చేసుకొని, వారితో తన స్వంతపనులను చేయించుకొనుటకు అతడు ప్రయత్నించలేదు. ఇతరుల ఆతిథ్యమును తన స్వార్ధమునకు ఉపయోగించుకొనలేదు.

9. ధనమును అతడు జ్ఞానముతో వాడియున్నాడు(2 కొరింథీ 8:20,21; 11:19). ధనము విషయములో అతడెవరికిని భారముగాలేడు. ధనమును ఉపయోగించుటలో అతడు ఎంతో జ్ఞానము కలిగియున్నాడు. తన పరిచర్యను అంగీకరించక, స్వీకరించనివారినుండి ధనమును తీసుకొనలేదు.

10. దేవుడు తనను ఉంచిన పరిధిలోనే అతడు నిలిచియున్నాడు(2 కొరింథీ 10:13).

11. అతడు బాహ్యముగా శ్రమపడుటకు ఇష్టపడ్డాడు(2 కొరింథీ 11:23-33). మరియు తన శరీరములో ముల్లును బట్టి కూడా శ్రమపడుటకు ఇష్టపడ్డాడు(2 కొరింథీ 12:9,10). దేవుడు తన జీవితములో అనుమతించిన శ్రమలను అతడు అంగీకరించియున్నాడు.

12. విశ్వాసులను పరిపూర్ణతలోనికి నడిపించాలని కోరియున్నాడు(2 కొరింథీ 13:9). "మీరు బలవంతులైయుండిన యెడల మేము సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావలెననియే ప్రార్ధించుచున్నాము". పౌలు ఈవిధముగా జీవించియున్నాడు. మనము అతని అడుగుజాడలలో నడిచి మరియు ప్రభువును సేవించెదముగాక ఆమేన్.