వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   ఆత్మతో నింపబడిన జీవితం
WFTW Body: 

ఎఫెసీ 5:18లో "మద్యముతో మత్తులైయుండక ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులైయుండుడి". ఇక్కడ రెండు ఆజ్ఞలు ఉన్నవి. మొదటిది, "మద్యముతో మత్తులైయుండకుడి". రెండవది, "ఆత్మ పూర్ణులైయుండుడి".

క్రైస్తవులు మొదటి ఆజ్ఞకు లోబడి మరియు రెండవ ఆజ్ఞను తీవ్రముగా తీసుకొనరు ఎందుకని? లేఖనములలోని సత్యమును మన మనస్సులు గ్రహించకుండునట్లు సాతాను ఏవిధముగా గ్రుడ్డితనము కలుగజేస్తాడో అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అనేకమంది విశ్వాసులు మొదటి దానిని ఆజ్ఞగా గైకొని, రెండవ దానిని సలహాగా తీసుకొందురు. కాని ఈ రెండు కూడా ఆజ్ఞలైయున్నవి మరియు ముఖ్యమైయున్నవి. సంవత్సరములో ఒక్కసారి త్రాగుటయైనను తీవ్రమైన విషయం అయినట్లయితే, సంవత్సరములో ఒకరోజు అయినను ఆత్మ పూర్ణులమైయుండకపోవుట కూడా అంతే తీవ్రమైనది. దీనిని ఆ విధముగా ఎప్పుడైనను చూశారా?

ఎఫెసీ 5:18లో మనము ఎల్లప్పుడు ఆత్మతో నింపబడుచూ ఉండాలని చెప్పబడింది. అనగా "ఆత్మపూర్ణులైయుండుడి", "ఎల్లప్పుడు ఆత్మచే నింపబడుచు యుండుడి". అంతేగాని ఒక్కసారి నింపబడుడి అని ఇక్కడ లేదు. నీవు ఉదయకాలమున ఆత్మతో నింపబడినయెడల అలాగా మధ్యాహ్నం, సాయంత్రము అనగా ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుట మన అవసరమైయున్నది. పరిశుద్ధాత్మతో నింపమని ఎల్లప్పుడు దేవునిని అడుగుచూ ఉండాలి. అపొస్తలులకార్యములలో అటువంటి వారిని "పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ, పురుషులు" అని చెప్పబడింది.

పరిశుద్ధాత్మతో నింపబడియున్నామని అనుటకు గుర్తు ఏమనగా మనం మాట్లాడేవిధానము మార్పు చెందుతుంది. మన నాలుక అగ్నిజ్వాలల వంటి నాలుకగా మార్పు చెందుతుంది (అపొ.కా. 2:3). ఇది అన్యభాషలో మాట్లాడుట కాదు కాని దేవుని ప్రేమతోను, పవిత్రతతోను మన సొంతభాషలో మాట్లాడుట. మన భాష పరలోకసంబంధమైనదిగా మారుతుంది. ఇక్కడ మాట్లాడుట గురించి ఈ వచనములో చెప్పబడింది, "ఒకనినొకడు కీర్తనలతోను, సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైనయేసు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండి" (ఎఫెసీ 5:19,20) . మనము ఆత్మతో నింపబడే కొలది, మనలో ఉన్న కొండెములు చెప్పుట, నిందలువేయుట, ద్వేషము మరియు కోపంతో ఉన్న ఆత్మకు బదులుగా కృతజ్ఞతతో నిండిన ఆత్మతో నింపబడెదము. ఎఫెసీ 5:18 తరువాత వచనాలలో అనగా ఎఫెసీ 5:19 నుండి ఎఫెసీ 6:24 వరకు ఉన్న వచనములలో ఆత్మపూర్ణులైన వారి యొక్క గుణలక్షణములను గూర్చి చెప్పబడింది. కృతజ్ఞతలు చెల్లించుటతో ఆరంభమై సంఘములోను మరియు కుటుంబములోను ఒకరికొకరు లోబడుతూ (ఎఫెసీ 5:21) మరియు అపవాది తంత్రములను ఎదురించెదరు (ఎఫెసీ 6:11) . కాబట్టి ఈ భూమిమీద క్రైస్తవజీవితములోను మరియు పోరాటములోను ఉన్న రహస్యం "ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడియుండుట".

ఆత్మతో నింపబడని యెడల దేవునిని సరిగా స్తుతించలేము. ఆత్మతో నింపబడని యెడల సరియైన భర్తగా గాని, భార్యగా గాని జీవించలేము. ఆత్మతో నింపబడని యెడల మన పిల్లలను సరిగా పెంచలేము. ఆత్మతో నింపబడకుండా అపవాది తంత్రాలను ఎదురించలేము. క్రైస్తవజీవితములోని ప్రతి విషయము ఆత్మతో నింపబడుట మీదనే ఆధారపడియున్నది.

కుటుంబములో ఉన్న మూడు సంబంధాలు గురించి ఇక్కడ చెప్పబడింది. అవి ఏమనగా, భార్యభర్తలు (ఎఫెసీ 5:22-33) , పిల్లలు మరియు తల్లిదండ్రులు (ఎఫెసీ 6:1-4) మరియు యజమానులు మరియు దాసులు (ఎఫెసీ 6:5-9) . ఇక్కడ గృహములలో పని చేయువారి గురించియు మరియు ఆఫీసులోగాని, కంపెనీలోగాని లేక ప్రభుత్వములోగాని యజమానులను కలిగి పనిచేసే వారి గురించి చెప్పబడింది. కాబట్టి గృహములోగాని, ఆఫీసులోగాని మనము యజమానులుగాను లేక దాసులుగాను ఎలా ప్రవర్తించాలో చెప్పబడింది. గృహములోను మరియు ఆఫీసులోను మనమందరము ఎక్కువ సమయము గడిపెదము. మరియు ఆత్మతో నింపబడిన వ్యక్తి గృహములోను, తన పనిచేసే స్థలములోను క్రీస్తుయొక్క ఆత్మను వ్యక్తపరుస్తాడు. ఆత్మతో నింపబడుట ద్వారా మాత్రమే మనము క్రీస్తు శరీరముగా నిర్మించబడగలము.