వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   ఆత్మతో నింపబడిన జీవితం
WFTW Body: 

ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి. మరియు వారు - ఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి(ప్రకటన 13:4).

భూలోకమంతయు సాతానుని ఆరాధించుచున్నది. మొదటనుండి ఎల్లప్పుడు సాతాను దానినే కోరుకొనెను. యెషయా 14:14 లో లూసిఫర్, దేవునివలె ఉండవలెనని కోరియున్నట్లు చూచుచున్నాము. దేవుడు అప్పటికే - జ్ఞానము, సౌందర్యము, సామర్ధ్యము మరియు అస్వాభావికమైన వరములు అనే అద్భుతకరమైన వరములను లూసిఫర్కు ఇచ్చెను. అంతకంటే అతనికి కావలసినదేమున్నది? అయినను దేవుడు ఆరాధించబడుచున్నట్లుగా తాను కూడా ఆరాధించబడవలెనని కోరియున్నాడు. ఆవిధముగా అతడు దయ్యమువలె మారెను. ఎప్పుడైనను నీవు ప్రజలమెప్పును కోరినయెడల, సాతాను కోరుకొనినదే నీవు కూడా కోరుచున్నావని గుర్తుపెట్టుకొనుము. ప్రజల మెప్పును కోరుట అనునది సైతాను సంబంధమైనది. చివరకు సాతాను, లోకమంతా తనను ఆరాధించునట్లుగా చేసెనని ఇక్కడ మనము చూచుచున్నాము. ఈ రోజున కూడా కొంతవరకు ఆవిధముగా జరుగుచున్నది. కాని అది ఇంకా ఎంతో ఎక్కువ కాబోవుచున్నది.

వారు క్రీసువిరోధిని కూడా ఆరాధించిరి. క్రీసువిరోధిని ఆరాధించుట మరియు మనుష్యులను ఆరాధించుట కూడా ఎక్కువగా విస్తరించుచున్నది. ఈదినమున మనము “ఓ దేవా! నీవంటి వారెవరు?” అని చెప్పుచూ ఆరాధించినట్లే, వారు కూడా “ఈ మృగము వంటివారెవరు?” అని అదేమాట చెప్పుచూ సాతానుని మరియు క్రీసువిరోధిని ఆరాధించెదరు. క్రీసువిరోధిని ప్రజలు “క్రీసువిరోధి” అని పిలువరు కాని గౌరవప్రదమైన పేరుతో పిలిచెదరు.

1 యోహాను 2:18 లో “చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తువిరోధి వచ్చునని వింటిరిగదా ఇప్పుడు అనేకులైన క్రీస్తువిరోధులు బయలుదేరియున్నారు. ఇది కడవరిగడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము. వారు మనలోనుండి (అనగా సంఘములోనుండి) బయలుదేరియున్నారు” అని చదువుచున్నాము. మొదటి శతాబ్దములోని సంఘములో కూడా క్రీసువిరోధిఆత్మను కలిగినవారున్నారని ఇది మనకు భోదించుచున్నది. ఈ దినములలో ఉన్న క్రైస్తవ్యములో కూడా అటువంటి ప్రజలను కనుగొనగలము. క్రీసువిరోధిఆత్మను కలిగిన ప్రజలు రాజకీయప్రపంచములోను మరియు “క్రైస్తవ సంఘములు” గా పిలువబడే సంఘములలోను మనము కనుగొనగలము.

క్రీసువిరోధిఆత్మయొక్క గుర్తు ఏమిటి? చాలా గుర్తులు ఉన్నవి. కాని ముఖ్యమైన గుర్తులలో ఒకటి - ఇతరుల మెప్పును మరియు ఇతరులచేత హెచ్చింపబడుటను వారుకోరెదరు - అది ఇతరులనుండి ఆరాధనను స్వీకరించుటతో సమానము. ఏ సంఘములోనైతే ఒకరిమెప్పును ఒకరు కోరుకునే విధానమునకు వ్యతిరేకముగా పోరాడరో, త్వరగా ఆసంఘములో క్రీసువిరోధిఆత్మ పరిపాలించును.

మన శరీరములలో మనుష్యులమెప్పునుకోరే కోరికను కనుగొనగలము. ఇతరుల మెప్పును లేక ఘనతను కోరుట అనునది చిన్నవిత్తనమువలె లేక పసిబిడ్డవలె చిన్నకోరికతో మొదలై పెరుగుచుండును. అది చివరకు ఆరాధించబడవలెననే కోరికతో ముగియును ఇదియే క్రీసువిరోధిఆత్మ. గనుక ఎప్పుడైనను మనలో ఇటువంటి చిన్న పాముగుడ్డును చూచినప్పుడు దానిని చితుకగొట్టవలెను. లేనియెడల అది ఒకరోజు సర్పముగా మారును. ఇటువంటి ఆత్మ ఉన్నతమైన దూతలలోనే ప్రత్యక్షమైయుండగా, మనలో ఎవరొకరిద్వారా ఎందుకు ప్రత్యక్షముకాదు? వినుటకు చెవులు గలవాడు వినునుగాక.

భూలోకమంతయు క్రీసువిరోధిని వెంబడించునని మనకు చెప్పబడియున్నది. లోకము క్రీస్తును వెంబడించలేదు. “ఈయన మాకు వద్దు. ఈయనను సిలువవేయుమని” బిగ్గరగా కేకవేసిరి. కాని క్రీసువిరోధి అబద్ధప్రవక్తలవలే మృధువుగా మాట్లాడునుగనుక , వారు అతనిని వెంబడించెదరు.

క్రీస్తునియొక్క ఆత్మ, మనకు నిందలను, పరిహాసమును మరియు వ్యతిరేకతను తెచ్చును. క్రైస్తవులు లోకములో పేరుప్రతిష్టలను వెదకినప్పుడు, క్రీసువిరోధివలె చాలా అపాయకరమైన స్థలములో ఉందురు. ప్రజలు యేసును రాజుగా చేయుటకు బలవంతము చేయుచున్నారని యెరిగి, ఆయన ఉప్పొంగిపోలేదు. మనుష్యుల అభిప్రాయములు చెత్తబుట్టలో వేయుటకు మాత్రమే తగును. గనుక ఆయన తిరిగి మరియు వారితో ఇట్లనెను, “నన్ను వెంబడించుటకు ముందుగా నీ తండ్రిని, తల్లిని, సహోదర సహోదరిని, నీవు కలిగిన వాటిని మరియు నీ ప్రాణమును ద్వేషించవలెను” (లూకా 14:26-33). ఇటువంటి కఠినమైన మాటలు వినినవారు అభ్యంతరపడిరి. ఈ రోజున కూడా, నిజమైన క్రీస్తుసంఘము అదేమాటలను ప్రకటించును మరియు అవి కఠినముగాఉండి క్రీస్తు దినములలోవలెనే అనేకులు అభ్యంతరపడెదరు. అప్పుడు క్రీస్తును గూర్చిన నింద వారిమీదకు వచ్చును. ఆవిధముగా క్రీసువిరోధిఆత్మనుండి మనము కాపాడబడెదము. కాని బాబెలోను క్రైస్తత్వము ఆ వర్తమానమును ప్రకటించదు గనుక గౌరవమును పొంది, క్రీసువిరోధి ప్రత్యక్షపరచబడుటకు మార్గమును సులభముచేయును.