వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   ఆత్మతో నింపబడిన జీవితం
WFTW Body: 

ప్రభువుకొరకు హృదయపూర్వకముగా జీవించని ఒక రక్షణ పొందిన యౌవ్వనస్థుడు నాకు తెలియును. ఒకరోజు అతడు కలలో తాను చనిపోయి మరియు పరలోకానికి వెళ్ళినట్లు చూచాడు. తన జీవితముగూర్చి అక్కడ "నీవు క్షమించబడియున్నావు" అను మాటను చూచాడు. అతడు క్షమించబడి మరియు పరలోకములో ఉన్నందుకు సంతోషించాడు. కాని ప్రత్యేక మహిమగల కొందరు విశ్వాసులను పరలోకములో అతడు చూచాడు. వారు భూలోకములో ప్రభువుకొరకు తమ ప్రాణమును కోల్పోయిన హతసాక్షులు. వారు ప్రభువుకొరకును మరియు ఆయన సంఘముకొరకును తమ సమస్తమును ఇచ్చియున్నారు. వారు వారికున్న ధనమును, వారికున్న పేరుప్రతిష్టలను మరియు ఈ లోకము విలువ నిచ్చేదానంతటినీ త్యాగము చేశారు. ఆ మనుష్యుడు పరలోకములో వారి మహిమను చూచి అసూయపడ్డాడు. అప్పుడు కలలో ప్రభువైనయేసు అతనియొద్దకు వచ్చి, భూమిమీద నీవు కేవలము నీకొరకే జీవించియున్నావు. కాబట్టి వారివలే నీవు మహిమను కలిగిలేవని చెప్పారు. అతడు తన హృదయములో ఎంతో నొచ్చుకొని, నిత్యత్వమంతయు తానెంత స్వార్ధపరుడో గుర్తుంచుకొనవలసి వస్తుందని తాను గుర్తించాడు. తనకు రెండవ అవకాశమివ్వమని ప్రభువును వేడుకున్నాడు. మరణించిన తరువాత రెండవ అవకాశము ఉండదని ప్రభువు అతనితో చెప్పాడు. తరువాత అతడు నిద్రనుండి మేలుకొని తాను చూచినదంతయు కలలోనని తెలుసుకొని ప్రభువును స్తుతించాడు. తాను ప్రభువుకొరకే జీవించాలని తీర్మానించుకొని తరువాత గొప్ప దైవజనుడైయున్నాడు.

అనేక సంవత్సరములనుండి సంఘములో నీవు పొందుచున్న ఆత్మీయఆహారమునకు నీవు విలువనిచ్చినట్లయితే, అప్పుడు నీవు సంఘమును ఎంతో ఎక్కువగా మెచ్చుకుంటావు. ఎవరైనా మిమ్ములను ఒకపూట భోజనమునకు ఆహ్వానిస్తే మీరు వారికెంత కృతజ్ఞత కలిగియుంటారో గమనించండి. సంఘములో అనేక సంవత్సరములనుండి ఎల్లప్పుడు మీరు పొందుచున్న పరలోకసంబంధమైన ఆత్మీయఆహారమును బట్టి ఎంత కృతజ్ఞత కలిగియుండాలి.

దీనిని మరొక విధముగా చూద్దాము. ఉదాహరణకు ఎవరైనను ఒకరు మీపిల్లల బాగోగులను చూచుచు, అపాయముల నుండి వారిని కాపాడుచు, రోగులైనప్పడు వారిని పరామర్శిస్తూ, నిరాశపడినప్పుడు వారిని ప్రోత్సహిస్తూ మరియు వారికి మంచి మార్కులు వచ్చునట్లు చదివించియున్నారనుకుందాము. మరియు ఆ వ్యక్తి ఒకరోజు లేక రెండురోజులు కాదు గాని అనేక సంవత్సరములు ఆవిధముగా చేసినట్లయితే, మీరు అతనికి ఎంత కృతజ్ఞత కలిగియుంటారు.

మీ పిల్లలు సంఘములో కాపాడబడినందుకు కనీసం మీరు అంత కృతజ్ఞత కలిగియుంటున్నారా? స్థానికసంఘము నుండి వారు పొందిన మేలులన్నిటినిబట్టి కృతజ్ఞత కలిగియుండనివారు ఆత్మీయముగా వృద్ధినిపొందరు. సంఘము ద్వారా అనేక సంవత్సరములనుండి ఉచితముగా పొందిన మేలులన్నిటినిబట్టి కొంచెం కూడా కృతజ్ఞత లేనివారు సంఘములో నుండి చివరకు వెళ్ళిపోయారు.

లూకా 17:13లో పదిమంది కుష్టురోగులు స్వస్థత పొందియున్నారు. కాని వారిలో ఒక్కడు మాత్రమే ప్రభువుయొద్దకు తిరిగి వచ్చి కృతజ్ఞతలుచెల్లించి మరియు దేవుని మహిమపరిచాడు. వారందరు అవసరములో ఉన్నప్పుడు యేసుప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేశారు. కాని వారు స్వస్థతపొందిన తరువాత తొమ్మిదిమంది, వారు పొందిన మేలునుబట్టి కొంచెం కూడా కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. ఒక్కడు మాత్రమే గొప్పశబ్దముతో దేవుని మహిమపరచుచూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు.

స్వస్థతపొంది కూడా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించనివారు పాలస్తీనాలో అనేకమంది ఉండవచ్చును. కాని ఈ సమరీయుడు ప్రభువుయొద్దకు వచ్చి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభువుతో అతడు ఈ విధముగా చెప్పియుండవచ్చును "యేసుప్రభువా నీవు నన్ను ముట్టియున్నావు కాబట్టి నా జీవితము ఎంతో వేరుగా ఉండబోతుంది. ఎంతో మంచి జీవితము నాకిచ్చియున్నావు. నేనిప్పుడు పట్టణములోనికి వెళ్ళవచ్చును. నాకుటుంబమునకు నేను తిరిగి వెళ్ళవచ్చును. నా జీవితములోనికి గొప్ప సంతోషాన్ని తెచ్చియున్నావు. నీవు నాకిచ్చిన ఆశీర్వాదములన్నిటిని బట్టి నేను నీకు రుణపడియుంటాను. నేను కలిగియున్నదంతయు నీవు నాకనుగ్రహించినదే. నీవు నాకిచ్చిన సకల ఆశీర్వాదములను బట్టి నేను ఎంతో కృతజ్ఞత కలిగియుంటాను".

అతనియొక్క కృతజ్ఞత కలిగిన వైఖరిని ప్రభువు మెచ్చుకున్నాడు.

అప్పుడు ప్రభువు అతనికి ఎంతో ఎక్కువగా అనుగ్రహించాడు. నీ విశ్వాసమే నిన్ను రక్షించిందని ప్రభువు అతనితో చెప్పారు. ఆ స్వస్థతపొందిన కుష్టురోగి, స్వస్థతకంటే ఎంతో ఎక్కువగా పొందుకున్నాడు. అప్పటికే అతడు స్వస్థతను పొందుకొనియున్నాడు. కృతజ్ఞత కలిగియున్నాడు కాబట్టి అతడు రక్షణ కూడా పొందియున్నాడు. పరలోకములో నేను అతనిని కలుసుకుంటాననే నిశ్చయత నాకు ఉన్నది. కాని ఆ తొమ్మిదిమందిలో ఎవరినైనను కలుసుకుంటాననే నిశ్చయత నాకు లేదు. నీవు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఇతరుల కంటే నీవు ఎక్కువగా పొందుకుంటావు.

భూమిమీద ఆయన శరీరమైన జీవముగల సంఘములో ప్రభువు ఉన్నాడు. ఆయన శరీరమునకు విలువనిచ్చుట ద్వారా ప్రభువుయెదుట కృతజ్ఞతగలవారమైయుందుము. నీవు సంఘమునకు విలువనివ్వకుండా మరియు కృతజ్ఞతలేకుండా ఉన్నట్లయితే నష్టపోయేది నీవేగాని సంఘము కాదు. స్థానికసంఘము నుండి వారు పొందిన దానంతటిని బట్టి సంఘమునకు విలువనిచ్చి మరియు కృతజ్ఞత గలవారిని దేవుడు ఎంతో ఎక్కువగా ఆశీర్వాదించాడు.