రాజుయొక్క కలను గూర్చిన భావమును తెలియజేయలేనప్పుడు దానియేలు పరీక్షించబడ్డాడు మరియు కలను గూర్చిన భావమును తెలియజేయని యెడల బబులోనులోనున్న జ్ఞానులందరిని తిత్తునియలుగా చేయబడుదురని రాజు ఆజ్ఞ జారీ చేశాడు (దానియేలు 2:1-13). దానియేలు దానిని వినినప్పుడు, తాను విశ్రాంతిలో ఉండి ఎంతో జ్ఞానముతో ఆ సమస్యను పరిష్కరించాడు (దానియేలు 2:14). గొప్ప జ్ఞానము ఉన్న యౌవ్వనస్థుడిని ఇక్కడ మనము చూచుచున్నాము.
నెబుకద్నెజరు యొక్క కల యొక్క భావము (అర్థము)ను దానియేలు ఏ విధముగా పొందాడు? మొదటిగా దేవుడు తనకు దానిని బయలుపరుస్తాడని విశ్వసించాడు. అతడు దేవుని యొద్దకు వెళ్ళాడు (ప్రార్థించాడు). అతని స్నేహితులను పిలిచాడు (దానియేలు 2:17). మనకు ఎంతో కష్టమైన సమస్య వచ్చినప్పుడు ఇతర సహోదరులతో కలసి ప్రార్ధించుటలో ఎంతో మేలు ఉన్నది. ఇతరులతో కలసి ఐక్యతతో ప్రార్ధించే నియమము గురించి దానియేలు గ్రహించియున్నాడు. పాతనిబంధన కాలములో ఉన్న క్రొత్తనిబంధనకు సంబంధించినవాడుగా దానియేలు ఉన్నాడు. అతని వైఖరి ఇలాగున్నది, "దీనిని గూర్చి నేను ఒక్కడినే ప్రార్ధించను నా ముగ్గురు సహోదరులతో కలసి ప్రార్ధిస్తాను". వారు కలసి ఇలాగు ప్రార్ధించారు, " ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొందుము"(దానియేలు 2:18).
వారు, స్తుతించుటతో ఆరంభించి ప్రార్ధించారు. ఇది ఎల్లప్పుడు మంచిది. వారిట్లన్నారు, "ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు" (దానియేలు 2:20,21). ఎప్పుడైనా నీవు ప్రార్ధించలేనప్పుడు, ప్రభువును స్తుతించుటకు ఆరంభించుము దేవుని గొప్పతనాన్ని ధ్యానిస్తూ, ఆయనను స్తుతించుము. వెంటనే నీవు ప్రార్ధించుటకు అనుకూల వాతావరణము కలుగును.
అప్పుడు దేవుడు దానియేలుకు కల భావమును బయలుపరచియున్నాడు. మరియు అతడు రాజు దగ్గరకు వెళ్ళి ఇలాగు ఒప్పుకొని జవాబు చెప్పాడు, "నాకు విశేష జ్~ఝానముండటవలన ఈ మర్మము నాకు బయలుపరచలేదు. దేవుడే దీనిని నాకు బయలుపరచియున్నాడు" (దానియేలు 2:30). దేవునికే సమస్త మహిమను చెల్లించుటకు ఇష్టపడ్డాడు దీనుడైన యౌవ్వనస్థుడు దానియేలు. అట్టి వారికే దేవుడు మర్మములను బయలుపరుచును.
ఆ దేశములో ఉన్న కొందరు దుష్టులు అసూయతో దానియేలును నాశనము చేయవలెనని కోరినప్పుడు మరొకసారి అతడు పరీక్షింపబడ్డాడు. వారు రాజు దగ్గరకు వెళ్ళి, దానియేలుకు వ్యతిరేకముగా ఒక చట్టము చేయించారు. అదేమిటంటే, "రాజుకు తప్ప వేరే దేవునికి ప్రార్ధించినయొడల వారు సింహాల బోనులో వేయబడుదురు" (దానియేలు 6:6-13).
రాజుయొక్క శాసనము గూర్చి విని దానియేలు ఏమిచేశాడు? అతడు మోకరించి, ప్రార్ధించాడు. ప్రభుత్వముకంటే లేక రాజుకంటే ఎక్కువగా దేవునికి భయపడ్డాడు. తరువాత కాలములో అపోస్తలులు చెప్పినట్లుగా "మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెను గదా" (అ.కా. 5:29 ). ఏదైతే రాజు చేయవద్దన్నాడో, దానినే అతడు చేశాడు. దేవునికి ప్రార్ధించకుండునట్లు, అతనిని ఏ చట్టము ఆపలేకపోయింది. యెరూషలేము వైపు కిటికీలు తెరచి ప్రార్ధించుట అతనియొక్క అలవాటు. కిటికీలు తెరువకుండా ప్రార్ధించవచ్చును కాని నిజమైన జీవముగల దేవునికి ప్రార్ధించుటకు అతడు సిగ్గుపడలేదు. కాబట్టి కిటికీలు తెరచే ప్రార్ధించాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులముగా మనము ఇతరులచేత ఎరుగబడుటకు సిగ్గుపడకూడదు.
అతడు ఎల్లప్పుడు రోజుకు ఒకసారి కాదు గాని మూడుసార్లు ప్రార్ధించేవాడు. అసూయతో ఉండిన అధిపతులు ఇటువంటి అవకాశము కొరకే ఎదురు చూచుచున్నారు. కాబట్టి అతడు ప్రార్ధించుట చూచిన వెంటనే, వారు వెళ్ళి రాజునకు చెప్పారు. దానియేలును రాజు ఇష్టపడి, అతనిని రక్షించాలనికోరాడు. కాని మాదీయులయొక్కయు, పారసీకులయొక్కయు పద్ధతి ప్రకారము, ఎవరును దానిని రద్దుపరచకూడదని వారు రాజుకు గుర్తుచేసారు. కాబట్టి రాజు, దానియేలును సింహాలబోనులో వేయవలసివచ్చింది. కాని, మనకు తెలిసిన విధముగా, దేవుడు అతనిని సింహముల నుండి రక్షించెను.
మాదీయ, పారసీకులకు దానియేలుజీవితమే నిజమైన దేవుని గూర్చిన సాక్ష్యము. మన సాక్ష్యము ఇతరులకు తెలియునట్లు, దేవుడు మనకు కూడా కొన్ని పరీక్షలు అనుమతించును. శ్రమలను సహించి మరియు శ్రమపెట్టేవారిని ప్రేమించిన యెడల, ఇతరులు మనలో క్రీస్తును చూస్తారు. మన దేవుడు సింహాసనాసీడైయున్నాడు. కాబట్టి ఒకరోజు మనము సువార్త నిమిత్తము ప్రాణము పెట్టవలసివస్తే, మన తలలు పైకెత్తి, స్తుతించే ఆత్మతో సమర్పించుకుందాము.