వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   స్త్రీలు అన్వేషకుడు
WFTW Body: 

యోహాను 21:3 లో పేతురు తనతోటి అపోస్తలులతో "నేను చేపలు పట్టుటకు వెళ్లుదును" అని చెప్పినట్లు చదువుదుము. ఏదో ఆ ఒక్క సాయంత్రము మాత్రమే చేపలు పట్టుట తన అర్ధము కాదు. అతడు అపోస్తులుడుగా నుండుటకు తప్పిపోయెను కాబట్టి ఇంక అపోస్తలుడుగా నుండక ఎల్లప్పుడు చేపలు పట్టుకొనవలెనని అతడి ఉద్దేశ్యము.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువు పిలచినప్పుడు పేతురు చేపల వ్యాపారము మానివేసెను. అతడు సమస్తమును నిజముగా విడిచిపెట్టి తనకు తెలిసినంతవరకు (చేయగలిగినంతవరకు) ప్రభువును వెంబడించెను. కాని తప్పిపోయాడు. ఇక ఈ అపోస్తలుడుగా నుండుట నాలాంటి వారికి కాదనుకొనెను. మూడున్నర సంవత్సరములు ఇంతవరకు భూమిపై జీవించిన బోధకులలో గొప్ప బోధకుని, ఇంతవరకు ఎవ్వరూ బోధించనటువంటి గొప్ప బోధలు వినిన తరువాత అతడు ప్రభువును ఎరుగనని నిర్మోహమాటముగా చెప్పెను, అదీ ఒక్కసారి కాదు ముమ్మారు. అతడు అపోస్తలుడుగా నుండుటకు చేయాల్సిన ప్రయత్నము చేసెను.

అయితే ఇప్పటికిని అతడు ఇంకొకపని చేయగలడు - అది చేపలు పట్టుట. ఆ పనిని అతడు చిన్న పిల్లవానిగా ఉన్నప్పటినుండి చేయుచున్నాడు. అందులో అతడు ఆరితేరినవాడు కూడా కనుక మరియొక మారు అతడు దానిని ప్రయత్నించాలని అనుకొనెను. కొందరు ఇతర అపోస్తలులు కూడా పేతురు వలె ఉండిరి. వారు కూడా ప్రభువు అవసరంలో ఉండినప్పుడు విడిచి పారిపోయారు. ఆ విధంగా "అపోస్తలులుగా" ఉండుటలో తప్పిపోవుట చేత వారు కూడా చేపలు పట్టుటకు వెళ్ళిరి.

వారు నిష్కపటమైనవారు. వారు యేసు ప్రభువు మాటలు విని ఎంతో యిష్టపడిరి. మరియు వారి హృదయాలు ఆయన మాటలు వినినప్పుడు వారిలో మండినవి. వారు ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండాలనికొంటిరి కాని తప్పిపోయిరి.

నీ అనుభవం కూడా అలాగుండవచ్చు. గొప్ప ప్రసంగాలు విని నీవు కదిలింపబడవచ్చును. దేవుని వాక్యము వినుచుండగా నీలో నీ హృదయము మండియుండవచ్చును. నీవు అన్నిటిని విడిచిపెట్టి నిజాయితీగా ప్రభువును వెంబడించాలని అనుకొనియుండవచ్చును. బహుశా నీవు అనేకమార్లు, శక్తివంతమైన ప్రసంగములు విని "నిర్ణయాలు" తీసుకొనియుండవచ్చును. బహుశా మరల మరల తప్పిపోయిన తరువాత "ఈసారి నేను నిజముగా సాధిస్తాను" అనుకొనియుండవచ్చును. కాని నీవు బయటకు వెళ్ళి మరల తప్పిపోయి యుండవచ్చును. నీవు ఈ దినాన ఒకమారు వెనుకకు తిరిగి చూచుకొనినట్లయితే ఒక దానిపై ఒకటిగా పేర్చిన తప్పిపోయిన అనుభవాల కుప్ప, ఒక వేయిమార్లు అనుభవం ఉండవచ్చును. "మీలో కొందరు ఇంక లాభంలేదు, ఇక ఈ విషయాన్ని విడిచిపెట్టుట మంచిది. ఈ సువార్త ఇతరులకు పనిచేయవచ్చును. కాని నా విషయంలో పనిచేయుట లేదు. నేను చాలాదూరము వెళ్ళిపోయాను. నేనిక తిరిగి రాలేను అని నిరుత్సాహముతో అనుకొనుచున్నారా?"

ఈ రోజున మీరు అలా భావిస్తున్నారా? ఇక ప్రయత్నించి లాభము లేదు కాబట్టి ఇంకెప్పుడూ ప్రయత్నించనని నిర్ణయించుకొంటిరా? తిరిగి లోకములోనికి వెళ్లి అదృష్టమునో లేక శూన్యమైన ఆనందమునో వెదకుకొందామని నిర్ణయించుకొంటిరా? ఈ రోజు మీరు ఆ విధంగా అనుకొంటున్నారా? యేసు ప్రభువు శిష్యుడుగా చూపించుకొనుట కంటే పూర్తిగా లోకస్థునిగా ఉండుటయే మంచిదనుకొనుచున్నారా?

మంచిదే, సరిగా అలాగే చేపలు పట్టుటకు వెళ్ళిన అపోస్తలులు అనుకొన్నారు. మరియు ప్రభువు వారిని "మీరు వెళ్ళి అక్కడ ఏమైనా సాధించగలరేమో చూడండి" అని చెప్పినట్లు వెళ్ళనిచ్చెను. కనుక పేతురు, అతని స్నేహితులు రాత్రంతా ప్రయత్నించారు. కాని ఘోరంగా ఓడిపోయారు. వారి జీవితాల్లో అంతటి ఘోరమైన రాత్రి ఎప్పుడూ లేదు. అక్కడ కుడా వారు తప్పిపోయారు. ఒకమారు దేవుడు నిన్ను పిలిచినట్లయితే ఆయన నిన్ను పోనివ్వడు. నీవు చేపలు పట్టుటకు వెళ్ళినా ఇంకా ఏ పని చేయుటకు వెళ్ళినా నీవు తప్పిపోవునట్లు ఆయన చేయును. నీవు ఎంత ప్రయత్నించినా చివరకు తప్పిపోదువు. దేవుని ప్రేమ నీ జీవితమును వ్యర్ధము చేసుకొనుటకు ఒప్పుకొనదు. నీవు ఆయన యొద్దనుండి పారిపోయినా, నీవు ఎక్కడికి వెళ్ళి ఏమి చేసినా తిరిగి ఆయన యొద్దకు వచ్చేంతవరకు నీవు తప్పిపోవుచుందువు.

అయితే ఇది దేవుని చేత పిలువబడని వారికి వర్తించదు. అనేకమంది మోసకరమైన వ్యాపారస్తులు, రాజకీయ వేత్తలు ఎంతో ’నల్లడబ్బు’ సంపాదిస్తూ దేవుడు లేకుండానే మంచి ఆరోగ్యముతో జీవిస్తున్నారు. దేవుడు ఎందుకు అట్లు జరుగనిస్తున్నాడు? ఎందుకంటే వారు ఆయన బిడ్డలు కారు. నేను వారిగూర్చి మాట్లాడుటలేదు. ఆయన స్వంతముగా నుండుటకు జగత్పునాది వేయబడక మునుపే, పిలవబడిన నీతో మాట్లాడుచున్నాను.

నిజానికి గలిలయ సముద్రములో ఎన్నో చేపలున్నాయి. ఆ రాత్రి ఇతర చేపలు పట్టేవారు ఎన్నో చేపలు పట్టుకొని యుందురని నేను అనుకొనుచున్నాను. ఆ చేపలు వారి పడవల దగ్గరకు వెళ్ళాయి. కాని దేవుడు వాటిని పేతురుకు దూరముగా ఉంచాడు. అందువలన ఒక్క చేప కూడా అతడి దగ్గరకు రాలేదు. ఇతర పడవల వారు పేతురు పడవ దగ్గరకు వచ్చి వారికి ఎంత మంచి వేట దొరికిందో చెప్పి యుండవచ్చును కూడా. అది పేతురును అతడి స్నేహితులను వారు ఏమీ పట్టలేకపోవుట ఇంకా ఆశ్చర్యము కలుగజేసియుండును.

నీ చుట్టూ ఉన్న ఇతరులవలె నీవు ఎందుకు ధనవంతుడవు కాలేకపోవుతున్నావని ఎప్పుడైనా ఆలోచించావా? నీవెందుకు ఇతరులవలె వ్యాపారములో లక్షలు సంపాదించుటలేదో ఆలోచించావా? నీ చుట్టూ ఉన్నవారు ఇంకా అభివృద్ది చెందుతున్నారు, నీవు మాత్రం ఏమీ ఎదుగుటలేదు. దానికి కారణం నీ యెడల దేవుని పిలుపు ఉన్నది. ఆ ఇతరులకు కలిగిన దానికంటే విలువైన దానిని నీకు ఇవ్వాలని ఆయన కోరుచున్నాడు.

పేతురు తన యెడల నుండిన దేవుని పిలుపునుండి తిరిగి వెళ్ళిపోవుచుండెను. దేవుడు అతనిని మరల తప్పిపోవునట్లుచేసి అతనిని విరుగగొట్టెను. పేతురు ఆ రాత్రంతా కష్టపడినా చేపలేమీ పట్టలేడని ప్రభువునకు తెలియును. అయినను వారు సమయాన్ని వ్యర్ధపరచుకుండా వారు పడవపై వెళ్ళినవెంటనే ఆయనెందుకు రాలేదు? అపోస్తలులు సాయంత్రం ఆరు గంటలకు చేపలు పట్టుటకు మొదలు పెట్టిరి. కాని యేసు ప్రభువు వారి దగ్గరకు మరుసటి ఉదయం ఐదు గంటల వరకు రాలేదు. కనీసం రాత్రి తొమ్మిది గంటలకు వారి దగ్గరకు ఆయన ఎందుకు రాలేదు? ఉదయం ఐదు గంటల వరకు ఆయనెందుకు ఎదురుచూచెను? వారు సుమారు 11 గంటల సేపు ప్రయత్నించి ఓడిపోయి అలసిపోయినంత వరకు ఆయన ఎందుకు ఎదురుచూచెను?

దానికి సమాధానము మనము పడిపోవుటలో దేవునికుండిన ఉద్దేశ్యములో ఇమిడియున్నది. అందులోనే మనము గతంలో పెనుగులాడుతున్నప్పుడు, సహాయం కోసం మరల మరల కేకలు వేసినప్పుడు మరియు మన బలమైన ప్రార్ధనలకు ఇప్పటికీ జవాబు రాకపోవుటను మనం అర్ధము చేసుకోగలము.

పేతురు మరియు అతని స్నేహితులు చేపలు పట్టుటకు సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళినప్పుడు వారు తప్పిపోయినవారు కాదు. అప్పుడు వారు పూర్తి ఆశతో ఉన్నవారు. రాత్రి 9 గంటల వరకు చేపలేమి పట్టలేదు. బహుశా అప్పుడు వారు కొంచెం నిరాశచెంది యుందురు. అప్పటికి వారు బయటకు వెళ్ళిన పనిలో తప్పిపోయినట్లు అనిపించుకోదు. మధ్యరాత్రి వారు బాగా క్రుంగియుంటారు. తెల్లవారి 4 గంటలకు వారు ఆశ వదులుకోవడం మొదలు పెట్టియుందురు. కాని, వారు పూర్తిగా తప్పిన వారుగా అవ్వాల్సియున్నది. అది జరగడానికి, వారు ఇంకా ఓడిపోవాల్సియున్నది. వారి మీద వారికున్న నమ్మకము అనే గ్రాపు నెమ్మదిగా తగ్గుచున్నది. అయితే అది ఇంకా పూర్తిగా అడుగునకు తాకే విధముగా శూన్యమునకు (సున్నా) చేరవలసియున్నది. అది ఉదయం ఐదు గంటలకు మాత్రమే అయినది. అప్పుడు వారి నిరీక్షణను వదిలిపెట్టుటకు సిద్ధమయ్యారు. బహుశా అప్పుడు వారు "ఇక ప్రయత్నించి లాభంలేదు, ఇంటికి పోదాం పదండి" అనుకొనియుందురు.

అప్పుడు ప్రభువు ప్రత్యక్షమయ్యారు. అది దేవుని పద్ధతి. అప్పుడు ప్రభువు వారి వలలు నిండిపోయేటట్లు చేసారు. వారి జీవితాల్లో ఏరోజూ అన్ని చేపలు వారు పట్టలేదు. ఆ ఉదయం వారు 153 గొప్ప చేపలు పట్టారు. వారు గతంలో బాగా చేపలు పడినప్పుడు 20 లేక 30 చేపలు పట్టి యుందురు. కాని ఇది నిజముగా ఒక అద్భుతము. ఎవ్వరూ ఆ ప్రదేశములో ఒక్కరోజులో అన్ని చేపలను పట్టలేదు. ఆ రోజు ఆ ప్రదేశములో పట్టిన చేపల గూర్చి గలిలయ రికార్డు పుస్తకాల్లోనికి ఎక్కును. వారు ఆశ అంతా వదులుకున్న సమయములో ప్రభువు వారికి చేసిన అద్భుతమును వారెప్పుడూ గుర్తుంచుకొందురు.

నీవు కూడా నీ శక్తి అంతా హరించుకుపోయిన స్థితికి ఈ రోజుకు వచ్చావా? ఎటువెళ్ళాలో లేక తరువాత ఏంచేయాలో తెలియక, ఎటు వెళ్ళినా, ఏంచేసినా ఓటమి, నిరాశనూ చూస్తున్నావా? అలా అయినట్లుయితే ప్రభువు నీకు ప్రత్యక్షయమ్యే స్థలానికి బహుశా నీవు చాలా దగ్గరగా ఉన్నావేమో, నీవు విడిచిపెట్టవద్దు. నీ మీద నీకున్న నమ్మకము సున్నా దగ్గరకు వచ్చుటకు ఆయన కనిపెడుతున్నారు.

ఆయనింకను నీ దగ్గరకు రాకపోయి ఉంటే దానికి కారణము నీ ఆత్మీయ జీవతపు గ్రాఫులో నీ వింకా సున్నా విలువ దగ్గరకు రాలేదన్నమాట. ఆయన నీలో ఇంకా నీ స్వంత బలము ఉన్నట్లు చూస్తున్నారు. అది కూడా పోవలసియున్నది. ప్రభువు వచ్చేముందు లాజరు చనిపోయి పాతి పెట్టబడవలసియున్నది.