వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట
WFTW Body: 

ఒక కుంటివాడు స్వస్థతపొందుటను గూర్చి అపొ.కా 3వ అధ్యాయంలో చదువుతాము. అతడు నలువది ఏండ్లకంటే ఎక్కువ వయస్సు గలవాడై పుట్టుకతో కుంటివాడైయుండి మరియు శృంగారమను దేవాలయపు ద్వారపునొద్ద భిక్షమడుగుటకు ప్రతిదినము తేబడుచుండెను(అపొ.కా 4:22). కనీసము 20 సంవత్సరముల నుండి అతడు అక్కడ కూర్చొనుచు ఉండియుండవచ్చును. తరచుగా అతనిని ప్రభువైనయేసు చూచియుండవచ్చును. అతనిని స్వస్థతపరచకుండా డబ్బు యిచ్చియుండవచ్చును. ప్రభువు అతనిని ఎందుకు స్వస్థపరచలేదు? ఎందుకనగా ఆయనకు తండ్రియొద్దనుండి నడిపింపులేదు. ప్రభువైనయేసు ప్రతిఒక్కరిని స్వస్థపరచుచు వెళ్ళాడని కొందరనుకుంటారు. ఆయన ఆ విధంగా చెయ్యలేదు. బెతెస్థ కోనేటివద్ద అనేకమంది వ్యాధిగలవారుండగా, ఆయన ఒక్క కుంటివాడినే స్వస్థపరచాడు. ఆయన తరుచుగా దేవాలయమునకు వెళ్ళినప్పటికీ, అతనిని స్వస్థపరచలేదు. ప్రభువైనయేసు అతనిని స్వస్థపరచియున్నట్లయితే, అపొ.కా. 3,4 అధ్యాయములలో వచ్చిన ఉజ్జీవము వచ్చియుండేది కాదు.

మనము ప్రార్ధనలో దేవునితో గడపకుండా మన చిత్తప్రకారము దేవుని పరిచర్య చేసినట్లయితే, మనము ఆయన పనికి అభ్యంతరముగా ఉండే అవకాశము ఉన్నది. అందుకే మనము మొదటిగా దేవునివద్ద నుండి విని, ఆయన చేయమని చెప్పిన పరిచర్య చేయుట చాలా ముఖ్యమని ప్రభువైనయేసు మార్తతో చెప్పారు. పెంతుకొస్తుదినము తరువాత పేతురు ద్వారా అతడు స్వస్థత పొందవలెననునది దేవుని చిత్తమైయున్నది. అది మనకు ఒక పాఠమును నేర్పిస్తుంది. మనకు ఆత్మీయ కృపావరము ఉన్నప్పటికిని దానిని మన చిత్తప్రకారముగాక దేవుని నడిపింపు ప్రకారము ఉపయోగించాలి. లేనట్లయితే దేవునియొక్క సంకల్పాన్ని అభ్యంతరపరుస్తాము. కాని ఈ దినాలలో దానిని ఎవరు అర్ధం చేసుకుంటున్నారు? అనేకమంది విశ్వాసులకు పరిశుద్ధాత్మయొక్క స్పర్శలేదు. వారు కొన్ని నియములతో జీవిస్తారు. పెంతుకొస్తువారు అయితే "అందరూ స్వస్థత పొందెదరనియు" లేక పెంతుకొస్తువారు కానట్లయితే, "ఎవరైనను స్వస్థత పొందరనియు" నమ్మెదరు.

కాని ప్రభువైనయేసు నియమనిబంధనలతో జీవించలేదు. కాని పరిశుద్ధాత్మతో నడిపించబడ్డారు. ఎవరైతే ధర్మశాస్త్రానుసారులుగా ఉంటారో వారు ఎన్నటికిని దేవుని చిత్తమును నెరవేర్చరు. ప్రభువైనయేసు పరిశుద్ధాత్మయొక్క స్పర్శ కలిగియున్నారు. మరియు ఆ వ్యక్తిని స్వస్థతపరచుటకు పరిశుద్ధాత్ముడు ఆయనను ప్రేరేపించలేదు. కాబట్టి ప్రభువైనయేసు అతనికి ఎప్పుడైనను డబ్బు మాత్రమే ఇచ్చేవాడు. ఆవిధముగా ప్రభువైనయేసు దేవునిచిత్తమును నెరవేర్చియున్నాడు. తరువాత పేతురు అతని వద్దకు వచ్చినప్పుడు, అతడు భిక్షమడుగగా అప్పుడు పేతురు ఇట్లననెను, "నాయొద్ద డబ్బులేదు కాని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము". దాని ఫలితముగా ఐదువేల మంది రక్షణపొందియున్నారు. ప్రభువైనయేసు పరిశుద్ధాత్మకు లోబడి 3 1/2 సంవత్సరములు అతనిని స్వస్థపరచలేదు కాబట్టి ఐదువేల మంది క్రొత్తగా జన్మించారు.

దేవుని పనిని అభ్యంతరపరిచే విషయములో నాకు ఇక్కడ గొప్ప హెచ్చరిక ఉన్నది. నేను "నాస్వబుద్ధి మీద అధారపడినట్లయితే"(సామెతలు 3:5) మరియు నేను పరిశుద్ధాత్మచేత నడిపింపబడనియెడల, అది మంచిపని అయ్యినప్పటికినీ(కుంటివారిని స్వస్థపరచుట కంటే కూడా మంచిపని) అది ఆయన సంకల్పమును అభ్యంతరపరచగలదు. దేవుని మార్గములు మన మార్గములవంటివి కాదు. ఒక తెలివైనవాడు నియమములతో జీవిస్తూ దేవుని సంకల్పమును అభ్యంతరపరుచును. చాలామంది క్రైస్తవులు యదార్ధమైన నియమనిబంధనలతో జీవిస్తూ దేవునిపనికి పెద్ద అభ్యంతరముగా ఉన్నారు. పరిశుద్ధాత్మ స్వరము వినువాడే దేవునికి గొప్పగా ఉపయోగపడగలడు.