వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పురుషులు
WFTW Body: 

“మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి” (ప్రకటన 14:1) అని వ్రాయబడింది.

ప్రకటన 13 వ అధ్యాయంలో వ్రాసిన దానికి ఇక్కడ మనం చదివినదానికి చాలా వ్యత్యాసము ఉన్నది. ప్రజలు బహిరంగముగా (ముద్రను నొసటియందు)గాని లేక రహస్యము(కుడిచేతిమీద)గాని ఆయనను ఒప్పుకొనవచ్చును. కాని ప్రభువైనయేసు తన శిష్యులకు ఒక్క విధానాన్నే అనుగ్రహించాడు. తన యొక్క ప్రతి శిష్యుడు కూడా బహిరంగముగా ఆయనను ఒప్పుకోవాలి.

క్రీస్తును రహస్యముగా వెంబడించుటకు మనం పిలువబడలేదు. ప్రభువైనయేసు ఇలాగు చెప్పారు “మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యులయెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును (మత్తయి 10:32,33); వ్యభిచారము పాపమునుచేయు ఈ తరమువారిలో నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను” (మార్కు 8:38).

నీవు ఒక ఆఫీసులో పనిచేయుచున్నట్లయితే, ముద్ర నీ నొసటిమీద ఉండాలి. అనగా, నీవు పనిచేసే ఆఫీసులో వారందరికి నీవు ప్రభువైనయేసు యొక్క శిష్యుడవని తెలియాలి. నీవు పనిచేసే స్థలమందు ఎవరికీ తెలియకుండునట్లు నీవు కుడుచేతిముద్రను కలిగియుండకూడదు. నిజముగా ప్రభువైనయేసు క్రీస్తును వెంబడించువాడు తననొసటియందు ముద్రను కలిగియుంటాడు. అతని సహచరులకు, అతడు క్రీస్తుయొక్క శిష్యుడని తెలుస్తుంది.

చాలామంది యేసుక్రీస్తుయొక్క శిష్యులని చెప్పుకొనుటకు సిగ్గుపడుట అవమానకరము. అన్యమతస్థులు వారి మతమును గూర్చి సిగ్గుపడక, బహిరంగముగా వారి నొసటమీద వారిమతపు ముద్రను కలిగియుంటారు. బహుశా వారి ఆఫీసులో వారికి పదోన్నతి రాదని భయపడుటవలన క్రైస్తవులు సిగ్గుపడుతుండవచ్చును. అటువంటి క్రైస్తవులు రాజీపడుచు భూలోక ఘనతను కోరుతూ మరియు ప్రభువైనయేసుక్రీస్తు కొరకు బలమైన సాక్ష్యులుగా ఉండరు. నిశ్చయముగా వారు సీయోను కొండమీద ప్రభువైనయేసుతో ఉండబోయే 144,000 మంది జయించి మరియు ధైర్యముతో ప్రభువైనయేసును ఒప్పుకొనేవారిలో ఉండరు. వారి బంధువులలోగాని, వారి ఆఫీసులోగాని లేక ఇరుగుపొరుగు వారిలోగాని వారు రాజీపడరు. క్రైస్తవేతరులు వారి మతపు ముద్రను వారి నొసటిమీద చూచిన ప్రతిసారి నీవు సవాలు చేయబడాలి. వారి దేవునిగూర్చి వారు సిగ్గు పడనప్పుడు మీ దేవుడైన యేసునుగూర్చి నీవు ఎందుకు సిగ్గుపడుచున్నావు.

144,000 మంది ముందుగా 7వ అధ్యాయములో చూసినవారిలోలేరు. వారిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారు మెస్సయ్య అయిన యేసును విశ్వసించలేదు మరియు దేవుని గొఱ్ఱెపిల్లను వెంబడించలేదు. వీరు వేరే గుంపుకు చెందినవారు. వీరు జయించువారని ప్రకటన 2,3 అధ్యయాలలో ఉన్నారు.

పాతనిబంధనలో ఒకనిపేరు అతని గుణ లక్ష్యణాలను చూపిస్తుంది. కాబట్టి “దేవునియొక్కయు మరియు గొఱ్ఱెపిల్లయొక్కయు నామము” వారి నొసటిమీద ఉన్నందున, వారి దేవునియొక్కయు మరియు గొఱ్ఱెపిల్లయొక్కయు స్వభావంలో పాలుపొంది, దానిని ప్రతిబింబింపజేయుచున్నది. మనలను మనము వేసుకోవలసిన ఒక మంచి ప్రశ్న ఏమిటనగా, “మనకు కీడుచేసినవారి విషయంలో మనవైఖరి అనగా, బాధింపబడినను తన నోరు తెరువకుండా, వధకు తేబడిన గొఱ్ఱెపిల్లవలె మౌనముగా ఉండి మరియు తాను దూషింపబడినప్పటికీ, శ్రమపెట్టబడినప్పటికీ, ఆయన పేరు ప్రతిష్టలను హక్కులను చెరపివేసిననూ బెదిరింపక న్యాయముగా తీర్పుతీర్చు తన తండ్రికి అప్పగించుకొన్న గొఱ్ఱెపిల్లలాంటి వైఖరిని స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నామా? పాపులయెడల ఎంతో దీర్ఘశాంతము కలిగి మరియు మారుమనస్సుపొంది విశ్వసించువారిని ప్రేమతో ఆహ్వానించే తండ్రి స్వభావాన్ని మనం వ్యక్తపరుస్తున్నామా? (లూకా 15:11-24).

“జయించువారు చాలా కొద్దిమందేనా అని” కొందరు అడుగవచ్చును. ఎప్పుడైనను కోపపడక మరియు దేనినిబట్టి అభ్యంతరపడని విశ్వాసులను ఎంతమందిని మీరు చూసారు. కొద్దిమంది మాత్రమే కదా. 144,000 మంది భూమిమీద “ తండ్రి స్వభావాన్ని పొందుకొని, సంపాదించుకొని వారి ముఖాలద్వారా ప్రకాశించుచున్నారు. మనం దేవుని స్వభావంలో అంతకంతకు పాలుపొందుచూ, పరిపూర్ణులమై ఇతరులయెడల ఆయనవలె ఉండాలని మన ప్రతి ఒక్కరి విషయంలో ఆయన కోరిక కలిగియున్నాడు. ఆవిధంగా దేవుడు మనలో వృద్ధిని కలుగజేయుచూ మనలను సిద్ధపరుస్తున్నాడు.

క్రైస్తవ జీవిత ఆరంభములో మనమందరమూ పసిబిడ్డలవలె మనం ఆరంభించాము. అలాగే మన ఆత్మీయవృద్ధిని పొందుచూ యవ్వనస్థులం అవుతాము అలాగే మనం ఇంకను దేవుడు మనలో కలుగజేసే వృద్ధిలో కొనసాగుచూ తండ్రులవలె అవుతాము (యోహాను 2:12-14). అనగా ఇతరులు కూడా వారివలె పరిపూర్ణులగునట్లు, తమ్ముతాము ఉపేక్షించుకొని, వారికొరకు ప్రయాసపడతారు.