వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   ఆత్మతో నింపబడిన జీవితం
WFTW Body: 

1) వారు ఏదో ఒక వేదాంతపరమైన వాదన వల్ల వారి యొక్క ఆలోచనలలో వారు తిరిగి జన్మించినప్పుడే వారు ఆత్మతో బాప్తిస్మము పొందారని ఒప్పింపబడియుందురు. మరియు వారు ఓడిపోతున్నా, శక్తిహీనులుగానుండినా, శూన్యత మరియు ఫలహీనముగా నుండినా వారి ఈ వేదాంతపు వాదన యొక్క మోసములోనే కొనసాగుచుందురు.

2) వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుటకు అర్హులుకారని అనుకొందురు. నిజానికి నీవెంతగా అనర్హుడవని అనుకొందువో మరియు నీ మట్టుకు నీవు గొప్ప పాపిగా చూచుకొనినప్పుడే నీవింకా పరిశుద్ధాత్మను పొందుటకు తగినవాడవు. ఎందుకనగా దేవుడు ఆయన యొక్క వరములను ఎవరైతే అవి పొందుటకు అర్హత లేదని భావించుదురో వారికే ఇచ్చును. నీవు నీ పాపములను గూర్చి పశ్చాత్తాపము చెందినట్లయితే నీవు ఎంత అనర్హుడవైనా లేక ఎంత తగినవాడవు కాకపోయినా లేక ఎంతపనికి రానివాడవైనా అది పరిగణలోనికి రాదు. హల్లెలూయా!

3) దేవుడు మంచి దేవుడనియు మరియు ఆయన యొక్క మంచి ఈవులను అడిగిన వారికందరకు ఉచితముగా ఇచ్చునని వారు నమ్మకయుందురు. అయితే వారు అట్లు పొందుటకు ముందు ఉపవాసముండుట మరియు ప్రార్ధించుట వంటి కొన్ని మంచి క్రియలు చేయవలెనని అనుకొందురు. కాని దేవుడిచ్చు వరములన్ని ఉచితముగా ఇచ్చెడివి. అది పాపక్షమాపణ అవ్వచ్చును లేక ఆత్మలో బాప్తిస్మమవ్వచ్చును. దేవుని యొక్క వరములను వేటిని కొనలేము.

చాలామంది విశ్వాసులు విశ్వాసము కలిగియుండుటయే కష్టమైన విషయమనుకొందురు. కాని యేసుప్రభువు విశ్వాసమును త్రాగుటతో పోల్చారు (యోహాను 7:37,38... “త్రాగుట.... నమ్ముట”) పరిశుద్ధాత్మను పొందుట త్రాగినంత సుళువు. పసిబిడ్డలకు కూడా త్రాగుట ఎలాగో తెలియును మరియు క్రొత్తగా జన్మించినవారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందగలరు. అపోస్తులుల కార్యములలో మనము చదివినట్లు, ప్రారంభ దినాల్లో అలాగే ఉండెడిది.

4) వారు దప్పిగొనిలేరు. వారు ప్రభువు పట్ల విపరీతమైన దాహం కలిగిలేరు. ఒక మనుష్యుడు అతడు కావలసినది పొందువరకు తన పొరుగువాని తలుపు తట్టిన ఉపమానమును యేసుప్రభువు చెప్పెను. అట్లు చెప్పిన తరువాత అటువంటి మనుష్యునివలె ఎవరైతే అడుగుతూ, వెదకుతూ మరియు తడుతూ ఉందురో అటువంటి వానికి మన పరలోకపు తండ్రి కూడా పరిశుద్ధాత్మను ఇచ్చునని చెప్పెను (లూకా 11:13 దాని ముందున్న వచనముల యొక్క సంధర్భముతో కలిపి 5వ వచనము నుండి చదవండి).

5) వారు ఎవరి సాక్ష్యము నుండో వినిన అనుభవము (భాషలు లేక వల్లు జలధరింపు మొదలైనవి) వంటి అనుభవము కొరకు ఎదురు చూచెదరు. వారికి ఎటువంటి వరము లేక అనుభవము మంచిది అనే నిర్ణయాన్ని దేవునికి విడిచి పెట్టుటకు వారు ఇష్టపడరు. పరిశుద్ధాత్మను సామాన్యమైన విశ్వాసముతో పొందవలెను.

అడుగుడి మీరు పొందెదరు (గలతీ 3:2; లూకా 11:9-13). భావోద్రేకము గూర్చి ఎదురుచూడవద్దు. కాని దేవుడు మీకు ఒక నిశ్చయతను ఇవ్వమని అడగండి అది ఆయన మీకు ఎలా ఇస్తారనే విషయం ఆయనకు విడచిపెట్టండి. నీ పాపములు క్షమింపబడెననియు మరియు నీవు ఆయన బిడ్డవనే నిశ్చయతను ఆయన నీకివ్వలేదా! అదే విధముగా నీవు పరిశుద్ధాత్మతో నింపబడినావనే నిశ్చయతను ఆయన నీకిచ్చును. నీకు కావల్సింది ఒక అనుభవము కాదు, కాని దేవుని శక్తి (అ.కా. 1:8).

గనుక: దప్పిక కలిగియుండుము - నమ్ముము - పొందుము

ఇదే సరైన సమయము. ఈనాడే రక్షణ దినమైయున్నది. “యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగి వచ్చును. అప్పుడు నీకు క్రొత్త మనస్సు వచ్చును”(1 సమూ 10:6).