వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము పురుషులు
WFTW Body: 

మన సహోదరునికంటే ఎంతో సన్నిహితముగా ప్రభువైనయేసుక్రీస్తు మనతో ఉంటారని బైబిలు చెప్పుచున్నది. మనలను గూర్చి శ్రద్దతీసుకొనే కన్నతండ్రిగా మనము దేవుని యెరిగినట్లయితే, మనము ఆనాధలమని అనుకొనము. తల్లిదండ్రులు లేనివారే అనాధలు, అట్టివారికి అకస్మాత్తుగా ఏదైన అవసరమొచ్చినప్పుడు, ఎవరిదగ్గరకెళ్ళగలరు? అతడు అంకుల్‍దగ్గరకు గాని లేక అంటీదగ్గరకు గాని ఒక అనాధవలె వెళతాడు. అంకుల్ గాని లేక అంటీ గాని తనకు సహాయము చేస్తారో లేదో అతనికి తెలియదు. వారు ఆ వ్యక్తిని సరిగా చూడకపోవచ్చును. కాని అతనికి కన్నతండ్రి ఉన్నట్లయితే, తండ్రి కుమారుని ఆవిధముగా చూడడు. తండ్రి దగ్గరకు అతడు దేనిగురించియైనను, లేక ధనము గురించియైనను లేక తండ్రికి ఇబ్బంది కలిగించేదైనను చేయమని వెళ్ళి అతడు అడుగవచ్చును. కాని అంకుల్‍గాని లేక అంటీగాని లేక మరెవరినైనను అడుగుటకు అతడు సందేహిస్తాడు. కాని అతనికి కన్నతండ్రి ఉన్నట్లయితే, తాను ఎంతో భద్రతలో ఉంటాడు. తనకు పరిష్కారము తెలియని సమస్య ఏదైనా ఉన్నట్లయితే, అతడు తన తండ్రితో మాట్లాడును. అతడు తన పట్టణానికి దూరముగా ఉన్నట్లయితే ఫోన్ చేసి మాట్లాడవచ్చును. ఈ లోకములో మనకు కన్నతండ్రి ఉండుట చాలా అద్భుతము అలాగే ఆత్మీయముగా కూడా.

దేవునిని నీవు పరలోకపుతండ్రిగా కనుగొనినప్పుడు (ప్రభువైనయేసు నందు విశ్వసించుట ద్వారా), నీవు ఇంక ఎన్నటికీ ఒంటరివాడవని అనుకొనవు. ’ఫోన్’ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది గనుక అది అసాధ్యము. నీవెక్కడ ఉన్నప్పటికి ఆయనను పిలువవచ్చును (ప్రార్ధించవచ్చును). నీయొక్క ప్రతిఅవసరము ఆయనకు చెప్పుకొనవచ్చును. నిజానికి నీయొక్క ప్రతి అవసరము అయనకు ముందే తెలియును. నీ జీవితమంతటిలో వచ్చే ప్రతిసమస్యకు ఆయనలో పరిష్కారమున్నది. నన్ను మరలా చెప్పనివ్వండి. దీనిని మీరు విశ్వసిస్తారని నమ్ముచున్నాను. నీ సమస్య ఎంత పెద్దదైనను, అది ఎంత తీవ్రమైనదైనను ఫరవాలేదు. నీ ప్రతిసమస్యకు దేవునిలో పరిష్కారము ఉన్నదని ప్రభువైనయేసు నామములో చెప్పాలనుకుంటున్నాను. నీవు ఒక తండ్రియొద్దకు వచ్చినట్లు విశ్వాసముతో, నీకు సహాయము చేయవలెనని కోరి ఆయనయొద్దకు వచ్చినట్లయితే, ఆయన నిన్ను తిట్టడు.

నీ విశ్వాసము నా మాటలమీద ఆధారపడకుండునట్లు ఒక సుందరమైన వాక్యము దేవునివాక్యములో నుండి చెప్పాలనుకుంటున్నాను. దేవుని వాక్యము వినుటవలన మనలో విశ్వాసము కలుగుతుంది. యాకోబు 1 : 5లో "నీకు జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను", కాని జ్ఞానమంటే ఏమిటి? మన సమస్యలను పరిష్కరించుకొనుటకు దేవుడు అనుగ్రహించే జ్ఞానము సహాయపడుతుంది. ఇది సహయపడని జ్ఞానము కాదు. మనము ఎదుర్కొనే సమస్యకు సరియైన పరిష్కారము దొరుకుతుంది. ఇదే జ్ఞానము. ఇది పుస్తకము ద్వారా వచ్చే జ్~ఝానము కాదు దేవునిలో నుండి వచ్చు జ్ఞానము. బైబిలును తెలుసుకొనుటకును మరియు దేవునిని వ్యక్తిగతముగా ఎరుగుటకు చాలా తేడా ఉన్నది. ఒకవేళ నీవు చిన్నప్పుడే తండ్రినుండి వేరుచేయబడి చాలా దూరములో 25 సం||లు ఉన్నావనుకుందాము. నీ తండ్రి గురించి అనేక సంగతులు పుస్తకము నుండి చదివితే, అప్పుడు నీ తండ్రి గురించి మాత్రమే నీకు తెలుస్తుంది గాని స్వయముగా నీ తండ్రిని ఎరుగవు. 25 సం||లలో ఎన్నడైనను నీ తండ్రితో మాట్లాడలేదు. నీవు నీతండ్రిని ఎరిగిన దానికంటే, కేవలము 5 లేక 6సం||లు మాత్రమే వేరొకరు తన తండ్రియింటిలో పెరిగి మరియు తండ్రిని గురించి ఒక్క పుస్తకము కూడా చదువనివాడు ఎక్కువగా తండ్రిని యెరుగును. చాలామంది బైబిలు చదువుతారు. అది నీ తండ్రియొక్క జీవిత చరిత్ర చదివినట్లుంటుంది. నీవు నీతండ్రిని యెరుగవు. దేవునిని తండ్రిగా ఎరుగుటయే జ్ఞానము మరియు అప్పుడు నీ సమస్యకు వెంటనే పరిష్కారము కనుగొందువు. ఆ సమస్య ఏదైనప్పటికినీ, ఆర్ధిక సమస్యగాని, వివాహసమస్య గాని, పిల్లల వివాహ విషయముగాని, మీపిల్లలను చదివించే విషయములో సమస్యగాని, లేకవారి ఉద్యోగసమస్యగాని లేకవారి ఇంటి గూర్చిన సమస్యగాని అయి ఉండవచ్చును. మనము జీవించే లోకములో అనేక సమస్యలు ఉండును. ప్రతిదానికి జవాబు దేవునిలోనే ఉన్నది.

"మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల" అనగా ఎవరైనను అని అర్ధము. అందులో నీవు కూడా ఒకడవి కావచ్చును. నీకు జ్ఞానము కొదువగా ఉన్నదా? అనగా నీకున్న సమస్యకు పరిష్కారము దొరక లేదా? నీవు దేవుని అడుగవచ్చును. నీవు ఏమి చేయాలి? నీవు అనేకులయొద్దకు వెళ్ళి అడిగినను పరిష్కారము దొరకదు. ఇప్పుడు వేరేవిధముగా ప్రయత్నించవచ్చును. నీవు దేవునిని ఎందుకు అడుగగూడదు? నీవుఎక్కడ, ఏస్థితిలో ఉన్నప్పటికీ ఆయన నీ ప్రార్ధన వింటాడు. ఇప్పుడే నీవు ఆయన నామమును పిలిచి అడిగినట్లయితే ఆయన వింటాడు. ఆయన మనకు అంకుల్ కాదు లేక ఆయన మన పొరుగువాడుకాదు కాని ఆయన మన కన్నతండ్రి కాబట్టి తప్పకుండా మనకు జవాబిస్తారు. మన పొరుగువారు కూడా కొంచెము సహాయము చేయవచ్చును. కాని దేవుడు తండ్రులందరికంటే ఎంతో ఉత్తమమైన మంచితండ్రి. ఆయన నీకు ఎంతో శ్రేష్టమైనది ఇస్తాడు. ప్రభువైనయేసు ఈలాగు చేప్పారు, "మీరు చెడ్డవారైయుండియు, మీపిల్లలకు మంచి యీవులనియ్యనెరిగియుండగా పరలోకమందున్న మీతండ్రి ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహించును". నీ కుమారుడు నిన్ను రొట్టనడిగే నీవు రాయినిస్తావా? ఇవ్వవుకదా! గ్రుడ్డునడిగితే, తేలును ఇస్తావా? అతనికి హానికలిగించేదైననైనను నీవు ఇస్తావా? ఇవ్వవు కాని అతడు ఏది అడిగియున్నాడో దానినే ఇస్తావు. దేవుడు కూడా అలాగే ఇస్తాడు. మనకు అవసరమైనదంతయు ఆయన ఇస్తాడు. మరియు ఆయన ఎంతో ధారాళముగాను సమృద్ధిగాను ఇస్తాడు. దానినే యాకోబు 1 : 5 వచనము చెప్పుచున్నది. ఆయన ఎప్పుడైనను కొంచెమివ్వడు. నీవు స్పూన్‍తో ఇవ్వమని అడిగితే, ఆయన బక్కెట్‍తో ఇస్తాడు. నీకు స్పూన్‍లో పట్టేంత జ్ఞానమవసరమైతే, ఆయన ధారాళముగా బక్కెట్ అంత జ్ఞానమిస్తారు. దేవుడు అటువంటివాడు. మరియు ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ఇచ్చును" అని అక్కడ చెప్పబడింది. కొంతమంది తండ్రులు ఈవిధముగా గద్దిస్తారు, "ఓ బుద్ధిలేనివాడా, దానికి నీకు జవాబు తెలియదా! కాని దేవుడు ఒక్కసారి కూడా గద్దించడు. దీనిని గుర్తుంచుకొనుడి. దేవుడు ఒక్కసారి కూడా గద్దించడు లేక తిట్టడు. "నీకు ఆ ప్రశ్నకు జవాబు ఎందుకు తెలియదని" ఒక్కసారి కూడా అనడు. నీవు అడిగినది నీకు ఇవ్వబడుతుంది. ఒకే ఒక షరతు ఉన్నది. ఆ షరతేంటో వినండి. నీవు విశ్వాసముతో అడగాలి (ప్రార్ధించాలి). యాకోబు 1 : 6లో అదే చెప్పబడింది. 6 , 7వచనములలో, "నీవు విశ్వాసముతో అడుగనట్లయితే, నీవు పొందవు".

నీవు జ్ఞానమును కోరవచ్చును. దేవునికి కూడా నీకు ఇవ్వాలని ఉంది. అక్కడ నీకు అవసరము ఉన్నది. పరిష్కారము కూడా ఉన్నది కాని నీవు దానిని పొందవు. ఎందుకంటే నీవు అడిగినప్పుడు విశ్వాసముతో అడుగలేదు. ఇది అంత సామాన్యమైన విషయము. బహుశా నీ సమస్యకు పరిష్కారము రాకపోవుటకు ఇదియే కారణము కావచ్చును. ప్రభువైనయేసు తెచ్చిన ప్రత్యక్షతను ఈరోజే నీవు విశ్వసించుటకు తీర్మానము తీసుకొనవచ్చునుగదా? నీతండ్రిగా దేవునికి నీ ప్రతి అవసరము తెలియును. అది శరీర స్వస్థత కొరకైయుండవచ్చును లేక ఏదైన ఆత్మీయ అవసరమైయుండవచ్చును. అనేక సం||ల నుండి ఉన్న కుటుంబసమస్య కావచ్చును. దానిలో కొంచెమే నీవు పరిష్కరించుకొనియుండవచ్చును కాని పూర్తిగా కాకపోవచ్చును. విశ్వాసముతో అడుగుము, "ఓ యేసుప్రభువా, ఈరోజు నుండి నిన్ను విశ్వసిస్తాను. నీవు నా సమస్యను పరిష్కరిస్తావని నిన్ను విశ్వసించాలనుకుంటున్నాను. ఎందుకనగా నీవు నా కన్నతండ్రివి కాబట్టి యేసుప్రభువు నన్ను ప్రేమించి, నాకొరకు ప్రాణము పెట్టారు. ఆయన రక్తములో నేను కడుగబడి పరిశుద్ధపరచబడియున్నాను. నేను నీ కుమారుడను, నీ కుమార్తెను నిన్ను అడుగుటకు నాకు హక్కు ఉన్నది. నీవు నా తండ్రివి". నీవు దేవునిని ఇప్పుడే ఎందుకు అడుగకూడదు? నీ సమస్య ఏమిటో స్పష్టముగా చెప్పుము. స్పష్టముగా ఇలా అడగాలి, "ప్రభువా, ఈ సమస్యను నీకు అప్పగిస్తున్నాను. జవాబిస్తారని నేను నమ్ముచున్నాను". దేవుడు నిన్ను గద్దించడు కనుక నిర్భయముగా ఉండుము మరియు అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. నీవు జవాబు పొందినప్పుడు ఆయనను మహిమపరచుము.