వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   గృహము
WFTW Body: 

నిర్గమకాండము 25 : 8లో దేవుడు మనష్యునితో నివసించుట తన చిత్తమని బయలుపరచియున్నాడు. "నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను". దేవుని అగ్ని నిలిచియున్న ప్రత్యక్షగుడారము గురించి చెప్పబడింది. ఆ దేవుని మహిమ ఇశ్రాయేలీయులను ప్రపంచములోని వేరే వారికంటే ప్రత్యేకముగా ఉండునట్లు చేసింది. ప్రత్యక్ష గుడారము యొక్క కొలతలన్నియు ఇవ్వబడినవి గనుక నిర్గమకాండములో ఉన్నట్లు దానిని చేయుట సులభము. మనము అలాంటి ప్రత్యక్షగుడారమునే చేయవచ్చునునేమో గాని దేవుని మహిమ దానిలో నిలిచియుండనట్లు చేయలేము. దేవుని మహిమ నిలిచియుండటయే అతిపరిశుద్ధ స్థలములోని అతిముఖ్యమైన విషయము. ఇది, ఆయన తన ప్రజలలో ఉండుటను చూపిస్తున్నది. ప్రభువైనయేసు నివసించుటకు ఎంతో అనుకూలమైనదిగా క్రైస్తవగృహము ఉండాలి. అనగా ఆయన ఆ యింటిలో చూసే వాటన్నిటి విషయములో సంతోషించాలి. అనగా మనము చదివే పుస్తకముల విషయములో, భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ విషయములోను, మనము మాట్లాడే విషయములలోను, టివి(TV)లో చూసే కార్యక్రమములు మొదలగునవి.

1. దేవుడు ఎక్కడ నివసిస్తారు? మొదటిగా ఏ ఇంటిలో సమాధానము ఉంటుందో అక్కడ నివసిస్తారు. లూకా 10 : 5 - 7లో ప్రభువైనయేసు తన శిష్యులను పంపేటప్పుడు అటువంటి ఇంటికొరకు వెదకమని ఆయన చెప్పారు. మరియు అటువంటి ఇంటిని వారు కనుగొన్నప్పుడు, వారు అక్కడనే బసచేయాలి గాని వేరే ఇంటికొరకు చూడకూడదు. ఆయన ఎందుకు ఆవిధముగా చెప్పారు? ఎందుకంటే అటువంటి ఇండ్లను వారు ఎక్కువగా కనుగొనలేరని ఆయనకు తెలుసును. పోరాటములేని ఇంటిలోనే దేవుడు నివసిస్తాడు. భార్యాభర్తలు ఇద్దరు ఏ విషయములో పోట్లాడెదరు? ఏదైనా భూసంబంధమైన వస్తువుల విషయములోనే కదా? ఈ లోకములో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఏదైనా తప్పు జరిగినప్పుడు, పాపమొక్కటే ముఖ్యమైన విషయమని గుర్తుపెట్టుకోవాలి. మిగతావన్నియు అంత ప్రాముఖ్యమైనవికావు. మనము విడుదల పొందవలసిన ముఖ్యమైన విషయము పాపమే అనే దానిని మీరు చూస్తారని ఆశిస్తున్నాను. మన యిల్లు దేవుడు నివసించుటకు యోగ్యమైనదిగా ఉండాలి.

2. రెండవ విషయము యెషయా 57 : 15 లో దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములోను మరియు వినయము గల వారియొద్దను దీనమనస్సు గలవారియొద్దను నివసిస్తారు". విరిగినలిగిన హృదయము గలవారిలో దేవుడు నివసిస్తారు. వేరేవారి ఓటమి కంటే తన సొంత ఓటముల మీద ఎక్కువ వెలుగు కలిగి తనకు దేవునియొక్క అవసరమెంత‍ఉన్నదో ఎరిగినవాడే విరుగగొట్టబడిన వ్యక్తి. ఇతరుల ఓటములు ఎరిగిన వారితో లోకము నిండియున్నది. సామాన్యముగా అనేక కుటుంబములలో వేరే వారి యొక్కయు మరియు వారి కుటుంబతప్పిదములను గూర్చియే ఎక్కువగా మాట్లాడెదరు. వేరే వారిలో ఉన్న తప్పులను త్వరగా చూస్తాము గాని వారిలో ఉన్న మంచి సంగతులను గమనించము.

3. ప్రతిరోజు ఏ భార్యాభర్తలయితే(పరిశుద్ధాత్మలో నుండి పరిశుద్ధతను పొందుకొనుచు) పరిశుద్ధులుగా నడుచుకుంటారో ఆ యింటిలో దేవుడు నివసిస్తారు. యెహెజ్కేలు 43 : 12లో "ఆ మందిరము గూర్చిన విధమేమనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతిపరిశుద్ధ మందిరమును గూర్చిన ధర్మవిధి యిదియే. ప్రత్యక్షగుడారములో 3భాగములు ఉండును - ఆవరణము, పరిశుద్ధస్థలము మరియు అతిపరిశుద్ధ స్థలము. ఈ మూడింటిలో అతిపరిశుద్ధస్థలము చాలా చిన్నది. క్రొత్తనిబంధనలో ఆవరణముగాని లేక పరిశుద్ధస్థలముగాని ఉండవు. అంతయు అతిపరిశుద్ధస్థలమే అనగా దేవుని మహిమ ప్రత్యక్షగుడారములో వలే ఒకమూలన కాక స్థలమంతయు దేవుని మహిమ (దేవుని పరిశుద్ధజీవము)తో నింపబడును. అనగా మనము ఆదివారము మాత్రమేగాక ప్రతిరోజు పరిశుద్ధులముగా జీవిస్తాము. బైబిలు చదివేటప్పుడు మాత్రమేగాక ఎల్లప్పుడు పరిశుద్ధముగా ఉంటాము. మనలోను మరియు మన యింటిలోను ఉన్న సమస్తము పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధత అంటే మతసంబంధమైన ఆచారములను పాటించుట కాదు గాని మనము దేవునిలో నుండి జీవపువెలుగును పొందే కొలది మనలో దేవునిని ఆయాసపరచే వాటిని విడిచి దేవునికి ఇష్టమైనవాటితో నింపబడుట. ఇది మన అందరియొక్క అనుభవమగును గాక ఆమేన్.