వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
WFTW Body: 

పేతురు తన రెండవ పత్రికలో ఈ లోకములో "జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని దేవుడు తనయొక్క దైవశక్తి ద్వారా మనకు దయచేసియున్నాడనే సువార్తను గుర్తు చేయుచున్నాడు (2 పేతురు 1:3,4). పేతురువలే అమూల్యమైన విశ్వాసమును దేవునిలోనుండి మనము పొందినయెడల (2 పేతురు 1:1) మనము కూడా అతడు పొందిన కృపను పొందుకొని మరియు అతనివలే మనము కూడా దేవునిస్వభావములో పాలు పొందుదుము. అప్పుడు క్రీస్తుయొక్క గుణలక్షణములైన - "విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదరప్రేమ, దయ"(2 పేతురు 1:5-11) అనునవి మనలో బహుగా విస్తరించి, ప్రభువైనయేసుక్రీస్తులో మనము సోమరులమైనను లేక నిష్పలులమైనను కాకుండా చేసి మనలోని గ్రుడ్డితనమును తీసివేసి దూరదృష్టిని కలుగజేయును (2 పేతురు 1:8,9). ప్రభువైనయేసులో నిలిచియుండువారు బహుగా ఫలించుదురు (యోహాను 15:5). క్రీస్తుయొక్క ఈ గుణలక్షణములు మనలో అంతకంతకు విస్తరించకపోవుచున్నట్లయితే, మనము ప్రభువైనయేసులో నిలిచియుండుటలేదనియు మరియు మనము దేవునియొక్క సత్యమైన కృపలో జీవించుటలేదనియు చూపుచున్నది.

ఎవరైతే తమ్ముతాము తగ్గించుకుంటారో వారు జయము పొందుటకు కావలసిన కృపంతటినీ పొందుకొనుట మాత్రమేగాక, వారు ఇతరులతో ఏకమై ఒక్క నూతనపురుషుడుగా అగుటకు కావలసిన కృపంతటినీ పొందుకుంటారు. కృపాజీవములో భార్యాభర్తలు పాలిభాగస్థులగుటకు కావలసిన కృపను పొందినట్లు, క్రీస్తు శరీరములోని ఇతర విశ్వాసుల స్వాస్థ్యములో పాలివారగుటకు కావలసిన కృప అంతటినీ విశ్వాసులు పొందుకొనెదరు.

తండ్రియు మరియు కుమారుడు ఏకమైయున్నలాగున మనము కూడా ఏకమైయుండాలని ఈ భూలోకజీవితము చివరిరాత్రి తండ్రికి ప్రభువైనయేసు ప్రార్ధించియున్నారు (యోహాను 17:22). ఈ లోకములో ఉండగానే మనము ఈ ఏకత్వాన్ని అనుభవించాలని ఆయన ప్రార్ధించియున్నారు (యోహాను 17:21,23). ఇది మనస్సులో ఐక్యతకాదు గాని ఆత్మలో ఏకమగుట. మోసకరమైన దురాశలచేత చెడిపోయిన మన ప్రాచీనస్వభావమును బట్టియు మరియు పాపముచేత చెడిపోయిన మనస్సునుబట్టియు భూమిమీద అన్ని విషయములలో మనము ఇతరులతో ఏకీభవించకపోవచ్చును. అయినను మనము ఆత్మలో ఏకమై ఒక్క నూతనపురుషుడుగా ఉన్నాము. మన హృదయాలలో మనమింకను ఒక్కటైయున్నాము.

శిరస్సు(క్రీస్తు) యొక్క చిత్తముగాక మన స్వంతచిత్తమే చేయవలెనని కోరుచున్నాము కాబట్టి మనలో ఐక్యత కొంత కొదువగా ఉన్నది. సిద్ధాంతములను మనము అర్ధము చేసుకొనుట మీద ఇది ఆధారపడదు. మన స్వంతచిత్తాన్ని ఉపేక్షించుకొని మరియు తండ్రిచిత్తము చేయుటమీదనే ఇది ఆధారపడియుండును.

ప్రభువైనయేసు ఎల్లప్పుడు తండ్రియొద్ద నుండి విని మరియు వినినదానికి లోబడియున్నాడు. తండ్రిచిత్తము చేయుటయే ఆయనకు ఆహారమైయున్నది (యోహాను 4:34). ప్రభువైనయేసు తండ్రితో ఏకమై, ఒక్కటైయున్నారు. దేవుని నిజమైన కృపను పొందుటద్వారా మనము ఇటువంటి ఐక్యతలోనికి పిలువబడ్డాము.

ప్రభువైనయేసు ఎల్లప్పుడు కీడును మేలుచేయుట ద్వారా జయించారు. ఆయన దేవుని మంచితనములో వేరుపారి, నింపబడియున్నారు. కాబట్టి దుష్టత్వము ఆయనమీద ఎటువంటి ప్రభావము చూపలేదు. "కీడును మేలుతో జయించుడి" అను వాక్యానికి విధేయులమయితే మన విషయములో కూడా ఆ విధముగానే ఉంటుంది (రోమా 12:21 ). ఇతరులు మనలను ద్వేషించినప్పుడు మరియు నిందించినప్పుడు, వారికి మనము మేలుచేయుట ద్వారా వారి దుష్టత్వాన్ని జయిస్తాము. అయితే మొదటిగా మనము దేవుని నిజమైన కృపను, జీవమును పొందుకొని అనుభవిస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే ఇది అసాధ్యము. అప్పుడు ప్రభువైనయేసు ప్రార్ధించిన రీతిగా ఈ లోకములో మనము దుష్టుని నుండి కాపాడబడెదము (యోహాను 17:15). మరియు ఈ మార్గములో నడుచువారందరితో మనము ఏకమై, ఒక్కటైపోతాము.

దేవుని నిజమైన, సత్యమైన కృపను పొందుకొని, క్రీస్తుయొక్క శిరసత్వము క్రింద ఒకే ఆత్మీయమందిరముగా ఐక్యతతో కట్టబడేది మాత్రమే ప్రభువైనయేసు కట్టుచున్న సంఘము. అటువంటి సంఘముయెదుట మాత్రమే పాతాళలోక ద్వారములు నిలువలేవు (మత్తయి 16:18).