వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   క్రీస్తుయెడల భక్తి
WFTW Body: 

పరిశుద్ధాత్మతో నింపబడినవారు మాత్రమే, దేవుని పరిశుద్ధతలో అభివృద్ధిని పొందెదరు. ఒక మనుష్యుడు పరిశుద్ధతలో ఎదిగేకొలది, దేవుని సంపూర్ణమైన పరిశుద్ధతను తెలిసికొనును. ఇవి రెండు కలసి వెళ్ళును. నిజానికి ఒకవ్యక్తి దేవుని పరిశుద్ధత కలిగియున్నాడో లేదో తెలుసుకొనుటకు అతడు దేవుని సంపూర్ణ పరిశుద్ధతను తెలిసికొనుటయే ఋజువుగా ఉన్నది.

పౌలు మారుమనస్సు పొందిన ఇరవైఐదు సం||ల తరువాత ఈలాగు చెప్పుచున్నాడు, “నేను అపోస్తలులందరిలో తక్కువవాడను” (1 కొరింథీ 15:9). ఐదు సం||ల తరువాత ఈలాగు చెప్పుచున్నాడు, “పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను (ఎఫెసీ 3:11). ఒక సంవత్సరము తరువాత, “నేను పాపులలో ప్రధానుడను” (గమనించండి : నేను ఇప్పుడు పాపినై యున్నాను అని అనుచున్నాడు) (1 తిమోతి 1:15).

ఈ మాటలలో ఆయన పరిశుద్ధతలో ఏవిధముగా ఎదుగుచున్నాడో చూచుచున్నారా?

పౌలు దేవునితో నడిచేకొలది, తన శరీరములోనే దురాశ భ్రష్టత్వము ఉన్నవని తెలుసుకొనుచుండెను. తన శరీరములో మంచిది ఏదియు నివసించదని ఆయన గుర్తించెను (రోమా 7:18). యెహెజ్కేలు 36:26,27,31 లలో దేవుడు ఈలాగు చెప్పుచున్నారు. “నేను నీకు నూతన హృదయమును ఇచ్చెదను మరియు నీలో నూతన ఆత్మను ఉంచెదను ..... మీదోషములనుబట్టియు హేయక్రియలనుబట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు”. ఆవిధముగా శరీర ఇచ్చలను దురాశలను అసహ్యించుకొనువారు మాత్రమే పిలిప్పీ 2:3 లో ఉన్న “వినయమైన మనస్సుగలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచవలెను” అను ఆజ్ఞను నెరవేర్చగలరు. తనలో ఉన్న భ్రష్టత్వమును చూచుటవలన అతడు ఇతరులను చిన్నచూపు చూడడు.

అతడు తన ఓటమిని వెంటనే ఒప్పుకొనువాడుగా ఉండును మరియు పాపమును పాపమనే పిలుచును. పరిశుద్ధాత్మతో నిండినవాడు తాను పరిశుద్ధతలో ఎదుగునట్లు ఇతరులకు కనపరచాలని ప్రయత్నించడు కాని నిజముగా అతడు పరిశుద్ధతలో అభివృద్ధి పొందును. పరిశుద్ధ పరచుటకు తన సిద్ధాంతమును ఒప్పించుటకు ప్రయత్నించడు లేక తాను పరిశుద్ధపరచుటకు కారణమైనట్లు భావించిన కొన్ని అనుభవములను గూర్చి సాక్షము చెప్పడు. అతనిలో ఉన్న పరిశుద్ధతనుబట్టి, ఇతరులు తమంతట తాము అతని దగ్గరకు వచ్చి అతని జీవితములో ఉన్న రహస్యమేమిటని అడుగుదురు. ఎఫెసీ 4:24 లో జే.బి. పిలిప్పు తర్జుమా చేసినట్లు అతనిలో మోసకరముకాని పరిశుద్ధత ఉండును.

పరిశుద్ధతనుగూర్చి మన సిద్ధాంతము ఏదైనను భేదము లేదు. ఎవరైతే హృదయపూర్వకముగా వెదకుతారో వారిలోనికి మాత్రమే నిజమైన పరిశుద్ధత వచ్చును కాని కేవలము మంచి బోధతో కాదు.

గత శతాబ్దములో జాన్ ప్లెచ్చర్ లాంటి కొందరు దైవజనులు “సంపూర్ణ పరిశుద్ధత” పొంది యున్నామనే సిద్ధాంతమును నమ్మిరి మరియు తెలియక చేసిన పాపములను వారు “పొరపాట్లు” గా పిలిచారు. డేవిడ్ బ్రైనార్డ్ లాంటి మరికొందరు దైవజనులు తెలియక చేసిన పాపములనుకూడా “పాపములని” పిలిచి మరియు వారి జీవితకాలమంతయు వారి పాపములను బట్టి దేవునియడల నిరంతరము భయభక్తులు కలిగి దానిని బట్టి దుఖించి ఒప్పుకొన్నారు. వారి జీవితములను గూర్చి వారికి వేరే అభిప్రాయము ఉన్నప్పటికినీ దేవుని దృష్టిలో ఈ రెండు గుంపులలో పరిశుద్ధులు సమానమై ఉండవచ్చు.

పరిశుద్ధపరచబడుట అనే సిద్ధాంతమును వారు వేరువేరుగా అర్ధము చేసుకొన్నట్లయితే, వారి హృదయములో దానిని గూర్చి వేరుగా ఎంచుకొనవచ్చు. పూర్ణ హృదయముతో దేవునికి ఇష్టుడుగా ఉండుటకు వెదికేవారే నిజమైన పరిశుద్ధతను కనుగొందురు కాని గ్రీకు పదములలో అర్ధమును లేక క్రొత్తనిబంధన కాలములను తెలుసుకొనుటద్వారా కాదు. దేవుడు మన హృదయములను చూస్తాడు కాని మన తెలివిని కాదు.

పౌలు విషయములోవలే, దేవుని వెలుగులో మన పాపమును ఎంత ఎక్కువగా చూడగలమో అంత ఎక్కువగా మనము పరిశుద్ధ పరచబడగలము.