వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు పురుషులు
WFTW Body: 

యెషయా 6వ అధ్యాయములో దేవుని సింహాసనమును మరియు బలిపీఠమును దర్శనములో యెషయా చూచియున్నాడు. అప్పుడు దేవుడు ఇలాగున అడిగియున్నాడు, "నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును? (యెషయా 6:8). అంతట "నేనున్నాను నన్ను పంపుమని" యెషయా చెప్పాడు.

మనము సింహాసనమును మరియు బలిపీఠము (క్రీస్తు సిలువ)ను ఎల్లప్పుడు చూడాలి. దేవుని పరిశుద్ధతను చూచి మొదటిగా మనము ఆశ్చర్యపడి కొట్టబడాలి తరువాత క్రీస్తురక్తముతో కడుగబడి తిరిగి లేపబడాలి. ఆవిధముగానే మనము దేవుని సేవించగలము. దేవుడే మనలను పంపని యెడల, మనము వెళ్ళి ఆయనను సేవించలేము. దేవునిచేత పంపబడకుండా మనంతట మనమే పరిచర్యకు వెళ్ళినట్లయితే, అప్పుడు మనము చేసేదంతయు వ్యర్ధమే.

"అనేకమంది క్రైస్తవపనివారు" దేవుని చేత పంపబడలేదు. ఒక సంస్థగాని లేక ఒక మనిషిగాని వారిని పరిచర్యకు పంపించారు లేదా వారు తామంతటతామే వెళ్ళియుండవచ్చును. అవసరము చాలా ఉన్నది కాబట్టి ఏదొక క్రైస్తవపరిచర్య చేయుట చాలా సులభము. మనము చేసే పరిచర్య నిత్యత్వానికి నిలిచియుండాలంటే, మనలను దేవుడే స్వయముగా పంపాలి. వేరే దైవజనులు మన యొక్క దేవుని పిలుపును నిశ్చయపరచవచ్చును గాని వారు మనలను పిలువలేరు లేక పంపలేరు.

సౌలును మరియు బర్నబాను దేవుడే తన సేవకు వ్యక్తిగతముగా పిలిచియున్నాడు. వారి పిలుపును గూర్చిన నిశ్చయత తరువాత ఇతర ప్రవక్తల ద్వారా కలిగింది (అపొ.కా. 13:1-4). దేవుడు మనలను పిలిచినప్పుడు, మనము బోధించవలసినది కూడా ఆయనే చెప్పును. యెషయాతో ఆయన, "నీ పోయి యీ జనులతో ఇట్లనుము" (యెషయా 6:9).

యెషయా కాలములో వలె దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. మనము క్రొత్త నిబంధనలో ఉన్నాము గనుక యెషయా వలె మనము బాహ్య చెవులతో వినముగాని పరిశుద్ధాత్మ మన హృదయములలో నివసించుచున్నాడు కాబట్టి ఆయన స్వరమును మన హృదయములలో వింటాము. అయితే ఆయన స్వరము ఎంతో స్పష్టముగా ఉంటుంది. అయితే ఆ స్వరమును నేను బాహ్య చెవులతో ఒక్కసారి కూడా వినలేదు, నేను ఆయననెప్పుడైనను చూడలేదు లేక నా కళ్ళతో దేవదూతను కూడా చూడలేదు. కాని గత అయిదు దశాబ్దములలో అనేకసార్లు నా హృదయములో ఆయనను చూచాను మరియు స్పష్టముగా ఆయన స్వరాన్ని విన్నాను.

తనను చూచి నమ్మిన వారికంటే, చూడకనమ్మువారు ధన్యులని ప్రభువైనయేసు చెప్పారు (యోహాను 20:29).

దేవుడు యెషయాకిచ్చిన బాధ్యత కష్టమైనది. ఆయన యెషయాతో ఇట్లన్నాడు, "ఆయన-నీవు పోయి యీ జనులతో ఇట్లనుము-మీరు సత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను" (యెషయా 6:9,10). ప్రభువైనయేసు ఉపమానము చెప్పినప్పుడు ఈ వచనాన్ని చెప్పారు (మత్తయి 13:15).

కాబట్టి ఇక్కడ మనమేమి చూచుచున్నాము? దేవుని గూర్చిన దర్శనము, స్వయాన్ని గూర్చిన దర్శనము, క్షమించే కృపను గూర్చిన దర్శనము, అభిషేకమును పొందుకొని చేసే సేవను గూర్చిన దర్శనము, చివరిగా ఫలాన్ని గూర్చిన దర్శనము (యెషయా 6:13).చెడిపోయిన యుదాలో నుండి పవిత్రమైన విత్తనము వచ్చును. మన పరిచర్య ద్వారా దేవునికి శేషము లేపబడును.