వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
WFTW Body: 

బబులోను (అసత్యమైన సంఘము) “మహాబబులోను” అని ప్రకటన గ్రంధములో పదకొండుసార్లు పిలువబడినది. యెరూషలేము (క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె) పరిశుద్ధ పట్టణమని పిలువబడినది (ప్రకటన 11 నుండి 21 అధ్యాయములు చూడండి).

మనము లోకపు దృష్టిలో సంఘముగా గొప్పగా ఉండాలని చూచినట్లయితే మనము బబులోను వైపు కొట్టుకొనుపోవు వారమగుదము. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టిలో అసహ్యము అని యేసు చెప్పారు (లూకా 16:15). అందువలన మన సంఘములో ఏ విషయములోనైనా, అది సంగీతము లేక బోధించుట, అనగా మనుష్యులను ఆకట్టుకొనుటకు చెప్పేది లేక చేసేది ఏదైనా చేస్తున్నామేమోనని ఎప్పుడూ గమనించుకొనవలసియున్నది. సంఖ్య ఎప్పుడూ మనుష్యులకు ఆకర్షణీయముగా యుండును. మనము సంఘము యొక్క ఎదుగుదలను లెక్కల ద్వారా చూపుటకు ఆసక్తి చూపినట్లయితే, అది బబులోను యొక్క ఒక ఖచ్చితమైన గుర్తుగా యున్నది. దీని అర్ధము దేవుడు మనకు ఇతరులను చేర్చుటలో ఆసక్తిగా లేడని కాదు. ఆయన యొక్క ఇతర గొఱ్ఱెలకు (ఆత్మీయ జీవితముయెడల ఆసక్తిగాయున్నవారు) సిఫారసు చేయగలిగిన మందగా మనలను ఆయన తలంచినట్లయితే ఆయన తప్పక ఇతరులను చేర్చును. కాని సంఖ్యలో పెరుగుట ఎదుగుదలకు సూచనగా ఉండాల్సిన అవసరములేదు. ఎందుకంటే విపరీత మత మౌఢ్యవాదులు ఇతర అన్యమతములు కూడా సంఖ్యలో పెరుగుచున్నవి. అంతేకాకుండా చాలాసార్లు వారియొక్క లెక్కలు అనేక క్రైస్తవ గుంపుల కంటే చాలా ఆకర్షణీయముగా ఉంటున్నాయి.

పరిశుద్ధత నిజమైన సంఘము (యెరూషలేము) యొక్క లక్షణముగా యున్నది. కనుక యెరూషలేము యొక్క ఎదుగుదల పరిశుద్ధతను బట్టి కొలవబడుతుంది. అందులో ఒకరి యెడల ఒకరికుండిన ప్రేమ కూడ కొలువబడుతుంది. జీవమునకు పెళ్ళుమార్గము ఇరుకైనదనియు మరియు కొద్ది మందిమాత్రమే దానిని కనుగొందురని యేసుప్రభువు చెప్పారు. అందును బట్టి ఎవరైతే ఇరుకు ద్వారమును యేసుప్రభువు ఇరుకు చేసినంత ఇరుకు చేయుదురో వారి సంఘములో సహవాసమునకు తప్పనిసరిగా తక్కువ మంది మాత్రమే వచ్చెదరు (మత్తయి 7:13, 14). అయితే యేసుప్రభువు చెప్పిన దానికంటే ద్వారమును మనము విశాలము చేసినట్లయితే, అప్పుడు చాలా సులువుగా మనము మన సంఖ్యను పెంచుకొనవచ్చును. ఇక్కడనే చాలా వరకు ఈనాటి క్రైస్తత్వము తప్పుమార్గములో పోవుచున్నది. యేసుప్రభువు ఇరుకు ద్వారము మరియు ఇరుకు మార్గము గూర్చి “కొండమీద ప్రసంగము” (మత్తయి 5 - 7 అధ్యాయముల)లో చెప్పారు. ఆ అధ్యాయములలో ఇరుకు ద్వారము మరియు ఇరుకు మార్గములంటే ఏమిటో చెప్పబడియున్నది.

1 కొరింథీ 3:13లో ఆఖరి దినాన్ని మన పనిని ప్రభువు పరిమాణాన్ని బట్టి కాక నాణ్యతను బట్టి పరీక్షిస్తారని తేటగా చెప్పబడినది. నాణ్యతతో కూడిన పరిచర్య కేవలము ఎవరైతే ఎల్లప్పుడు తమను తాము తీర్పు తీర్చుకొందురో వారి యొద్దనుండి మాత్రమే వచ్చును. ఇక్కడ నిజమైన సంఘము మన చుట్టూ ఉండిన ఇతర పేరుపొందిన క్రైస్తవ శాఖలకు వ్యత్యాసముగా ఉండును.

పాత నిబంధనలో ఎప్పుడూ వివరణ బాహ్య విషయములకు ఇవ్వబడినది. అది “వారి హృదయ కాఠిన్యమును బట్టి” (మత్తయి 19:8)అని చెప్పబడినది. ధర్మశాస్త్రము బాహ్యమైన స్వచ్చత గూర్చి వివరణ ఇచ్చినది. దానికి వేరుగా క్రొత్త నిబంధన మొదట “గిన్నె లోపల” శుభ్రపర్చుట గూర్చి వివరణ ఇచ్చినది (మత్తయి 23:25, 26). ఆ వచనములో యేసుప్రభువు ఒకసారి లోపల శుభ్రపరిచినట్లయితే, బయట దానికదే శుభ్రపరచబడునని, కనుక బయట శుభ్రపరచవలసిన అవసరము లేదని చెప్పారు. దీనిని మనము మత్తయి 5:21-30 లో చూడవచ్చును. ఒకడు తన హృదయమును కోపమునుండి శుభ్రపరచుకొనినట్లయితే అతడు బహిరంగముగా నరహత్యచేసే ప్రమాదములో ఉండడు. అదేవిధముగా అతడు తన హృదయమును లైంగిక మోహము నుండి శుభ్రపరచుకొనినట్లయితే, అతడికి బాహ్యముగా వ్యభిచారము చేసే ప్రమాదముండదు. పాత్రను లోపల శుభ్రపరిచినట్లయితే బయట దానికదే శుభ్రపరచబడుతుంది.

సంఘములో ప్రాధమికంగా వివరణ బాహ్యమైన సినిమాలకు వెళ్లుట, పొగత్రాగుట, మత్తు పదార్దములు సేవించుట, జూదము మరియు అటువంటి బాహ్య జీవితమునకు సంబంధించిన వాటిపైనే ఉండినట్లయితే, అటువంటి సంఘము పాత నిబంధనకు సంబంధించిన సంఘముగా మాత్రమే ఫలవంతమైనది!! ఈ భాహ్యమైన విషయాలన్నీ తప్పని సరిగా చెడ్డవే కాని వాటిని పోగొట్టుటకు మార్గము మొదట వాటిపై కేంద్రీకరించుట కాదు. కాని అటువంటి బాహ్యముగా కనబడే దుష్టత్వాన్ని కలుగజేసే అంతరంగపు లోకతత్వపు వైఖరి కల మనస్సుపై కేంద్రీకరించవలెను.

ఎవరికి వారు తీర్పు తీర్చుకొనకుండా అంతరంగములో శుద్ధి పొందడము జరుగదు. ఇటువంటి అంతరంగ శుద్ధి గూర్చి ఎప్పుడూ సంఘములో బోధించకపోయినట్లయితే సంఘమును కట్టుట అసాధ్యము. పాపము యొక్క భ్రమతో కఠిన పర్చబడకుండునట్లు సంఘములో ఒకరినొకరు హెచ్చరించుకొనుచుండవలెనని బైబిలు చెప్పుచున్నది (హెబ్రీ 3:13; 10:25). చాలా క్రైస్తవ సంఘములలో ఇటువంటి బోధ యెడల ఆసక్తి లేదు. దానివలన అవి గిన్నె బయట మాత్రమే శుభ్రపరచే పరిసయ్యులను తయారు చేయుచున్నవి.