"నా మాదిరిని చూడుడి". అనగా "నేను ఏవిధముగా జీవించానో చూడుడి" అని జీవితాంతమున పౌలు చెప్పుచున్నాడు. దీనినే పౌలు తిమోతికి మరలా, మరలా చెప్పుచున్నాడు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను "తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికిగా ఎంచినందుకు, నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనైయున్నాను(1తిమోతి 1:12).
దేవుడు తన సార్వభౌమాధికారాన్ని బట్టి కొందరిని తన పరిచర్యకు పిలుస్తాడు మరియు ఆ వ్యక్తి, పరిచర్యచేయుటకు ముందుగానే ఆ వ్యక్తిని దేవుడు పరీక్షిస్తాడు. పౌలు 10 సంవత్సరములు పరీక్షింపబడ్డాడు. అతడు అపొ.కా. 9 అధ్యాయములో రక్షణపొంది మరియు అపొ.కా. 13 అధ్యాయములో అతడు పరిచర్యకు పంపబడ్డాడు. ఆ 10 సంవత్సరములు పౌలుకు ఏమి జరిగియున్నది? ఒక క్రైస్తవుడుగా అతడు తన నిజజీవితములో నమ్మకముగా ఉన్నాడా లేడా అని దేవుడు చూచియున్నాడు. దేవుడు అతనిని 10 సంవత్సరములు పరీక్షించిన తరువాత అతని నమ్మకత్వాన్ని చూచి ఆయన ఇట్లన్నాడు, "నన్ను సేవించుటకు ఇప్పుడు నేను నిన్ను పంపుచున్నాను".
దేవుడు నిన్ను పిలిచినట్లయితే, మొదటిగా నిన్ను పరీక్షిస్తాడు. క్రొత్తనిబంధన అనే సంఘములను నిర్మించుట అనే పరిచర్యను నాకిచ్చుటకు ముందుగా 16 సంవత్సరాలు దేవుడు నన్ను పరీక్షించాడు (అందులో 9 సంవత్సరాలు క్రైస్తవ పరిచారకుడుగా ఉన్నాను). క్రైస్తవ పరిచర్యలో నీవు ప్రవేశించిన వెంటనే, నీవు అభిషేకము కలిగిన పరిచర్యను కలిగియుంటావని ఊహించుకొనవద్దు. చిన్న చిన్న విషయాలలో నీవు నమ్మకముగా ఉన్నావా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. నీవు దేవునివాక్యాన్ని చదివి ధ్యానించుట, ధనమువిషయంలో నమ్మకముగా ఉండుట, సమయము విషయంలో నమ్మకముగా ఉండుట, యధార్ధవంతుడైయుండి మరియు దీనుడవై దేవుడు నీ పైన ఉంచిన అధికారానికి లోబడుచున్నట్లయితే, 10 సంవత్సరముల తరువాత దేవుడు నీకు ఫలించే పరిచర్యను ఇవ్వవచ్చును. నీ స్వంత తలంపులతో 30 సంవత్సరములలో చేసే పరిచర్యకంటే, నీవు దేవునిచేత పంపబడి పరిచర్య చేసినయెడల ఒక సంవత్సరములలోనే ఎక్కువగా చేయగలవు.
"ఆయన తన పరిచర్యకు నన్ను నియమించియున్నాడు" అని పౌలు చెప్పుచున్నాడు (1 తిమోతి 1:12). నేను దూషకుడను, హింసకుడను అయినప్పటికినీ ఏ మానవుడు నన్ను నియమించలేదు (1 తిమోతి 1:13).
భ్రష్టులైన పాపులు రక్షణపొందినప్పుడు, దేవుడు వారికి పరిచర్య ఇచ్చును. గతంలో చెడ్డ(దుష్ట) జీవితము జీవించిన వారికి ఇది ఎంతో ప్రోత్సహకరము. ప్రభువైనయేసు తాను నీతిమంతులను పిలువ రాలేదు గాని పాపులను పిలువ వచ్చితినని ఋజువుచేయుటకు తన తరములో ఉన్న అతిచెడ్డ పాపులను తన అపొస్తలులుగా ఆయన మార్చియున్నాడని 2వ శతాబ్దములో ఒక రచయిత వ్రాసియున్నాడు. వారిలో పౌలు ఒకడు. "పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను. అట్టివారిలో నేను ప్రధానుడను" (1 తిమోతి 1:15) .
కాబట్టి దైవభక్తిగల కుటుంబములో పుట్టి మరియు పవిత్రముగా జీవించిన వారిని మాత్రమే ఆయన పిలువడు. అటువంటి వారిని కూడా ఆయన వాడుకుంటాడు. కాని ఘోర పాపములో జీవించినవారిని కూడా ఆయన ఏర్పరచుకుంటాడు. వ్యభిచారులను, దొంగలను, త్రాగుబోతులను, మత్తుపానీయాలకు అలవాటు పడిన వారిని కూడా ఆయన పిలిచి, ఏర్పరచుకొనియున్నాడు కాబట్టి రక్షణపొందక ముందు వారు చేసిన పాపములు వారు అపొస్తలగుటకు అనర్హులుగా చేయదని ఋజువుపరచబడింది. పాపులలో ప్రధానుడైన పౌలు అందరికంటే గొప్ప అపొస్తలుడయ్యాడు. నీవు మారుమనస్సు పొంది నీ పాపములను ఒప్పుకొని మరియు ప్రభువైనయేసునందు విశ్వసించినట్లయితే దేవుడు నీ ద్వారా కూడా ఎంతో చేయగలడు.