యోహాను 6వ అధ్యాయము, గొప్ప జనసమూహము(2వ వచనము)తో ఆరంభమై మరియు 11మందితో (70వ వచనము)తో ముగుస్తుంది. మీ సంఘము ఆత్మీయంగా నాణ్యతతో వృద్ధిపొందాలంటే, దానిని ప్రభువైనయేసుయొద్ద నేర్చుకోవచ్చును. కాని చాలామంది బోధకులకు మరియు పాస్టర్లకు నాణ్యతలో ఆసక్తి ఉండదు. ఎందుకంటే వారు ఎక్కువమందిని కోరుతారు. అయితే ప్రభువైనయేసు సంఖ్యలో తగ్గినను, నాణ్యతను పెంచుటలో గొప్పగా చేయగలడు.
దేవుడు గిద్యోనుకు జయము నిచ్చుటకు ముందుగా 33000 మందిని 300మందికి తగ్గించాడు అనగా 99% సైన్యాన్ని తగ్గించాడు. దేవుడు తానేర్పరచుకొనిన కొద్దిమందితోనే ఎల్లప్పుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ ప్రభువైనయేసు ఏవిధంగా చేశారో చూస్తాము. "నాశరీరము తిని, నా రక్తము త్రాగువాడే నిత్యజీవముగలవాడని", ప్రభువైనయేసు చెప్పారు. అనగా తనతో కూడా మనం సిలువవేయబడియున్నామని చెప్పారు(యోహాను 6:56). ఈ మాటలను బట్టి జన సమూహములోని అనేకులు అభ్యంతరపడి ఇట్లన్నారు, "ఇది కఠినమైనమాట"(60,66వ వచనములు) మరియు ఎవరినైనను ప్రభువైనయేసు తనతో ఉండమని చెప్పలేదు.
తనతో ఉన్న 12మంది శిష్యులతో కూడా మీరు కూడా వెళ్ళాలంటే వెళ్లవచ్చున్నారు. ప్రభువైనయేసు వైఖరి, "సిలువను గూర్చిన సువార్తను బట్టి ఎవరైనను అభ్యంతరపడి, నన్ను విడిచి వెళ్ళాలంటే వెళ్ళవచ్చును. నేను వారిని ఆపను. అయితే శిష్యులకున్న షరతులను నేను తగ్గించను".
ఇటువంటి వైఖరి ఈనాటి బోధకులు కలిగియుంటే ఎంత శక్తివంతమైన జీవముతో నిండిన సంఘములు కట్టబడతాయో కదా! ఈనాడు ఆర్థికంగాను మరియు శారీరకంగాను స్వస్థతపొందుటకే బోధకులు ప్రజలను ప్రభువుయొద్దకు ఆహ్వానించుచున్నారు. అటువంటి ఆశీర్వాదలకొరకు "యేసు" యొద్దకు ఆహ్వానిస్తే ఎవరు రాకుండా ఉంటారు? కాని "మరియొక యేసును" అనగా ఇటువంటి బోధను బోధించని విశ్వాసులు కూడా దానినే దేవుని ఆశీర్వాదమని నమ్ముచున్నారు. ఇది మోసకరము. ప్రతిమతములో ఉన్న వ్యాపారస్తులు డబ్బును సంపాదించి మరియు దేవుడు వారిని ఆశీర్వాదించాడని ఊహించుకొనుచున్నారు.
అంతకంతకు క్రీస్తుసారూప్యములోనికి రూపాంతరము పొందుటయే దేవుని నిజమైన ఆశీర్వాదానికి గుర్తు. నిజమైన యేసు, "మీరు వచ్చి మరియు చనిపోవుడి(ఉపేక్షించుకొనుడి)" అని ఆహ్వానిస్తున్నాడు. ఇటువంటి సందేశానికి అనేకులు ఆకర్షించబడరు. దేవునిజీవాన్ని సమృద్ధిగా పొందే ఇరుకుమార్గమును కొందరే కనుగొంటారని యేసు చెప్పారు. కాబట్టి అది ఆశ్చర్యము కాదు (మత్తయి 7:14). ఇటువంటివారే సంఘమును కట్టగలరు. ప్రభువైనయేసు చెప్పినట్లు వారు శ్రమలలోను, అపార్ధము చేసుకొనబడుటలోను వెళ్ళవచ్చును (యోహాను 16:33). కాని వారు నిత్యత్వానికి నిలిచియుండే దేవుని పనిని చేస్తారు.