క్రీస్తు సంఘములో ఎవరు అత్యవసరము కాదు. మనము లేకున్నప్పటికీ దేవుని పని సులభముగా జరుగును. నిజానికి, తాము అత్యవసరమని అనుకొనువారు లేనప్పుడు దేవుని పని చాలా మంచిగా జరుగును. ఈ సంగతిని మనమెల్లప్పుడు గుర్తించవలెను. తాను “అత్యవసరము” అని అనుకొనువాడు దీనుడగుటకు ఒక ఆజ్ఞను ఒకసారి చదివితిని. అతడు ఒక బకీటును నీటితో నింపి తన చేతులను మణికట్టు వరకు ముంచి మరియు బయటకు తీయవలెను తరువాత ఆ నీటిలో ఎంత రంధ్రము ఉన్నదో, అంత అతడు లేనప్పుడు కొదువ ఉండును. మనకున్న వరములు సంఘమునకు ఉపయోగకరమే కాని ఎవరు (ఏ ఒక్కరూ) అత్యవసరము కాదు. ఎప్పుడైననూ దేవుడు మనలను వెనుకకు పిలిచినయెడల వెనుదిరుగుటకు ఇష్టపడవలెను. కాని తన కొరకే తాను బ్రతికే క్రైస్తవ పనివాడు దానిని ఎన్నటికీ అంగీకరించడు. తనకున్న పదవి సాధ్యమైనంత ఎక్కువ కాలము ఉండవలెనని దానిని పట్టుకొనును. అటువంటి అనేక "క్రైస్తవ నాయకులు" దేవుని పనికి ఆటంకముగా వారి సింహాసనముల మీద ఉంటున్నారు(కంపుకొట్టుచున్నారు). వారి స్థానమును వేరే వారు తీసుకొనునట్లు కనికరముతో వెనుకకు వెళ్ళుట వారికి తెలియదు.
దానిని కొనసాగించు మరియొకడు లేనట్లయితే ఆ జయము కూడా ఓటమేనను సామెత ఉన్నది. యేసు దీనిని ఎరుగును గనుక ఆయన పనిని కొనసాగించుటకు ప్రజలకు తర్ఫీదు నిచ్చెను. తన పరిచర్య మీద నాయకత్వము వహించుటకు ఇతరులకు 3 1/2 సం లలో తర్ఫీదు ఇచ్చెను. మనము వెంబడించుటకు ఇది ఎంత గొప్ప మాదిరి?
తన పరిచర్యను కొనసాగించుటకు ఇతరులకు తర్ఫీదు ఇవ్వవలసిన అవసరమును పౌలు గుర్తించెను. 2 తిమోతి 2:2 లో తిమోతితో ఇట్లనెను. “నీవు అనేక సాక్షుల యెదట నావలన వినిన సంగతులను బోధించుటకు సామర్ధ్యముగల నమ్మకమైన మనుష్యులకు (నాలుగవ తరము) అప్పగించవలెను”. ఇక్కడ పౌలు చెప్పుచున్నదేమిటి అనగా “ఈ సంపదను ఇతరులకు అప్పగించవలెను. నీ కంటే చిన్న వారి యొక్క అభివృద్దికి ఎప్పడైననూ నీవు ఆటంకముగా ఉండవద్దు”.
“దానిని కొనసాగించుటకు మరియెకడు లేనట్లయితే ఆ జయము కూడా ఓటమేనను” నియమమును వ్యాపారస్తులు కూడా గుర్తించియున్నారు. కాని చాలా మంది క్రైస్తవనాయకులు దీనిని గుర్తించుట లేదు. నిజముగా “వెలుగు సంబంధులకంటే లోకసంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులైయున్నారు” (లూకా 16:8).
ఒక మనుష్యుడు తన కంటే చిన్నవాడు, పనులను తనకంటే బాగుగా చేసినప్పుడు కేవలము అతనిలో స్వార్ధమును బట్టి అసూయపడును. దేవుడు కయీనును విడిచి హేబెలును అంగీకరించినప్పడు అతడు అసూయపడెను. హేబెలు తనకంటే పెద్ద వాడైనట్లయితే సహించగలిగి యుండెడివాడేమో. తన తమ్ముడు తన కంటే యోగ్యుడను సత్యము, తన తమ్ముడైన హేబెలును చంపునట్లుగా చేసెను.
యోసేపు మరియు అతని సహోదరుల విషయములో కూడా దీనిని చూచెదము. యోసేపు దేవుని ప్రత్యక్షతలు పొందెను మరియు దానిని బట్టి తన పదిమంది అన్నలు తన మీద అసూయపడి అనగా అతనిని చంపునంతగా అసూయపడిరి.
“సౌలు వేల మందిని చంపెను కాని దావీదు పదివేల మందిని చంపెను” అని స్త్రీలు పాడినప్పుడు సౌలురాజు తన కంటె చిన్నవాడైన దావీదు మీద అసూయపడెను. ఆరోజునుండి దావీదును చంపుటకు నిర్ణయించుకొనెను. అయ్యో! మానవచరిత్ర అంతయు, క్రైస్తవసంఘ చరిత్రలో కూడా ఈవిధముగా మరల మరల జరిగినట్లు చూచుచున్నాము. అదే విధముగా పెద్దలైన పరిసయ్యులు యౌవ్వనుడైన నజరేయుడగు యేసును చూచి అసూయపడి మరియు ఏవిధముచేతనైనను ఆయనను చంపవలెనని తీర్మానించుకొనిరి.
మరొకవైపున క్రొత్త నిబంధనలో బర్నబా వంటి వ్యక్తిని చూచుట చాలా ఆహ్లాదముగా ఉన్నది. పౌలును ఎవరు అంగీకరించనప్పుడు, బర్నబా ఒక పెద్ద పరిచారకుడైయుండి క్రొత్తగా మారుమనస్సు పొందిన పౌలును తీసుకొని వెళ్ళెను. అతడు పౌలును అంతియొకియ సంఘమునకు తీసుకొని వచ్చి మరియు అతనిని ప్రోత్సహించెను. అపొస్తలుల కార్యములు 13 వ అధ్యాయములో, బర్నబా మరియు పౌలు కలసి సువార్త పరిచర్య నిమిత్తము వెళ్ళెనని చదివెదము. కాని దేవుడు తనకంటే చిన్నవాడైన పౌలును పెద్ద పరిచర్యకు పిలిచియున్నాడని చూచినప్పుడు తనకు తానుగా వెనుకకు తగ్గి మరియు కనికరముతో కనుమరుగయ్యెను(వెనుకకు వెళ్ళెను). అపొస్తలుల కార్యములలో “బర్నబా మరియు పౌలు” అను మాట ఇప్పుడు “పౌలు మరియు బర్నబా” గా మారుట గమనించగలము. ఈవిధముగా వెనుకకు వెళ్ళి మరియు ఇతరులు గౌరవము పొందునట్లు చేయు బర్నబాలు చాలా కొద్దిమంది ఉండుట వలన ఈనాటి క్రైస్తవసంఘము నష్టపోవుచున్నది. ప్రాముఖ్యత లేని విషయములలో మనము వెనుకకు తగ్గుటకు ఇష్టపడెదము. ఉదాహరణకు ఒక ద్వారము గుండా వెళ్ళునప్పుడు, మనము ప్రక్కకు వెళ్ళి వేరే వాళ్ళను పోనిచ్చెదము. కాని క్రైస్తవసంఘములోని పదవి మరియు నాయకత్వము విషయములో, వెనుకకు వెళ్ళుటకు మనము సిద్ధముగా లేము. మన స్వార్ధము ఎంతో మోసకరమైనది. విలువలేని విషయములలో మనము నకిలీ దీనత్వమును కలిగియుండవచ్చును. కాని విలువగల విషయములోనే మనమేమైయున్నామనునది చూడగలము.