వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము
WFTW Body: 

అపొ. పౌలు చేసిన ప్రార్ధనలను, ఆసక్తికరమైన బైబిలు పఠనముగా చేయవచ్చును. రోమాపత్రిక నుండి 2 తిమోతి వరకు పౌలు అనేకప్రార్ధనలు చేశారు. అయితే తనయొక్క ప్రార్ధనలన్నియు ఎల్లప్పుడు ఆత్మీయసంగతులను గూర్చియే చేశాడు. ప్రజలు ధనవంతులు కావలెననిగాని లేక వారు మంచి ఇళ్ళు కలిగియుండాలనిగాని లేక వారు పెద్ద ఉద్యోగములలో చేరాలనిగాని అతడు ఎప్పుడైనను ప్రార్ధించలేదు. భౌతికవిషయాల(వస్తువుల) గురించి అతడు ప్రార్ధించలేదు. ఈ లోకములో ఉన్న సమస్తమును తాత్కాలికమైనవని తనకు బాగుగా తెలియును కాబట్టి నిత్యత్వము ఉండే మహిమకరమైన నిత్యమైన వాటికొరకే అతడు ఎల్లప్పుడు ప్రార్ధించాడు. అది ఎలా ఉంటుందనగా, ఒకవేళ నీవు ఢిల్లీలో 50 సంవత్సరాలు నివసించుటకు బయలుదేరి ఢిల్లీకి వెళ్ళుచున్నట్లుగా ఉంటుంది. నీ కొరకు ప్రార్ధించేవారెవరైనను నీ ప్రయాణము సుఖముగా జరగాలని, రైలులో నీవు వెళ్ళుచున్నప్పుడు మంచిఆహారము, మంచిబట్టలు మరియు మంచినిద్రకొరకు అతడు ఎక్కువ సమయం ప్రార్ధించకూడదు. ఢిల్లీలో నీవు జీవితాంతం సంతోషముగా ఉండాలని ప్రార్ధించాలి. మనము నిత్యత్వము(పరలోకము) కొరకు ఈ లోకములో కొద్దికాలము సిద్ధపడుచున్నాము. వారు నిత్యత్వములో ప్రవేశించినప్పుడు దేనిని గూర్చియైనను చింతించకుండనట్లు భూమిమీద జీవించాలని పౌలు ప్రార్ధించాడు.

కొలస్సీ 1:9-12లో వారు సంపూర్ణజ్ఞానమును ఆత్మసంబంధమైన వివేకముగలవారును, ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించినవారునైయుండాలని ప్రార్ధించాడు. ఒక తర్జుమాలో ఇలా వ్రాయబడింది, "మీరు సంగతులన్నింటిని దేవునిదృష్టితో చూడాలని నేను ప్రార్ధించుచున్నాను". సంపూర్ణజ్ఞానమును ఆత్మసంబంధమైన వివేకమును గలవారనగా ప్రతి విషయాన్ని దేవుడు చూసినట్లుగా చూచుట. నీశరీరమును గురించి నీవు ఆలోచించునప్పుడు, లోకములోని వేదాంతులు చెప్పేది నీవు వినవద్దుగాని దేవునిదృష్టితో చూడుము. "నా జీవితములో జరుచున్న సమస్తమును నీ దృష్టితో చూచుటకు సహాయము చేయమని" మనకొరకు మనము ప్రార్ధించుట మంచిది. నా జీవితములో సంభవించే ప్రత్యేకమైన పరిస్థితిని లేక రోగమును లేక నాశరీరములో ఉన్న ముల్లును లేక నన్ను బాధించేవ్యక్తిని నేను ఏవిధముగా చూడాలి? వాటిని దేవునిదృష్టితో చూడుము. ఆ విషయము దేవునిని ఆశ్చర్యపరుస్తుందా? అది దేవునిని ఆశ్చర్యపరచదు. సమయము విషయములోను మరియు స్థలము విషయములో నేనెంతో పరిమితి చేయబడిన మనిషిని కాబట్టి అది నన్ను ఆశ్చర్యపరుస్తుంది. కాని దేవుడు ఆశ్చర్యపడడు. నేను దేవునితో ఏకీభవించి, ఆయనతో ఒక్కటైనప్పుడు, నా హృదయములోనికి దేవుని విశ్రాంతి వస్తుంది మరియు భూమిమీద సంగతులు(విషయములు) నాకు వేరుగా కనిపిస్తాయి. కాబట్టి ఈ విధముగా ప్రార్ధించుట మంచిది.

విషయాలను దేవునిదృష్టితో చూచుటకు నేర్చుకొనిన ప్రజలతో నీవు సంఘమును కట్టినయెడల(సంఘముగా కట్టబడినయెడల), అది ఆత్మీయసంఘమైయుంటుంది. కేవలము సువార్త ప్రకటించి మరియు సమాజసేవ చేసినట్లయితే నీవు ఆత్మీయసంఘాన్ని కలిగియుండలేవు. సంగతులను మనము దేవునిదృష్టితో చూచుట నేర్చుకొనినప్పుడు మాత్రమే మనము ఆయనకు ఇష్టులముగా నడుచుకొనగలము (కొలస్సీ 1:10). మొదటిగా నీ మనస్సు మారి(అనగా నీ ఆలోచనావిధానము మారుటద్వారా నీ విలువలు, ప్రాధాన్యతలుకూడా మారును). దేవునిదృష్టితో సంగతులను చూడగలుగనట్లు రూపాంతరము చెందితేనేగాని దేవుని మార్గములో నీవు నడువలేవు.