WFTW Body: 

"ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. యేసు - నా వెంబడి రండి, ’మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని’ వారితో చెప్పెను" (మార్కు 1:16,17). గలిలయ తీరమున వందలమంది జాలరులు ఉన్నారు. ఆయన వారందరినీ పిలువలేదు. పేతురు, అంద్రెయ, యాకోబు మరియు యోహాను అను నలుగురిని మాత్రమే పిలిచాడు. క్రీస్తుకు సాక్షులుగా ఉండుటకు మనము పిలువబడ్డాము. కాని పూర్తికాలపు పరిచర్యచేయుటకు, ఒకడు దేవునిచేత ప్రత్యేకముగా పిలువబడాలి. నీకు నీవుగా నేను సువార్తికుడను అవుతానని లేక బోధకుడను అవుతానని అనకూడదు. దేవుడే నిన్ను ఒక పరిచర్యకు పిలిచి దానికి అవసరమైన దానిని నీకిస్తాడు. ఈనాడు కూడా దేవుడే తన దాసులను పిలుస్తున్నాడు. మానవశరీరములోని ప్రతి అవయవమెలాగున అవసరమో, అలాగే క్రీస్తు దేహముగా నిర్మించబడుచున్న సంఘములో కూడా ప్రతి పరిచర్య ముఖ్యమైనదే. ముఖములాంటి కొన్ని భాగాలు పైకి కనబడవచ్చును మరియు కిడ్నీలు మరియు ఊపిరితిత్తులు కనపడవు. క్రీస్తు శరీరమైయున్న సంఘములో కూడా కొన్ని పరిచర్యలు బాహ్యంగా కనిపిస్తాయి మరికొన్ని కనపడవు.

మత్తయి 11:29 లో ప్రభువైనయేసు ఇట్లన్నారు, "నా యొద్ద నేర్చుకొనుడి". "నా వెంబడి రండి" అని ఆయన ఇక్కడ చెప్పుచున్నాడు. ఇవి ఒక శిష్యుడు చేయవలసిన రెండు విషయాలు. ఎల్లప్పుడు ఆయన యొద్ద నేర్చుకొనుచూ మరియు వెంబడించువాడే శిష్యుడు. అతని జీవితమంతయు ప్రభువైనయేసు యొద్ద నేర్చుకొనుచూ మరియు వెంబడిస్తాడు. సైన్యములో మార్చ్ చేసేటప్పుడు, "లెప్ట్, రైట్, లెప్ట్, రైట్" అని చెపుతారు. ప్రభువు మరలా వచ్చే వరకు మనం, "నేర్చుకొనుడి, వెంబడించుడి, నేర్చుకొనుడి, వెంబడించుడి" అని చెప్పుతూ ఉండాలి. నీవు ఎల్లప్పుడూ నేర్చుకొనుచూ ఉండి వెంబడించకుండా ఉన్నట్లయితే, అది మార్చ్‍లో "లెప్ట్, లెప్ట్, లెప్ట్" అనగా కేవలం ఎడమ కాలుతోనే అన్నట్లుగా ఉంటుంది. కాని నిజమైన విశ్వాసి ఎల్లప్పుడు ప్రభువుయొద్ద నేర్చుకొనుచూ, పొందుకొనుచూ ఉండి, తాను నేర్చుకున్న దానిప్రకారము జీవిస్తాడు. నీవు కేవలం నేర్చుకొని, దానిప్రకారము జీవించనట్లయితే అలాంటి వాళ్ళనే అనగా ఒంటికాలుతో నడిచేవాళ్ళనే నీవు తయారుచేస్తావు. సంపూర్ణముగా నేర్చుకున్నామని మనం ఎన్నటికీ చెప్పలేము. మన జీవితాంతము ప్రభువైనయేసు యొద్ద నేర్చుకుంటూనే ఉండాలి.

ఆ వచనంలో రెండవ భాగం వాగ్దానం, "మీరు నా వెంబడి వచ్చినట్లయితే, నేను మిమ్మును మనుష్యులను పట్టేవారిగా చేస్తాను". "నేను మిమ్ములను చేస్తాను" అను మాటను చూడండి. ఇది ఒక కుమ్మరి కుండను చేసినట్లుగా ఉన్నది. కుమ్మరి పాత్రలన్నిటినీ ఒకే ఆకారములో చేయడు. దేవుడు మనలను అనేకరకాలుగా చేస్తాడు. వేరే సహోదరుని పరిచర్యవలె నీ పరిచర్యను చేయమని దేవుని నీవు అడుగవద్దు. దేవుడు ఆవిధంగా ఎప్పుడైనను చెయ్యడు. ఎందుకనగా ప్రతి పాత్రను కూడా ప్రత్యేకముగా చేస్తాడు. వేరేవాళ్ళ పరిచర్య నీవు చేయాలని కోరినట్లయితే, దేవుడు నీలోను, నీద్వారా చేయాలనుకొనే దానికి అభ్యంతరపరచినట్లవుతుంది.

"దేవుడు నిన్ను ప్రత్యేకమైన వాడిగా ఉండుటకు కోరుచున్నాడు కాబట్టి నా పరిచర్యను అనుకరించుటకు ప్రయత్నించవద్దని" మా సంఘములో చెపుతూ ఉంటాను. సంఘములో నాలాంటి ఒకేఒక వ్యక్తిని మరియు నీలాంటి ఒకేఒక వ్యక్తిని సంఘములో ఉండాలని కోరుచున్నాడు.

నీవు ప్రభువును వెంబడిస్తూ ఉంటే, ఆయన నిన్ను దేనిగా ఉండాలని కోరుచున్నాడో దానిగా నీవు మార్పుచెందునట్లు ఆయన నీలో పని చేస్తాడు. అది ప్రభువు యొక్క బాధ్యత. వీరి విషయంలో మనుష్యులను పట్టే జాలరులుగా చేయుచున్నాడు. నీ విషయంలో బహుశా సంఘములో సహాయుడుగా ఉండుటయైయుండవచ్చును. కొందరు సువార్తికులుగా ఉండుటకు పిలువబడ్డారు. సువార్తికులు మనుష్యులను పట్టే వారైయున్నారు. పౌలులాంటి కొందరు అన్నియు చేస్తారు అనగా అపొస్తలుడుగాను, ప్రవక్తగాను, బోధకుడుగాను, కాపరిగాను మరియు సువార్తికుడుగాను ఉన్నాడు. కాని చాలా తరచుగా ఈ ప్రత్యేక వరాలన్నియు ఒకేవ్యక్తికి దేవుడిస్తాడు. మనలో చాలామందికి ఒకవరమే ఉంటుంది. ఆ దినాలలో సంఘములో వరాలు కలిగిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు కాబట్టి దేవుడు ఒకవ్యక్తికే అనేక వరాలు ఇచ్చేవాడు. కాని సంఘము విస్తరించిన తరువాత దేవుడు కృపావరాలను అనేకులకు ఇచ్చారు. నీ కృపావరమేదైనను, "నేనే నీలో చేస్తాను" అను నియమముతో ప్రభువు పని చేస్తాడు. ఆయన కోరేవిధంగా మనం మార్పుచెందునట్లుగా, దేవుడు మనలో పని చేయుటకు ఆయనకు అవకాశమివ్వాలి. దేవుణ్ణి నీలో పని చెయ్యనివ్వాలి.