కొలస్సీ 3:15లో "క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీహృదయములలో ఏలుచుండనియ్యుడి" అని వ్రాయబడింది. నీవు తప్పిపోవుచున్నావని నీకు ఎలా తెలుస్తుంది? దేవునిచిత్తాన్ని తొలగిపోయావని నీకు ఎలా తెలుస్తుంది? నీకు స్పష్టముగా తెలియజేయుటకు నీలో ఒక మధ్యవర్తి ఉన్నాడు. పుట్బాల్ ఆటను మీరు చూచారా? మధ్యవర్తి లేకుండా ఆ ఆట ఆడరు ఎందుకనగా మధ్యవర్తి లేనట్లయితే అందరు తప్పు చేస్తారు. కాని మధ్యవర్తి ఉన్నట్లయితే, ఎవరైన తప్పు చేసిన వెంటనే మధ్యవర్తి ఈల వేస్తాడు.
నీవు పుట్బాల్ ఆట ఆడుచున్నావని అనుకుందాము మరియు మధ్యవర్తి(రిఫరీ) ఈల వేశాడు. అప్పుడు అందరు ఆడుటను ఆపివేస్తారు. కానీ నీవు రిఫరీని పట్టించుకొనకుండా, "అంతయు బాగుంది" అని నీవు అనుకొని, ఇప్పుడు అందరూ ఆడుటను ఆపియున్నారు కాబట్టి నేను వెళ్ళి గోల్ చేస్తాను" అని చెప్పియున్నావనుకొనుము. నీవు ఆ బంతిని కొట్టి "గోల్" చేయవచ్చునేమోగానీ, ఆ రిఫరీ మాత్రము ఈ విధముగా చెప్తాడు, "ఆ బంతిని వెనుకకు తీసుకొనిరమ్ము. రెండునిమిషాల క్రితం నీవు తప్పు చేశావు కాబట్టి స్కోరు(పాయింట్లు) లెక్కించబడదు. మరియు నీవు ఆ తప్పును సరిచేసుకొనువరకు స్కోరు లెక్కించబడదు". అప్పుడు నీవు దీనుడవై, ఆ బంతిని వెనుకకు తెచ్చి, తప్పును సరిచేసుకోవాలి. అతడు ఈల వేసినప్పుడు స్కోరు లెక్కించబడదు.
దీనిని మన క్రైస్తవజీవితానికి ఏ విధముగా అన్వయించుకోవచ్చును. నీ మనస్సాక్షిలో ఉన్న మధ్యవర్తి ఈల వేసినప్పుడు, నీవు ఏదో తప్పు చేసియున్నావు. నీ భార్యతో నీవు కఠినముగా మాట్లాడియుండవచ్చును లేక అక్రమముగా ధనమును తీసుకొనియుండవచ్చును. ఒకసారి ఆ ఈల మ్రోగినట్లయితే, ఆ సమయములో నీవు ప్రభువు కొరకు ఏది చేసినను అది లెక్కించబడదు. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, "మొదట ఆ తప్పును సరిచేసుకొనుము. నీ భార్య దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పుము. మొదట నీ భార్యకు క్షమాపణ చెప్పి, సువార్తపని చేయుము, లేనట్లయితే నీవు చేసే పరిచర్య లెక్కలోనికి రాదు".
క్రీస్తుయొక్క సమాధానము మీకు మధ్యవర్తి(రిఫరీ)గా ఉండనీయండి. ఈ మధ్యవర్తిని మీరు అనుసరించినయెడల, మీరు తప్పిపోరు. ఈ మధ్యవర్తికి విధేయత చూపుటకు మీరు ఎంత సమయము తీసుకుంటారు? మధ్యవర్తితో వివాదం పెట్టుకునే పుట్బాల్ ఆటను ఎప్పుడైనా చూశారా? అయితే మధ్యవర్తియే ఎల్లప్పుడు గెలుస్తాడు. ఎల్లప్పుడు మధ్యవర్తి మాట ప్రకారమే జరుగుతుంది. ఎక్కువగా వివాదం పెట్టుకుంటే కొన్నిసార్లు ఆటగాళ్ళను బయటికి పంపి వేస్తారు. కాబట్టి మధ్యవర్తితో ఎక్కువ వివాదం పెట్టుకొనవద్దు ఎందుకంటే అతడు నిన్ను బయటికి పంపవచ్చును. ఇలా చెప్పండి "ఓ యేసుప్రభువా! సరే నీవు చెప్పిందే నేను చేస్తాను". సంగతులు సరిచేసుకొని ముందుకు కొనసాగాలి. ఈల మ్రోగిందని నీకు ఎలా తెలుస్తుంది? నీవు సమాధానాన్ని కోల్పోతావు. సమాధానమే మధ్యవర్తి. దేని విషయమైనను నీవు కలవరపడినా లేక బాధపడినను, అదేస్థితిలో నీవు ఒకవేళ సంఘకూటానికి వచ్చినట్లయితే నీవు నోరు తెరువకూడదు. తొందరపాటులో మాట్లాడితే కలవరము వస్తుంది. కాబట్టి నీవు కలవరంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. మీ ఇంటిలో కూడా, దేని విషయమైనా నీవు కలవరములో ఉన్నట్లయితే, నీ నోరు మూసుకొని ప్రార్ధించుట ద్వారా నీ భార్యను ఆశీర్వాదించగలవు. నీవు తొందరపడినప్పుడు ఈల మ్రోగుతుంది. దానిని సరి చేసుకొనుము. నీ హృదయము కలువరపడిన ప్రతిసారి ఏదొక తప్పు జరిగిందని భావించాలి. క్రీస్తుయొక్క సమాధానము మీరు రిఫరీగా ఉండును గాక ఆమేన్.