ఒక మంచి ఉధ్యానవనమును నాటుటకు ఐదు నియమములను నేను కనుగొంటిని, వాటిని మన వివాహ బాంధవ్యములో భార్య మరియు భర్తల మధ్య అన్వయించుకొనవచ్చును.
1. వ్యాధులను తట్టుకొనే విత్తనములు ఉపయోగించుడి
వ్యాధులను అదుపుచేయుటకు మంచి పద్ధతి అది రాకుండా చూచుకొనుట. మనము మన నాలుకతో విత్తనములు నాటుదుము. మీరు ఒకరితో ఒకరు మాటలాడుకొనినప్పుడు మీ మాటల ద్వారా వ్యాధులు వ్యాపించకుండా చూచుకొనుడి. మీరు మాటలాడునప్పుడు వ్యాధులను తట్టుకొనే మాటలనే మాటలాడుడి. కొన్ని వ్యాధులనుండి మొక్కలను కాపాడుటకు తరచు పురుగుల మందులు జల్లుచుండవలెను. మీ ఉధ్యానవనములో కలుపు మొక్కలు లేకుండా ఉండవలెనంటే మీ నాలుక గూర్చి జాగ్రత్త వహించు విషయములో మీరు నిర్దాక్షిణ్యముగా ఉండవలయును. మీ ఉధ్యానవనములో మీరు ఎప్పుడూ కలుపుమొక్కలు ఎదుగుటకు మీరు అవకాశమివ్వరని నేను ఆశిస్తున్నాను.
2. నేలను ఎరువులతో బలపర్చవలెను
మీకు సంతోషకరమైన వివాహజీవితము ఉండవలెనంటె ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి మరియు మెచ్చుకొనుచుండుడి. నేలలోనికి ఇటువంటి ఎఱువులను వేయుచుండుడి. అప్పుడు మీకు నిజముగా మంచి పంటవచ్చును.
3. బాగుపడని వ్యాధులుండిన మొక్కలు ఏమైనా ఉండినట్లయితే వాటిని నాశనము చేయుడి
ఇది అదుపు చేయలేని మరియు వ్యసనముగా మారిన కార్యక్రమములు అనగా టి.వీ. కి అతుక్కొని పోవుట వంటి వాటి గూర్చి చెప్పుచున్నది. నాశనము చేయుడి, నేననేది టి.వీ. ని కాదు, కాని దాని ముందు కూర్చుని వ్యర్ధపరచే సమయమును. అటువంటి వాటిని ఈ నియమము అదుపు చేయలేని వ్యాధి గూర్చి చెప్పుచున్నది. నీవు వాటిని అదుపు చేయగల్గినట్లయితే అది మంచిది మరియు ప్రాముఖ్యమైన విషయము. కాని అటువంటి వ్యాపకములను అదుపుచేయుట మంచిది.
4. వ్యాధి కలిగియున్న ఆకులను నీవు గమనించిన వెంటనే కత్తిరించివేయుము
దీని అర్ధము నీకు ఎదుటివ్యక్తిని బాధించినట్లు నీవు గ్రహించగానే అది ఒక వ్యాధి కలిగియుండిన ఆకు - దానిని వెంటనే కత్తిరించి వేయుము. క్షమాపణ వెంటనే అడుగుము. మరియు వెంటనే క్షమించుము. అప్పుడు ఆ ఆకు కత్తిరించ బడునట్లగును. లేకపోయినట్లయితే ఆ సమస్య తీవ్రమగును. ఇంకొక విషయము : ఆ వ్యాధి కలిగిన ఆకును పారవేయుము. గతమును జ్ఞాపకముంచుకొనవద్దు.
5. నీవు సరిగా సంరక్షింపగల వాటికంటె ఎక్కువ నాటవద్దు
పూర్తిగా మొక్కలతో నింపివేయవద్దు. ఎక్కువగా నాటినట్లయితే మంచిగాలి ప్రసరణను ఆటంకపరచును మరియు కావలసిన సూర్యరశ్మి తగులకుండా ఆటంకపరచును. దాని అర్ధము నీవు రోజుకుండిన 24 గంటలలో అనేకమైన పనులు చేయుటకు ప్రయత్నించకూడదు. అట్లు చేసినట్లయితే మీ వివాహ ఉద్యానవనము నిర్లక్ష్యము చేయబడును. మరియు మీ కుటుంబము మీ ప్రాధాన్యతలలో ఆఖరిదగును. ఉధ్యానవనమనబడే ‘మీ కుటుంబము’ మీకు మొదటి ముఖ్యమైన విషయముగా ఉండవలెను. ఎక్కువ మొక్కలు నాటబడి ఉండుట తగినంత సూర్యరశ్మి (దేవుని వెలుగు) తగలకుండా మరియు మంచిగాలి ప్రసరణలేకుండా (మీ ఇరువురి మధ్య మంచి సహవాసము) ఆటంకపరచును.
లోకమంతట ఉన్న ఉధ్యానవనముల కోసం దేవుడే ఏర్పాటు చేసిన చట్టములు ఇవి. కనుక మీ కుటుంబము మీకు మొదటి ప్రాధాన్యతగా ఉంచుకొనుడి.