ఎజ్రా మరియు నెహెమ్యా అను దైవజనులద్వారా దేవుడు ఇశ్రాయేలీయులలోనికి తెచ్చిన గొప్ప ఉజ్జీవాన్ని గురించి నెహెమ్యా గ్రంథము చూపుచున్నది.
నెహెమ్యా 8వ అధ్యాయములో ఎజ్రా ద్వారా దేవుడు ఏమి చేశాడో చదువుతాము. అతడు దేవునివాక్యమును తీసుకొని గ్రహించగల వయస్సు వచ్చిన స్త్రీలను, పురుషులను, పిల్లలను సమకూర్చాడు. అప్పుడు 6గం||లు బైబిలు నుండి మాట్లాడాడు. "వారందరు ఎంతో శ్రద్ధతో విన్నారని" (నెహెమ్యా 8 : 3)లో చెప్పబడింది. వారు మొదటగా దేవుని స్తుతించి కూటమును ఆరంభించారు (నెహెమ్యా 8 : 4). అప్పుడు ఎజ్రా దేవునిగ్రంథము స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు అర్ధము చెప్పాడు (నెహెమ్యా 8 : 8). నిజానికి ఎజ్రా వారందరికి గ్రంథమును వినిపించి స్పష్టముగా వివరించుటకు తాను స్వయముగా అనేక నెలలు మరియు సం||లు వాక్యమును బాగుగా ధ్యానించాడు. ఈ సయమము కొరకు దేవుడు అతనిని రహస్యముగా సిద్ధపరచాడు.
అప్పుడు ఉజ్జీవము వచ్చి, ప్రజలు వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాప పడసాగిరి (నెహెమ్యా 8 : 9). తరువాత దేవుడు వారికి చేసిన మేలులను ఇతరులతో పంచుకొనునట్లు ప్రోత్సహించబడిరి. ఆ విధముగా, "యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు"(నెహెమ్యా 8 : 10). వారి వినిన హెచ్చిరికకు లోబడ్డారు. రెండవదినమందు జనులందరి పెద్దలతో ఎజ్రా వాక్యమును వివరించాడు (నెహమ్యా 8 : 13). ప్రతి సం||ము ఏడవనెలలో పర్ణశాలల పండుగ ఆచరించాలని వారు వాక్యములో చూచినప్పుడు, వెంటనే వారు ఆ పండుగ చేశారు. యెహోషువా కాలమునుండి వారు ఈ ఆజ్ఞకు లోబడలేదు కాని 900 సం||ల తరువాత మొదటిసారి వారు పండుగ చేశారు (నెహెమ్యా 8 : 14 - 17). దేవుని హృదయానుసారుడైన దావీదు కూడా ఇశ్రాయేలీయులు ఈ ఆజ్ఞకు విధేయత చూపేటట్లు చేయలేదు. ఏడు దినముల వరకు ఎజ్రా వారికి బైబిలు చదివి వినించుచూ వచ్చాడు (నెహెమ్యా 8 : 18).
నెహెమ్యా 9వ అధ్యాయములో నెహెమ్యా ద్వారా దేవుడు ఏమి చేశాడో మనము చదువుతాము. వారు ఉపవాసము ఉంటూ, వారి పాపములను ఒప్పుకొంటూ మరియు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడ్డారు (నెహెమ్యా 9 : 1, 2). అప్పుడు వారు 3గం||లు వాక్యమును విని మరియు 3గం||లు దేవుని స్తుతించుచు, వారి పాపములను ఒప్పుకొంటూ ఉన్నారు. మరలా ఉజ్జీవము వచ్చింది (నెహెమ్యా 9 : 3). అప్పుడు లేవీయులు నిలువబడి, యెలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టారు (నెహెమ్యా 9 : 4). నెహెమ్యా 9 : 6 నుండి నెహెమ్యా 9 : 31 వరకు బైబిలంతటిలో పెద్ద ప్రార్ధన ఉన్నది. అప్పుడు లేవీయులు అబ్రాహాము దగ్గర నుండి ఇశ్రాయేలీయుల చరిత్రను, అరణ్యములో 40 సం||లలోను మరియు న్యాయాధిపతుల, రాజుల కాలములో వారి యొక్క ఓటములను మరియు దేవునియొక్క నీతివాక్యములతో నిండిన తీర్పులను గూర్చి వివరించారు. వారు మారుమనస్సుపొంది, ఒప్పుకొనిన దానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని, నెహెమ్యా మొదట సంతకము చేయగా ఆ నిబంధనను వ్రాయించుకొన్నారు (నెహెమ్యా 10 : 1).
ఇదంతయు ఎజ్రా మరియు నెహెమ్యా అనే దైవభక్తి గలవారి వలన జరిగింది. వారి పరిచర్య క్రొత్త నిబంధన వలే ఇద్దరు కలసి చేసారు. ఈనాడు మనకు అది ఎంతమాదరిగా ఉన్నది.