వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
WFTW Body: 

దేవుడు సంఘస్థులలోను, సంఘస్థులతోను ఉండుటయే క్రొత్తనిబంధన సంఘముయొక్క గుర్తు. సంఘకూటములో ప్రవచనాత్మ ద్వారా బలముగా మాట్లాడినప్పుడు "ఆ కూటానికి వచ్చినవారు పాపులమని గ్రహించి, దేవుడు నిజముగా మీలో ఉన్నాడని" ప్రచురము చేస్తారు (1 కొరింథీ 14:24,25). ఎమ్మాయి మార్గములో ప్రభువైనయేసు తన శిష్యులతో మాట్లాడినప్పుడు వారి హృదయములు మండినట్లు వీరి హృదయములు కూడా మండును (లూకా 24:32).

దేవుడు దహించు అగ్నియైయున్నాడు. పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, పొదమండుచున్నప్పుడు ఆ పొదలో పురుగులన్నియు దహించివేయబడ్డాయి. అలాగే ఈనాడు కూడా దేవుని సన్నిధిలో పాపములన్నియు బహిర్గతమగును. అటువంటి సంఘమే క్రొత్తనిబంధన సంఘము. ప్రభువైనయేసు యొక్క నేత్రములు అగ్నిజ్వాలలవలె ఉండెను (ప్రకటన 1:14). తాను కట్టే సంఘములో ఉన్న పాపమును, మానవ ఆచారములను మరియు పరిసయతత్వమును ఆయన బహిర్గతం చేస్తారు.

ఆత్మవిషయమై దీనులమై ఉండుటయే పరలోకరాజ్యానికి తాళంచెవి(మత్తయి 5:3). అత్మ విషయమై దీనులమై యుండకుండా క్రొత్తనిబంధన సంఘమును కట్టలేము. తండ్రివలె పరిపూర్ణులమై యుండాలనే కోరిక మనలో ఉన్నట్లయితే, మనకు దేవుడు ఎంత అవసరమో ఎల్లప్పుడు ఎరిగియుండుటయే ఆత్మ విషయమై దీనులమైయుండుట. "విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు" (కీర్తన 34:18). ఆయన మనతో ఉన్నప్పుడు, పరలోకాన్ని మన హృదయాలలోనికి తెచ్చి మరియు మన ద్వారా ఇతరులలోనికి విస్తరింపజేస్తాడు.

క్రొత్తనిబంధన సంఘములో అనేకులు దేవునివాక్యము విని, అభ్యంతరపడి సంఘాన్ని విడిచి వెళ్ళతారు. "కడమ వారిలో ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు"(అపొ. కా. 5:13) అని యెరూషలేము సంఘము గూర్చి చెప్పబడింది.

సంఘములో ప్రభువైనయేసు సన్నిధి బహుబలముగా ఉన్నప్పుడు, శిష్యులు ఆయన మహిమను అనుభవించి తరించిపోయారు. ప్రభువైనయేసు మహిమను చూచియున్నామనుటకు రుజువేమిటనగా భూసంబంధమైన విషయాల(అనగా సౌఖ్యము, ఘనత మరియు సిరి) మీద మనకున్న కోరిక తగ్గిపోతూ ఉంటుంది.

క్రొత్తనిబంధన సంఘములో బలమైనబోధ మాత్రమేగాక, వాక్యాన్నే జీవించేవారు ఉంటారు. క్రొత్త సిద్ధాంతము కాదుగాని పరిశుద్ధస్వభావాన్ని పొందుకుంటూ పరిశుద్ధులుగా జీవించుట ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలము. క్రొత్తనిబంధన సేవకులు వారి బోధవినుటకు మాత్రమేగాక వారి మాదిరిని వెంబడించుటకు కూడా ఇతరులను ఆహ్వానిస్తారు(1 కొరింథీ 11:1). మన మాదిరి సరిగా లేనప్పుడు పశ్చాత్తాపపడాలి. అభిషేకంలేని, జీవంలేని ప్రసంగాలు చేసినందున మనం సిగ్గుపడాలి. ప్రభువైనయేసును వెంబడిస్తూ, పరిసయ్యులుగా మారుట అసాధ్యము. ప్రజలను ఆత్మీయముగా పెంచి, పోషించుటకు అవసరమైన జీవముతో నిండిన వాక్యము మనలో లేకుండా, కేవలము కలలు, దర్శనములు కలిగియుంటే మనం ప్రభువైనయేసుకు ఎంతో దూరమున ఉన్నాము. మనం ప్రభువుయొక్క జీవంతో నింపబడి మండుచున్న యెడల, ఇతరులకు విసుగు పుట్టించము. "ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగునట్లు ప్రభువైనయేసు ఆదియైయుండి మృతులలో నుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను" (కొలస్సీ 1:18). ఈ కోరిక గలవారిని దేవుడు పూర్తిగా బలపరుస్తాడు. అనగా మన స్వంతప్రణాళికను విడిచిపెట్టి, మనమేమి చెయ్యాలో, మన డబ్బును, సమయాన్ని ఎలా ఖర్చుపెట్టాలో ప్రభువునే చెప్పనివ్వాలి. నీ జీవితంలో ఇదే నీకోరికైనట్లయితే, మీ ప్రదేశములో క్రొత్తనిబంధన సంఘాన్ని కట్టుటకు దేవుడు నిన్ను వాడుకుంటాడు.

కేవలము ప్రభువు నామములో కలుసుకున్నంత మాత్రాన ప్రభువైనయేసు వారితో ఉన్నారని కొందరు చెప్పుచున్నారు (మత్తయి 18:20). కాని వారిని వారు మోసము చేసుకుంటున్నారు. ప్రభువు వారిలో ఉన్నట్లయితే వారి కూటాలెందుకు విసుకుపుట్టిచ్చేవిగా ఉంటున్నాయి. వారెందుకు రూపాంతరము పొందుటలేదు? ఒక దైవజనునితో కొంచెంసేపు గడిపిన యెడల, మన జీవితాలలోనే మార్పు వచ్చునట్లు ప్రభావితం చేయబడతాము. ప్రభువైనయేసుతోనే కొంచెం సమయం గడిపినట్లయితే, ఇంకెంత ప్రభావితం చేయబడతాము. సంఘకూటాల ద్వారా ప్రభువైనయేసు సారూప్యములోనికి మనం రూపాంతరము పొందనట్లయితే, కూటాలలో ప్రభువు సన్నిధిలేనట్లే అనగా అప్పుడు మనం క్రొత్తనిబంధన సంఘము కాదు.