వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు
WFTW Body: 

"అతని పక్షమున శూరులు లేచి, పరిశుద్ధస్థలపు కోటను అపవిత్రపరచి, అనుదిన బలి నిలిపివేసి, నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపుమాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్నివలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును, అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలమువరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు"(దానియేలు 11:31-35).

క్రీస్తువిరోధి యొక్క ఆత్మ సంఘములో కూడా ఉండవచ్చును(1 యోహాను 2:18,19). కాబట్టి పై వచనములలో అంత్యదినములలో సంఘము కొరకు హెచ్చరికను చూచుచున్నాము.

క్రీస్తువిరోధి యొక్క ఆత్మ "పరిశుద్ధస్థలమును అపవిత్రపరచుటకు" ప్రయత్నించును(దానియేలు 11:31). పరిశుద్ధత మరియు నీతిని గూర్చిన వర్తమానమును సాతాను ఎంతో వ్యతిరేకిస్తాడు. "నిబంధనను అతిక్రమించునట్లుగా" క్రీస్తువిరోధి యొక్క ఆత్మ ప్రోత్సహించును (దానియేలు 11:32).పాపము మీద జయము పొందగలమని క్రొత్తనిబంధన వాగ్దానము చేసియున్నది. కాని అటువంటి జయజీవితము అసాధ్యమని విశ్వాసులకు క్రీస్తువిరోధి చెప్పును.

మనము దేవునియొక్క పరిశుద్ధత మరియు నీతిని గూర్చి బోధించియున్నాము. కాబట్టి గత రెండు దశాబ్దములనుండి సంఘముగా మన పరిచర్య వ్యతిరేకించబడింది. "పాపము మనమీద ప్రభుత్వము చెయ్యనవసరము లేదనియు" (రోమా 6:14), "సిరిని ప్రేమించువారు దేవునిని ప్రేమింపలేరనియు" (లూకా 16:13), ఇతరుల మీద కోపపడి మరియు వారిని తృణీకరించినట్లయితే నరకానికి వెళ్ళే అవకాశము ఉందనియు (మత్తయి 5:22), "స్త్రీని మోహపు చూపు చూచే అలవాటు కలిగినవాడు నరకానికి వెళ్ళే అపాయములో ఉన్నాడనియు"(మత్తయి 5:28,29), మొదలైనవి మనము ప్రకటించాము. ప్రభువైనయేసు యొక్క ఈ మాటలు అనేకమంది విశ్వాసులు అంగీకరించక, వ్యతిరేకించారు.

క్రైస్తవసేవకులు జీతము తీసుకొనుట అనే వాక్యానుసారము కాని పద్ధతిని (మొదటి శతాబ్దములో ఆ పదమే వాడబడ లేదు) మరియు ఇండియాలో జరిగే క్రైస్తవపరిచర్య కొరకు డబ్బులు బిక్షమడుగుకొనే పద్దతిని మనము వ్యతిరేకించాము. బోధించుటనే వృత్తిగా చేసుకొని జీవించి మరియు ఆస్తులను సమకూర్చుకొన్నవారి నుండి తీవ్రమైన వ్యతిరేకత మనకు వచ్చింది.

ఒక వ్యక్తికి ప్రాముఖ్యతనిచ్చే సంఘవ్యవస్థను, పోపువ్యవస్థను, డినామినేషన్‍వ్యవస్థను, ఇండియాలోని స్థానిక సంఘములలో పాశ్చాత్యదేశముల యొక్క అధికారము, ఇక్కడ స్థానికసంఘము ప్రభువులో వృద్ధిపొందకుండా అభ్యంతరపరచే పాశ్చాత్య నాయకత్వమును మనము వ్యతిరేకించాము. ఇది కొందరికి కోపాన్ని తెప్పించింది. దేవుని పరిశుద్ధ స్థలమును ఏదొకరీతిగా అపవిత్రపరచుటయే సాతానుయొక్క లక్ష్యము. సంఘములోపల(సంఘస్థులలో) జరిగే దేవుని కార్యమును నాశనము చేయుటకు సాతాను తన "శూరులను"(దూతలను) సంఘములో పెట్టును(దానియేలు 11:31). గత 20 శతాబ్దములలో క్రైస్తవ్యంలోని అనేక సంఘములు, ఆయా పరిచర్యలు, సాతాను యొక్క శూరులు అపవిత్రపరచారు.

సంఘము ఓడిపోవుటకు ముఖ్యకారణము, దేవుడు నియమించిన సంఘకాపరి మెలకువగా ఉండకపోవడటం మరియు జాగ్రత్తగా ఉండకపోవటం. సాతాను ఈ కాపరులను ఏవిధముగా నిద్రపోయేటట్లు చేశాడు? కొందరి విషయములో ధనవంతులు మరియు పలుకుబడి గలిగినవారు అభ్యంతరపడుదురేమోనని పూర్తి సత్యము చెప్పకుండునట్లు వారిని భయపెట్టుట ద్వారా జరిగింది. మరికొందరి విషయములో వారి భార్యలను సంతోషపెట్టు వారిగా చేయుట ద్వారాను, ధనాపేక్షగలవారుగాను మరియు మంచి ఆహారమును ప్రేమించేవారుగా చేయుటద్వారా జరిగింది. కొందరి విషయములో, దేవుని ప్రమాణాలను సంఘములో కొనసాగింపలేక నిరాశపడుట ద్వారా జరిగింది. కాబట్టి ప్రజలను సంతోషపెట్టేవారిగా వారు మారి, ప్రసంగాలను మార్చియున్నారు.

మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి పరిపూర్ణము చేయువాడైన యేసునే తలంచుకొనమని, హెబ్రీ 12:3లో చెప్పబడింది. "మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి". ప్రభువైనయేసును తిరస్కరించిన ఈ పాపాత్ములు ఎవరు? ఇశ్రాయేలులో ఉన్న వ్యభిచారులు, హంతకులు లేక దొంగలు కాదు. రోమీయులు గాని లేక గ్రీసు దేశస్థులుగాని కాదు. ఇశ్రాయేలులో ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు, బైబిలును గూర్చి బోధించేవారు మరియు మతనాయకులే ప్రభువైనయేసును ఎల్లప్పుడు తిరస్కరించారు. వారు ప్రభువు మీద అసూయపడి, చివరకు ఆయనను చంపియున్నారు. ఈనాడు కూడా మనము ప్రభువైనయేసును వెంబడించినట్లయితే ఇటువంటి వారే మనలను తిరస్కరిస్తారు. దేవుని ప్రమాణాలను తగ్గించి, బోధించి మరియు సంఘమును అపవిత్రపరిచినవారే మనలను ఎక్కువగా తిరస్కరిస్తారు. వీరే మనలను తిరస్కరించుటకు పనిచేసే సాతాను దూతలు. ఎల్లప్పుడు ఈ తిరస్కారమును పొందుటవలన, మనము నిరాశపడుట చాలా సులభము.

సాతాను "మహోన్నతుని భక్తులను నలుగగొట్టుటకు" ప్రయత్నిస్తాడు(దానియేలు 7:25). తన శత్రువులచేత చంపబడువరకు ఎల్లప్పుడు తిరస్కారాన్ని వ్యతిరేకతను ఓర్చుకొనిన ప్రభువైనయేసును చూచుట ద్వారానే మనము జయించగలము. మనము కూడా "మరణము వరకు నమ్మకముగా ఉండుటకు" ఇష్టపడాలి. ఇటువంటి తిరస్కారాన్ని ఎదుర్కొనుటకు ఇష్టపడని ఏ బోధకుడైనను చివరకు "ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించువారిని వశపరచుకొనును"(దానియేలు 11:32). చివరకు అతడు బిలాము వలె రాజీపడతాడు.

మన స్థానిక సంఘములో దేవుని ప్రమాణాలను కాపాడుటకు మనము పిలువబడ్డాము. క్రీస్తువిరోధి విషయములో మనమెల్లప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసు సంఘములో తానున్న మూడు సం||లు దేవుని కృపద్వారా పౌలు సంఘమును భద్రపరచియున్నాడు. కాని అక్కడ నుండి వేళ్ళేముందుగా, అక్కడ పెద్దలతో తాను వెళ్ళిన తరువాత క్రూరమైన తోడేళ్ళు వచ్చెదరని చెప్పాడు(అపొ.కా. 20:29-31). తరువాత ఆ సంఘములో పౌలు చెప్పిన విధముగానే జరిగింది(ప్రకటన 2:1-5).