వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   అన్వేషకుడు
WFTW Body: 

దేవుడు ఆదాము హవ్వలను ఏదెను తోటలోనికి పంపినప్పుడు, ఆయన వారికి ఎంతో స్వేచ్ఛను యిచ్చినా, ఆయన ఒక విషయములో ఆటంకము కలుగజేసెను. ఒక చెట్టునుండి తినకూడదని నిషేధించెను. దానికి ఒక కారణము ఉన్నది. ఎంచుకొనకుండా ఎవరూ దేవుని కుమారునిగా కాలేరు. వ్యక్తిగతముగా ఎంపిక చేసికొనకుండా ఎవరూ పరిశుద్ధులుగా కాలేరు. కనుక దేవుడు ఆదామును ఏదెను తోటలోనికి పంపినప్పుడు, ఆదాముకు ఎంచుకొను అవకాశమును యివ్వకపోయి యుండినట్లయితే, ఆదాము దేవుడు ఉద్దేశించిన కుమారుడుగా ఎప్పటికీ కాలేడు. మనము ఎంచుకొనే ఎంపికలు, మన నిత్యత్వమునకు మరియు ఈ భూమిపై జీవితమునకు ఎంత ప్రాముఖ్యమైనవో మనము గ్రహించము.

దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతులలో ఒకటి ఎంచుకొనే శక్తి. ఆయన ఆ శక్తిని ఎప్పుడూ ఎవరియొద్ద నుండి తీసివేయడు. నీవు దేవుని కుమారునిగా ఉండుటను ఎంపిక చేసికొనవచ్చును లేక నీ కొరకు నీవు జీవించుటకు ఎంపిక చేసికొనవచ్చును. అయితే నీవు ఏది ఎంచుకొనినా, నీ జీవితపు చివరన, నీవు ఎంచుకొనిన దానికి పర్యవసానములను నీవు కోయవలసియున్నది.

"మనుష్యుడు ఏమి విత్తునో, దానిని కోయును" అని బైబిలు చెప్పుచున్నది. మనుష్యులు ఒకసారే మృతిపొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును" అని కూడా వ్రాయబడెను. అయితే దేవుడు ఆ చివరి దినాన మనుష్యులను ఏ కారణము లేకుండా తీర్పు తీర్చడు. ప్రతి మానవుడు చేసికొనిన ఎంపికలను బట్టి ఆయన తీర్పులుండును.

ఈ నియమము వివాహముల విషయములో కూడా యుండును. నీకు సంతోషకరమైన వివాహజీవితము కావలయునా లేక దౌర్భాగ్యమైనది కావలయునా? అది ఎంచుకొనాల్సినది నీవు, దేవుడు కాదు. ఆదాము తన జీవితమును సాతానుకు లోబరుచుకొనవలెనా లేక దేవునికా అనేది ఎంచుకొనవలసియుండెను.

మొట్టమొదటిగా మీ జీవితములో అన్ని విషయములలో దేవునిలో (దేవుడే సర్వమై) కేంద్రముగా నుండుటకు ఎంచుకొనండి.

ఏదెను వనములో రెండు వృక్షములుండెను, అవి రెండు విధములైన జీవిత విధానములకు ప్రతినిధులుగా నుండెను. జీవవృక్షము, మానవుడు తీసుకొను ప్రతి నిర్ణయము దేవుడు కేంద్రముగా నుండి దేవుడే సర్వములో సర్వముగా నుండిన జీవితమునకు సూచనార్ధముగా యున్నది. మరియొక ప్రక్క మంచిచెడుల వివేకము నిచ్చు వృక్షము, స్వార్ధపూరిత జీవితమునకు సూచనార్ధముగాయున్నది; అక్కడ మానవుడు దేవునితో సంప్రదించకుండా ఏది మంచి ఏది చెడు అనేది తనకు తానే నిశ్చయించుకొనునట్లుగా ఉండును. దేవుడు ఆదాము హవ్వలను ఆ తోటలోనికి పంపి వారితో, " ఈ రెండు మార్గములలో ఏ మార్గమున మీరు జీవించుటకు కోరుకొందురు" అని చెప్పినట్లుగా యున్నది. ఆదాము దేనిని ఎంచుకొనెనో మనందరకు తెలియును. అతడు తనకు తానే కేంద్రముగా నుండిన జీవితము జీవించుటకు కోరుకొనెను.

లోకములో మన చుట్టూ మనము చూచే దౌర్భాగ్య స్థితి, విచారము, నరహత్యలు మరియు ప్రతివిధమైన యితర ఘోరమైన పరిస్థితులు మానవుడు తనకు తానుగా ఏది మంచి మరియు చెడు అనేది ఎంచుకొను నిర్ణయము తీసుకొనుట వలన వచ్చియున్నది. దేవుడు తనకు చెప్పుటను అతడు యిష్టపడలేదు. ప్రతి సంతోషములేని వివాహమునకు చివరకు క్రైస్తవులలో కూడా కారణమదే. ఎంతో మంది క్రైస్తవులు వారి కొరకే వారు జీవించుచున్నారు మరియు వారు విత్తిన దానిని వారు కోయుచున్నారు.

దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతడు భూమిని ఏలవలెనని ఉద్దేశించెను. ఆదాము రాజుగా ఉండుటకు సృష్టించబడెను. అంతేకాని దాసునిగా ఉండుటకు కాదు. మరియు హవ్వ ఆదాము ప్రక్కన రాణిగా యుండుటకు దేవుడు ఉద్దేశించెను. కాని ఈనాడు ఏమి చూచుచున్నాము? స్త్రీ పురుషులు ప్రతిచోట బానిసలుగా ఉంటున్నారు, వారి కోరికలకు మరియు ఈ భూమిపై నుండిన నాశనమగు వాటికి వారు బానిసలుగా ఉంటున్నారు.

దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు ప్రతిది అందముగా సృష్టించాడు. నిషేధించబడిన చెట్టు కూడా అందముగా ఉండేది. ఆదాము హవ్వలు ఆ చెట్టు ముందు నిలుచున్నప్పుడు వారు ఒక ఎంపిక చేసుకొనవలసి వచ్చినది. వారు దేవుడు చేసిన అందమైన వాటిని ఎంచుకొనవలెననా లేక దేవునినే ఎంచుకొనవలెననా అనునది?

మనమందరము ప్రతిదినము తీసుకొనవలసిన నిర్ణయము అది. మన జీవితము మనలోనే కేంద్రముగా ఉండినట్లయితే, మనము దేవునిని కాక, దేవునియొక్క వరములు (ఆయన సృష్టించిన వాటిని) గూర్చి వెదుకులాడుదుము. గృహములలో వచ్చు ఎక్కువ గొడవలు దేవునికి బదులుగా సృష్టించబడిన వాటిని భార్యభర్తలు ఎంచుకొనుట వలన వచ్చును, వారియొక్క ఎంపికకు తగిన పర్యవసానములను వారు కోయుదురు. వారు శరీరానుసారమైన దానిని విత్తినందున వారు భ్రష్టత్వమును కోయుదురు. మానవుడు తన సృష్టికర్త(జీవవృక్షము)ను కాక సృష్టింపబడిన వాటిని కోరుకొనుట చేత అతడు బానిసగా మారెను.

ఈ బానిసత్వము నుండి మనలను విడుదల చేయుటకు యేసుప్రభువు వచ్చెను. మానవుడు ఈనాడు ధనము యొక్క శక్తికి, అనైతిక లైంగిక సంతోషమునకు, ఇతరులయొక్క అభిప్రాయములకు మరియు అనేకమైన ఇతర విషయములకు బానిసయ్యెను. అతడు స్వేచ్ఛగా లేడు. దేవుడు అతడిని పక్షిరాజు వలె ఆకాశమందు ఎత్తుగా ఎగురునట్లు సృష్టించెను. కాని మానవుడు తన కోపమును అదుపు చేయలేక, తన నాలుకను అదుపుచేయలేక, తన మొహపు చూపులు అదుపు చేయకలేక గొలుసులతో బంధింపబడి ఉన్నట్లుగా చూచుదుము. యేసుప్రభువు వచ్చినది కేవలము మన పాపములకొరకు మరణించుటకు మాత్రమే కాదు, మనలను ఈ బానిసత్వము నుండి విడుదల చేయుటకు కూడా వచ్చియుండెను.

దేవుడు వెలుగు మరియు దేవుడు ప్రేమ అని బైబిలు చెప్పుచున్నది. దేవునిప్రేమ ఆయన యొక్క వెలుగైయున్నది. ఒక చీకటి గదిలో వెలుగు యొక్క శక్తి చీకటిని తరిమివేయును. దేవుని యొక్క శక్తి అటువంటిది. దేవుని యొక్క శక్తి లేకుండా, ఆయన ప్రేమ లేకుండా ఉండిన జీవితము కేవలము చీకటి మాత్రమే.

భూమిపై మన జీవితమంతా ప్రతిదీ ప్రేమ చట్టముతో పరిపాలింపబడే నిత్యత్వములో రాజ్యమునకు సిద్ధపరచి పరీక్షించే శిక్షణా కాలమైయున్నది. దేవుడు ఇప్పుడు మనలను తీసుకువెళ్ళే ప్రతి పరిస్థితి మరియు సంఘటనను మనము ప్రేమ చట్టములో జీవించుచున్నామా అనే ఒక్క విషయమును పరీక్షించుట కొరకు ఆయన చేత ఏర్పాటు చేయబడినది. అందువలననే దేవుడు మన జీవితములలో ఎన్నో పరీక్షలను మరియు కష్టములను అనుమతించును. దేవుడు మహోన్నతుడు అందుచేత ఈ భూమిపై మన జీవితము ఏ యిబ్బందులు లేకుండా ఉండేటట్లు చేయగలడు. కాని దేవుడు ఆయన యొక్క గొప్ప జ్ఞానముతో మనము ప్రేమించుటను నేర్చుకొను అవకాశముగా యిబ్బందులను ఏర్పాటు చేసెను. మన స్వార్ధపరత్వమును మనము జయించి మన జీవితమును ప్రేమ మాత్రమే నడిపించునట్లు నిశ్చయించుకొనినట్లయితే, దేవుడు ఆయన యొక్క రాబోవు రాజ్యములో పరిపాలకులుగా ఉండునట్లు మనలను సిద్ధము చేయగలడు. దాని గూర్చి మనమిప్పుడు ఆలోచించవలసియున్నది. లేకపోయినట్లయితే దేవుడు ఈ భూమిపై మనకు యిచ్చిన అవకాశములను పోగొట్టుకొని, మనము నేర్చుకొనవలసిన దానిని ఎప్పటికీ నేర్చుకొనని విషయమును నిత్యత్వములో తెలుసుకొందుము.