WFTW Body: 

ప్రకటన 2:1-5 లో తన మొదటి సంగతుల విషయములో దృష్టికోల్పోయినదని ఎఫేసు సంఘమును ప్రభువు గద్దించెను. ఇతర విషయములలో అది ఎంతో శ్రేష్టమైన సంఘముగా ఉన్నది. అక్కడ ఉన్న క్రైస్తవులు సహనముతో శ్రమించి, దుష్టత్వమును ద్వేషించి, అపోస్తలులుకాకయే తాము అపోస్తలులమని చెప్పుకొనువారిని పరీక్షించి వారు అబద్దికులని కనుగొని ప్రభువునామము నిమిత్తము భారము భరించిరి. వారు హృదయపూర్వకముగా ప్రభువు పనిలో ఉండిరి మరియు వారు ఆ పనిని విడిచిపెట్టునట్లు ఏదియు కూడా చేయలేకపోయెను. అయినను వారికి వ్యతిరేఖముగా ఒకతప్పు ప్రభువునకుండెను. అది వారు ఆయన సాక్షులుగా ఉండే ఉనికిని కూడా కోల్పోయేటంత త్రీవ్రమైనదిగా ఉన్నది.

వారు పడిపోయిరి మరియు వారు మారుమనస్సు పొందని యెడల, వారి సాక్ష్యమును ప్రభువు అంగీకరించియున్నాడనుటకు ఋజువైయున్న ఆయన అభిషేకము(దీపస్తంభము)ను వారియొద్దనుండి తీసివేయునని ప్రభువు వారికి చెప్పెను. వారిలోఉన్న ఇటువంటి తీవ్రమైన కొదువ ఏమిటి? అది ప్రభువుయెడల వారికున్న ప్రేమ చల్లారిపోయినదనునదియే. ఆయనయెడల వారికుండిన మొదటిప్రేమను విడచి మరియు వేరే వాటియందు దృష్టినిలిపిరి. వారు ప్రార్ధన కూటములతో, ఉపవాసప్రార్ధనలతో, సభలతో మరియు ఇతర క్రైస్తవ పరిచర్యలతో ఎల్లప్పుడు పని కలిగియుండి ఎవరినిమిత్తమైతే ఇవన్నియు ఉన్నవో ఆయనను గూర్చిన దృష్టిని(ప్రేమను) కోల్పోయిరి.

మనము చేసే పరిచర్యలన్నిటికంటే ఎక్కువగా మనము హృదయపూర్వకముగా ఆయనను ప్రేమించవలెనని ప్రభువు కోరుచున్నట్లుగా స్పష్టముగా తెలియుచున్నది. ఈ విషయము యెరిగిన సాతాను, మనము ఎల్లప్పుడు ఏదో ఒక క్రైస్తవపరిచర్యలో పనికలిగియుండి, ప్రభువుతో వ్యక్తిగతముగా సమయము గడపకుండా చేసి మరియు మనము పడిపోవునట్లుచేయును.

కడవరి దినములలో అక్రమము (పాపము) విస్తరించుటచేత ఆయన యెడల అనేకులకున్న ప్రేమ చల్లారునని ప్రభువు హెచ్చరించుచున్నాడు (మత్తయి 24:12). ఇప్పుడు మనము అటువంటి దినములలో జీవించుచున్నాము. కేవలము నామకార్ధముగా ప్రభువును వెంబడించే అనేకుల ఆత్మీయస్థితి (వెచ్చదనము) గడ్డ కట్టేటంత చల్లదనముకన్నా తక్కువగా ఉన్నది.

మన గురించి మనము జాగ్రత్తపడని యెడల అటువంటి ఆత్మీయ(చల్లని)స్థితి మనలోనికి కూడా చొచ్చుకొని వచ్చును. నాప్రియమైన సహోదర సహోదరిలారా ఒకవేళ మీరు సమస్తమును పోగొట్టుకున్నప్పటికీ, ప్రభువుయెడల మీకున్న ప్రేమను మాత్రము పోగొట్టుకొనవద్దు.