“మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధకలిగినవారైయుండుడి” (ఎఫెసీ 4:1,2).
పౌలు పత్రికలలో మనము ఏకమై ఐక్యత కలిగియుండాలని ఎక్కువగా చెప్పాడు. ఆయన సంఘము విషయంలో కూడా ప్రభువు ఆ భారాన్ని కలిగియున్నాడు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని శరీరము విడిపోయి, కుళ్ళిపోతుంది. మన శరీరము దుమ్ముతో చేయబడింది మరియు మన శరీరములో ఉన్న జీవముచేత దుమ్ము(మట్టి) పదార్ధములన్నిటిని కలిపి ఏకముగా చేయబడుతుంది. ప్రాణం పోయినప్పుడు శరీరమంతయు విడిపోతుంది మరియు తరువాత కొంతకాలానికి అది మరల దుమ్ముగా మారిపోతుంది. అలాగే విశ్వాసుల సహవాసములో కూడా ఉంటుంది. స్థానిక సంఘములో సహోదరులమధ్య ఐక్యతలేనప్పుడు, నిశ్చయంగా ఆసంఘములోనికి మరణం వచ్చిందని చెప్పవచ్చును. భార్య భర్తల మధ్య ఐక్యత లేనప్పుడు, వారు విడాకులు తీసుకొనకపోయునప్పటికీ మరణం ప్రవేశించినట్లవుతుంది. వివాహమైన మరుసటిరోజునుండే అపార్ధములద్వారా ఉద్రేకములద్వారా పోట్లాటలద్వారా విడిపోవుట ఆరంభమవ్వవచ్చును.
సంఘములోకూడా ఆవిధంగా జరుగవచ్చును. ప్రభువు దేహముగా సంఘము పవిత్రముగా కట్టబడాలనే ఆసక్తి కలిగిన ఇద్దరు లేక ముగ్గురు సహోదరులతో సంఘ నిర్మాణము ఆరంభమవ్వవచ్చును. ఐక్యత లేకపోవుటవలన త్వరలోనే అక్కడ మరణం రావచ్చును. వివాహములోను మరియు సంఘములోను పరిశుద్ధాత్ముడు మనలో కలిగించే ఐక్యతను కాపాడుకొనుటకు పోరాడాలి.
అనేక చిన్న చిన్న అణువులతో చేయబడిన మానవశరీరంలో ఉన్న అద్బుతమైన సంగతి ఏదనగా, మనం చూడలేనంతగా అవన్నియు ఏకమైయుండును. ఒక గాయం అయినప్పుడు, అది చర్మముతో కప్పబడునట్లు అక్కడ పని ప్రారంభము అవుతుంది. శరీరంమీద ఎక్కడైనను గాయంకాని లేక సందులుండుటకుగాని అది ఇష్టపడదు. విడిపోయిన భాగాన్ని వెంటనే ఐక్యపరచుటకు పని మొదలవుతుంది. ఏ మనుష్యుడు కూడా రెండు ఎముకలను ఏకంగా చేయలేడు. విరిగిపోయున రెండు ఎముకలను ఒక డాక్టరు ప్రక్కప్రక్కనే ఉంచగలడు. శరీరమే ఆ విధంగా వాటిని కలిపి, ఏకం చేస్తుంది. మానవశరీరము ఎల్లప్పుడు ఐక్యతతో పనిచేస్తుంది. ఆ విధంగా పనిచేయనప్పుడు, ఆసంఘము క్రీస్తు శరీరాన్ని వ్యక్త పరచలేదు.
స్వతంత్రంగా ఉండేవారు పరిశుద్ధులతో కలసి దేవుడు సంఘాన్ని నిర్మించలేరు. ఆయన తన దేహాన్ని నిర్మిస్తున్నాడు. దానినే పౌలు ఎఫెసీ 4 అధ్యాయములో చెప్పుచున్నాడు. అది ఒకే శరీరమై యున్నది గనుక పరిశుద్ధాత్మ మనలో అంతకంతకు కలుగజేసే ఐక్యతను కాపాడుకొనుమని పౌలు చెప్పుచున్నాడు.
ఒక స్థానికసంఘములో ఐక్యత ఉన్నదని ఎప్పుడు చెప్పగలము? “సమాధానమనే బంధాన్నిబట్టి చెప్పగలము” (ఎఫెసీ. 4:1). ఆత్మానుసారమైన మనసే జీవమును, సమాధానమైయున్నది (రోమా 8:6). నీవు ఏ సహోదరుని గురించిగాని, సహోదరిగురించిగాని తలంచినప్పుడు, వారి విషయంలో నీవు సమాధానములోనూ విశ్రాంతిలోను ఉన్నట్లయితే, అప్పుడు నీకును, వారికిని మధ్య ఐక్యత ఉన్నట్లు నీకు తెలుస్తుంది. ఒక వ్యక్తి గురించి నీలో ఏదైనా కలవరం లేక అసహనం ఉన్నట్లయితే, అప్పుడు నీవు ఆవ్యక్తితో ఐక్యతలో లేవని తెలుసుకోవాలి. నీవు గట్టిగా “దేవునికి స్తోత్రం (Praise The Lord)” అని చెప్పినట్లయితే , అది వేషధారణ అవుతుంది.
సమాధానముండుటయే ఐక్యతకు రుజువు కాబట్టి సమాధానమనే బంధంచేత, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి.