“ప్రభువైనయేసు అను ఒకే ఒక నామమునుబట్టి సాతాను ఎల్లప్పుడు పారిపోవును” అని బైబిలు చెప్పుచున్నది. చాలమంది క్రైస్తవులు, సాతాను వారిని వెంటాడుచున్నట్లు ఊహించుకొని వారు పారిపొవుచున్నారు. కాని ఈ విషయము బైబిలు బోధించెదానికి పూర్తిగా విరుద్ధముగా ఉన్నది.
మీరు ఏమి అనుకొనుచున్నారు? ప్రభువైన యేసును బట్టి సాతాను భయపడతాడా లేడా? మన రక్షకుని ఎదుట సాతాను నిలుచుటకైనను భయపడును. ప్రభువైనయేసు లోకమునకు వెలుగైయున్నాడు, ఆయన యెదుటనుండి చీకటిదూత అదృశ్యమైపోవును.
దేవుడు సాతానును పడత్రోసినపుడు “ఆయన, సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిననెను”(లూకా 10:18). అరణ్యములో ప్రభువైనయేసు సాతానా పొమ్ము! అనగానే వాడు ప్రభువు సన్నిధిలోనుండి మెరుపువలె అదృశ్యమైయ్యెను. ఈనాడు ప్రభువైనయేసు నామములో మనము సాతానును ఎదిరించినపుడు, మన ఎదుటనుండి వాడు మెరుపువలె పారిపోవును. వెలుగు యొద్దనుండి చీకటి పారిపొవును.
ప్రభువైనయేసు నామమంటే సాతాను భయపడును. యేసే ప్రభువైయున్నాడని మరల మరల గుర్తుచేసినయెడల వాడు భయపడును. దయ్యముపట్టినవాడు యేసుక్రీస్తే ప్రభువని నోటితో ఒప్పుకొనడు మరియు సిలువలో సాతాను ఓడించబడియున్నాడని (సాతాను తల చితకకొట్టబడినదని) ఒప్పుకొనడు. ఎటువంటి దయ్యమునైనను వెళ్ళగొట్టుటకును మరియు మెరుపు వేగముతో మన యొద్దనుండి పారిపోవునట్లు చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది. ఈ విషయము ఎన్నటికి మరిచిపోవద్దు.
నీ జీవతములో ఏదైన నీకు సమస్య ఉన్నట్లయితే లేక అతిక్లిష్టమైన సమస్యను ఎదుర్కొనుచున్నట్లయితే మనుష్య రీతిగా పరిష్కారములేని సమస్యను నీవు ఎదుర్కొనుచున్నట్లయితే, ప్రభువైన యేసు నామమును పిలువుము. ఆయనతో ఈలాగు చెప్పుము, “ప్రభువైన యేసూ, సాతానుకు విరుద్దముగా నీవు నా పక్షముగా ఉన్నావు. ఇప్పుడు నాకు సహాయము చేయుము”. తరువాత సాతాను వైపు తిరిగి, ఇట్లనుము “సాతానా, ప్రభువైనయేసు నామములో నిన్ను ఎదురించుచున్నాను”. ప్రభువైనయేసు అతడిని సిలువపై ఓడించియున్నాడు. కాబట్టి వెంటనే అతడు నీయొద్దనుండి పారిపొవునని నేను మీకు చెప్పుచున్నాను. నీవు దేవుని వెలుగులో నడుస్తూ మరియు ప్రభువైన యేసునామములో అతడిని ఎదిరించినపుడు అతను నీ యెదుట శక్తిహీనుడుగా ఉండును.
సాతాను యొక్క ఓటమిని నీవు ఎరుగుట సాతానుకి ఇష్టములేదు కాబట్టి ఇంతకాలము నీవు ఆసంగతిని ఎరుగకుండా ఆటంకపరిచాడు. అందువలననే అనేకమంది బోధకులు తన ఓటమిని బోధించకుండునట్లు ఆపియున్నాడు.
సిలువమీద ప్రభువైన యేసుక్రీస్తుద్వారా యుగయుగములకు (ఇక ఎన్నటికి గెలువకుండునట్లు) సాతాను ఓడించబడియున్నాడని మీరందరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. సాతానంటే నీవు ఎన్నటికీ భయపడనవసరములేదు. అతడు నిన్ను ఇబ్బంది పెట్టలేడు. అతడు నీకు హానిచేయలేడు. అతడు నిన్ను శోధించవచ్చును. అతడు నీపై పడవచ్చును కాని నీవు ఎల్లపుడు దేవుని వెలుగులో నడుచుకొనుచు మరియు విధేయుడవై నిన్ను నీవు తగ్గించుకొనినయెడల క్రీస్తులో ఉన్న దేవుని కృపద్వారా ఎల్లప్పుడు అతనిని జయించెదవు. వెలుగులో అద్భుతమైన శక్తి ఉన్నది. చీకటి దూతయైన సాతాను, ఆ వెలుగులో ప్రవేశించలేడు. చాలామంది విశ్వాసులు చీకటిలో నడచుచూ అనగా రహస్యపాపములో జీవించుట లేక ఇతరులను క్షమించకపోవుట లేక ఇతరులమీద అసూయపడుట లేక వారి జీవితములలో సొంత ఉద్దేశ్యములను నేరవేర్చుకొనుట మొదలగునవి చేయుట ద్వారా సాతానుకు వాళ్ళమీద అధికారము ఉన్నది. లేనట్లైతే సాతాను వారిని ముట్టలేడు.
మన మనసులను ఏ విధముగానైనను సాతానుచేత చెరుపుటకు అతనికి ఒకసారి కుడా మనము అవకాశము ఇవ్వకూడదు. నీ మనసు చెరుపబడినయెడల అప్పుడు ప్రభువైన యేసునామమును ఉపయోగకరమైన రీతిగా ఉపయోగించలేవు. చెడును(కీడును) తీసివేయుటకు ప్రభువైన యేసు నామము, మరల మరల ఉచ్ఛరించుటకు ఒక మంత్రము కాదు. మొదట మనము దేవునికి లోబడవలెను. అప్పుడు మాత్రమే నీవు అతనిని ఎదిరించిన యెడల అతడు పారిపోవును. నీజీవితములోని అన్ని విషయములలో దేవునికి లోబడని యెడల, అపవాది నీకు భయపడడు.
కాబట్టి నీజీవితమును ఇప్పుడే సంపూర్ణముగా ప్రభువైన క్రీస్తుకు సమర్పించుకొనుము. మరియు ఇప్పటినుండి సంపూర్ణముగా ఆయనకొరకే జీవించుటకు నిర్ణయించుకొనుము.