నిర్గమకాండము 12 వ అద్యాయములో ఇశ్తాయేలీయులు ఐగుప్తునుండి విమోచింపబడుటను గూర్చి చదివెదము. వారు హిస్సోపు కుంచెతో నిర్దోషమైన గొఱ్ఱెపిల్ల రక్తమును తీసుకొని ద్వారబంధకపు పైకమ్మీకిని మరియు రెండు నిలువు కమ్మీలకును తాకించి మరణదూతనుండి తప్పించుకొనవలయును. అది క్రీస్తు రక్తమును విశ్వాసముద్వారా మన హృదయములలో ప్రోక్షించుకొనుటకు సాదృశ్యముగా ఉన్నది. హిస్సోపు అను చెట్టు ఐగుప్తులో చాలా ఎక్కువగా దొరుకును. విశ్వాసమును కూడా అలాగే చాలా సులభముగా కనుగొనవచ్చును. ఇశ్రాయేలీయులు నూతన సంవత్సరము మొదటి నెల 14 వ దినమున ఐగుప్తును విడిచిరి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా 1500 సంవత్సరాల తర్వాత అదే తారీఖున సిలువ వేయబడెను. పరిసయ్యులు ప్రభువైన యేసును సిలువవేయు దినమును దేవుడు ముందుగానే చూచి ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడిపించుటకు అదే దినమును ఎన్నుకొనెను!
ఇశ్రాయేలీయులు ఏవిధముగా విడిపించబడిరి? వారి మంచి జీవితమును బట్టికాదు లేక మంచి క్రియలను బట్టి కాదు. దేవుడు ప్రతి యింటిలోనికి వెళ్ళి వారు గత 30 సంవత్సరాలు ఏవిధముగా జీవించి యున్నారని పరీక్షించలేదు. కాని వారికి వారియొక్క ద్వారబంధకములమీద విశ్వాసముతో నిర్ధోషమైన గొఱ్ఱెపిల్ల రక్తమును తాకించియున్నారా లేదా అని మాత్రమే పరీక్షించెను. వారు హిస్సోపు కుంచెను రక్తములో ముంచి మరియు ద్వారబంధకములమీద తాకించుటద్వారా ( ఈ విధముగా చెప్పుచున్నారు) “నేను నా మంచి క్రియలుగాని లేదా నా మతసంబంధమైన పనులు గాని నన్ను రక్షించలేవని నమ్ముచున్నాను. నేను సిర్ధోషమైన గొఱ్ఱెపిల్ల రక్తము నందు నమ్మిక యుంచియున్నాను. కనుక నాయింటిలోనికి మరణదూత రాలేదని విశ్వసించుచున్నాను” అది మాత్రమే రక్షణ పొందు మార్గము.
ఏ మనుష్యుడు గర్వముగా ఇలాగు చెప్పజాలడు “నేను మంచి జీవితాన్ని జీవించియున్నాను కాబట్టి రక్షింపబడియున్నాను” ఆవిధముగాకాదు. మంచి జీవితము జీవించిన మనుష్యుడు మరియు చెడ్డజీవితము జీవించిన మనుష్యుడు ఇద్దరును ఆ రాత్రి ఐగుప్తులో, గొఱ్ఱెపిల్ల రక్తముద్వారానే రక్షింపబడి యున్నారు. ఎవరైననూ ఇశ్రాయేలీయులలో “నేను మంచి జీవితము జీవించియున్నాను కాబట్టి దేవుడు నన్ను తీర్పుతీర్చడని నమ్మి,” గొఱ్ఱెపిల్ల రక్తమును ద్వారబంధకముల మీద తాకించను అని తలంచినట్లయితే. అప్పుడు ఏమి జరిగియుండెడిదని మీరు తలంచుచున్నారు? ఐగుప్తులోని ఇతర గృహములలోవలెనే, అతని ఇంటిలోనికి కూడా మరణ దూత వచ్చి అతని జ్యేష్ఠ కుమారుణ్ణి చంపియుండెడిది.
చాలామంది రక్షణను కేవలము క్రీస్తు రక్తమునందు విశ్వాసముంచుటద్వారా కృపచేత పొందియున్నాము అను సత్యము అవకాశముగా తీసుకొని, మరియు అజాగ్రత్తగా జీవించి ఈలాగు చెప్పుచున్నారు, “మనము ఏవిధయుగా జీవించినను పర్వాలేదు”. కాని అది కూడా రక్షణ క్రియలవలన కాదు కాని విశ్వాసము ద్వారా కృపచేతనే అను సత్యమును మార్చజాలదు.
ఎఫెసీ 2:9 లో ఈ విధముగా చెప్పబడెను “ఏ మనుష్యుడు అతిశయింపకుండునట్లు, అది క్రియల వలన కలిగినదికాదు” కాని దాని తర్వాత వచనము మనము రక్షింపబడిన తరువాత, సత్ క్రియలు చేయుటకు దేవుని చేత సృష్టించబడిన వారమని చెప్పుచున్నది. కాబట్టి సంపూర్ణ సత్యము ఇదియే:
మనము ఎన్ని సత్ క్రియలు చేసినను రక్షణ పొందలేము.
కాని రక్షింపబడిన తరువాత, మన “విశ్వాసము” ద్వారా సత్ క్రియలను చేయని యెడల, అప్పుడు మన విశ్వాసము నిజమైనది కాదని ఋజువగుచున్నది.
యాకోబు చెప్పునది ఇదియే: “క్రియలు(సత్ క్రియలు) లేని విశ్వాసము మృతము” (యాకోబు 2:26).
ఇశ్రాయేలీయులు, రక్తమును ద్వారబంధకముల మీద తాకించిన తర్వాత పులియని రొట్టెలు తినమని ఆజ్ఞాపించబడిరి. అది జీవాహారమైన యేసును భుజించుటకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన రక్తమునందు విశ్వాసముంచుటయే సరిపోదు, కాని ఆయన జీవమును కూడా భుజింపవలెను. మనము “ఆయన మరణము ద్వారా దేవునితో సమాధాన పరచబడి, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము” (రోమా 5:10).
ప్రయాణమునకు సిద్ధమైయుండి రొట్టెలు భుజించమని వారికి చెప్పబడెను - పిలిచిన వెంటనే ఐగుప్తును విడచుటకు సిద్దముగా ఉండవలెను. మనము కూడా ఎల్లప్పుడు ప్రభువైన యేసు పిలచిన వెంటనే వెళ్ళి ఆయనను కలుసుకొనుటకు సిద్దముగా వుండి ఈలోకములో జీవించవలయును. ఈ లోకము మన ఇల్లు కాదు మనము ఎప్పుడైన వెళ్ళుటకు సిద్దముగా వుండవలయును.