వ్రాసిన వారు :   జాక్ పూనెన్
WFTW Body: 

రతరాల నుండి వచ్చే శాపాలను గూర్చి మన మనస్సులో ఉండే ఎటువంటి కలవరమైనను తీసివేయడానికి ఉపయోగపడే ఎంతో ప్రాముఖ్యమైన వచనం యెహెజ్కేలు 18 వ అధ్యాయంలో ఉన్నది. "తండ్రులు ద్రాక్షాకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరుచెప్పుచూ వచ్చిరే" ఈ సామెతను ఉపయోగించుటలో నీ అర్థమేమిటి? (యెహెజ్కేలు 18:1-2). తల్లిదండ్రులు చేసిన పాపములను బట్టి పిల్లలు బాధింపబడతారు అని ప్రజలు చెప్తూ ఉంటారు. ఇది అన్యులలోను మరియు దురదృష్టవశాత్తు బైబిలు తెలియని ఎంతో మంది క్రైస్తవుల మధ్య కూడా ఉండే సర్వసాధారణమైన గ్రహింపు.

నిర్గమకాండము 20:5 ను ఇశ్రాయేలులో ఉండే బోధకులు తప్పుగా అనువదిస్తూ మరియు వారి పూర్వీకులు చేసిన పాపములను బట్టి తమ పిల్లలను శిక్షించే ఒక అన్యాయస్థుడైన దేవునిగా చిత్రీకరించి ప్రజలను బంధకములలోకి లాగుతూ ఉండేవారు. కాని దేవుడు దానికి "ఇశ్రాయేలులో మీరిక ఈ సామెతను పలుకరు పాపము చేయు వాడెవడో వాడే మరణము పొందును" (యెహెజ్కేలు 18:3,4) అని సమాధానమిచ్చెను. 2500 సంవత్సరాల క్రితమే ప్రభువు దీనిని స్పష్టంచేశారు.

కాని దురదృష్టవశాత్తు బాగా ప్రసిద్ధిగాంచిన క్రైస్తవ బోధకులు వ్రాసిన పుస్తకాలు ఎంతో మంది క్రైస్తవులు వారి పితరులు చేసిన విగ్రహారాధనను బట్టి లేదా చేతబడి చెయ్యడాన్ని బట్టి ఈనాడు బాధపడుతూ ఉన్నారు అని ఋజువు చేస్తున్నాయి. మన పితరుల మీద ఉండే శాపం మన మీదకు వస్తుందని ఇప్పుడు మనం దానిని గద్దించాలని తొలగించుకోవాలని వారు చెప్తారు. అది వ్యర్ధమైన వాదన!

ఎప్పుడైతే మన జీవితాలను సంపూర్ణంగా క్రీస్తుకు సమర్పించుకుంటామో, మనం మన పూర్వీకుల నుండి ("ఆదాము" అనే వృక్షము నుండి) వేరు చేయబడతాము. మరియు "క్రీస్తు" అనే వేరొక వృక్షమునకు అంటుకట్టబడతాము. ఎప్పుడైతే మనము క్రీస్తులోనికి అంటుకట్టబడతామో ఆ క్షణమే ఏవైతే శాపములు మన పూర్వీకుల నుండి మనము స్వాస్థ్యముగా పొందియున్నామో అవన్నీ తొలగింపబడతాయి. ఇప్పుడు మనకు ఎటువంటి శాపములు లేవు కాని "క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును" మాత్రమే ఉన్నది (గలతీ 3:13-14; ఎఫె 1:3).

ఒకవేళ నీ పూర్వీకులు విగ్రహారాధన చేసినప్పటికినీ లేదా చేతబడులు చేసినప్పటికిని ఒకసారి నీ జీవితం పూర్తిగా క్రీస్తునకు సమర్పించినప్పుడు అవి నీకు ఏ విధంగాను హాని చేయలేవు ఒకవేళ నీ జీవితం సంపూర్ణంగా క్రీస్తునకు సమర్పించనప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. కాని ఒకసారి నీవు క్రీస్తులోనికి అంటుకట్టబడిన తరువాత, శాపం నీ మీదకు ఎలా వస్తుంది? క్రీస్తు శపించబడడు నీవు క్రీస్తులో ఒక భాగము. అయినప్పటికిని ఎంతో మంది క్రైస్తవులు దానిని నమ్ముచున్నారు. దేవుని ఆశీర్వాదం మన మీదకు వచ్చునట్లుగా క్రీస్తు ఆ కలువరి సిలువ మీద శాపగ్రస్తుడాయెను.

దైవభక్తి లేని తల్లిదండ్రుల యొక్క పిల్లలు శారీరకంగాను, వస్తుపరంగాను అనేక విధాలుగా భాదపడుతూ ఉండటం నిజమే. ఉదాహరణకు, ఒక వ్యక్తి త్రాగుబోతు అయితే వారి అవసరానికి తగినంత డబ్బులు ఇంట్లో ఉండవు కాబట్టి వారి పిల్లలు బాధపడతారు, కాని ఆ తండ్రి చేసిన పాపమును బట్టి ఆ పిల్లల మీదకు ఎటువంటి శాపము రాదు. వారి తండ్రి యొక్క పాపములను బట్టి వారు శిక్షింపబడరు. ప్రతిఒక్కరు వారు చేసిన పాపమును బట్టి వారు శిక్షింపబడతారు.

ప్రభువు యెహెజ్కేలుకు ఈ విషయాన్నే స్పష్టం చేశాడు. కాబట్టి ఏ విధమైన తప్పుడు బోధల ద్వారా ఏ బోధకుడైనా మిమ్మల్నీ భయపెట్టునట్లుగా, బంధకాలలోకి తెచ్చునట్లుగా అనుమతించవద్దు.