1 ) 2 సమూయేలు ఒకటవ అధ్యాయములో సౌలుమరణమును గూర్చి చదివెదము. సౌలు దావీదును ఎంత ద్వేషించాడంటే, 10 స||లకు పైగా దావీదును చంపుటకు అతనిని దేశమంతటికీ తరిమియున్నాడు. చివరకు సౌలు మరణించియున్నాడు. నీవు దావీదు స్థానములో ఉన్నట్లయితే, అ వార్త విని ఎలా స్పందించేవాడవు? ఇక్కడ దావీదు స్పందనను గమనించండి. సౌలు ఆత్మహత్య చేసుకున్నాడని మనకు తెలియును(1 సమూయేలు 31 ). కాని ఒక అమాలేకీయుడు దావీదు వద్దకు వచ్చి దావీదుకు తనమీద దయకలుగునట్లు ఒక అబద్దము చెప్పాడు. సౌలు విన్నపమును బట్టి అతను సౌలును చంపెనని చెప్పి మరియు సౌలుయొక్క కిరీటమును మరియు కడియమును దావీదుకు ఇచ్చాడు. దీనిని బట్టి దావీదు సంతోషించి, తనకు బహుమానమిచ్చునని అతడు అనుకొనియున్నాడు. కాని అలాకాకుండ, దావీదు తన బట్టలను చింపుకొని, సౌలు కొరకు ఆ రోజంతయు ఉపవాసము ఉండి ఏడ్చాడు (2 సమూయేలు 1 : 11 ). దేవుని అభిషేకము కలిగిన వ్యక్తిని చంపుటకు నీవేల భయపడలేదని అతనిని అడిగెను. దానిని బట్టి దావీదు ఒక యౌవ్వనస్థుని పిలిచి అతనిని చంపించెను. అబద్దము చెప్పినందుకు అతడు తగిన మూల్యము చెల్లించాడు. అక్కడ దావీదు వైఖరిని చూడండి. దావీదును దేవుని హృదయానుసారుడుగా చేసినవాటిలో ఇది ఒకటి. ప్రభువైనయేసు చెప్పినమాట మనకు తెలుసును, "శత్రువులను ప్రేమించుడి. మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి. మిమ్మును శపించినవారిని దీవించుడి. మిమ్మును బాధించువారికొరకు ప్రార్ధన చేయుడి (లూకా 6 : 27 -28 )". దావీదు అలాగే చేశాడు. పాతనిబంధన కాలములోనే అతడు క్రొత్త నిబంధన వైఖరిని కలిగియున్నాడు. సౌలును దావీదు ద్వేషించలేదు. సౌలు అభిషేకమును కోల్పోయినప్పటికీ, "ఆయనను ముట్టనని" ఎల్లప్పుడు చెప్పియున్నాడు.
2 ) తరువాత సౌలును గూర్చి విచారిస్తూ దావీదు వ్రాశాడు. యోనాతాను దాని గూర్చి యదార్థహృదయముతో వాటిని గూర్చి మెచ్చుకొన్నాడు. తనను ద్వేషించి కీడు చేసేవారి విషయములో ఒక దైవజనుడు ఎలా ప్రవర్తించవలెనో ఇక్కడ మనము నేర్చుకొనగలము. దావీదు ఈలాగు చెప్పాడు, "ఇశ్రాయేలూ నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి............... బలాఢ్యులు పడిపోయిరి" (2 సమూయేలు 1 : 19, 25, 27 ). దావీదు తన సన్నిహిత స్నేహితుడైన యోనాతానును మెచ్చుకొనుటను మనము అర్ధము చేసుకొనగలము. అనేక జయములను పొందిన సౌలును కూడా బలాఢ్యుడని మెచ్చుకొనియున్నాడు. సౌలులో ఉన్న మంచితన్నాని మెచ్చుకొని, అంతటితో దావీదు ఆపియున్నాడు. సౌలును తాను తీర్పు తీర్చకుండా దానిని దేవునికి వదలిపెట్టియున్నాడు. ఈ విషయములో దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని, ఇశ్రాయేలు సింహాసనము మీద కూర్చుండబెట్టియున్నాడు.
3 ) 2 సమూయేలు 2 : 1 లో "దావీదు దేవునియొద్ద విచారణ చేసెను" అని వ్రాయబడియున్నది. ప్రతి విషయములో దేవుని చిత్తమును వెదకుట దావీదు యొక్క అలవాటు (2 సమూయేలు 23 : 2-4; 30 : 8 ). 2 సమూయేలు 5 : 17 - 25 )లో, ఫిలిష్తీయులతో జరిగిన రెండు యుద్ధములను గూర్చి దావీదు దేవుని చిత్తమును వెదకియున్నాడు. రెండవసారి చుట్టు తిరిగివెళ్ళి వెనుకనుండి కొట్టమని దేవుడు చెప్పాడు. ప్రతిసారి యుద్ధము చేసే పద్ధతి(యుక్తి)ని దేవుడు మార్చాడు. దావీదు యుద్ధశూరుడైనప్పటికీ, ఆ పద్ధతిని ఎల్లప్పుడు దేవుని నుండి పొందుకొనేవాడు. అందువలన అతడు ఎల్లప్పుడు గెలిచేవాడు. ఆ దేశములో కరువు వచ్చినప్పుడు కూడా దావీదు, దేవునిని విచారించియున్నాడు(2 సమూయేలు 21 : 1 ).
4 ) యూదా వారు వచ్చియున్నారు మరియు దావీదు యూదావారందరి మీద రాజుగా అభిషేకించబడెను. తరువాత ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకించబడెను (2 సమూయేలు 5 : 3 - 5 ). యూదాకు రాజైనప్పుడు దావీదుకు 30 సం||లు. ఇశ్రాయేలీయులందరిని పరిపాలించుటకు 7 1/2 సం||లు వేచియున్నాడు. కాబట్టి తన జీవితములో దేవుని వాగ్దానము నేరవెరుటకు అతడు 20 సం||లకు పైగా వేచియున్నాడు. దావీదు యొక్క కనిపెట్టే సమయముకూడా దాదాపుగా అబ్రాహమునకు పట్టిన సమయమే. అయితే దావీదు ఓపికతో కనిపెట్టియున్నాడు. విశ్వాసము మరియు ఓర్పు ద్వారా దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొన్న అటువంటివారిని వెంబడించుటకు మనము పిలువబడ్డాము. సింహసనమును దావీదు తనకు తానుగా లాక్కొనలేదు. దేవుడు తన సమయములో ఇచ్చే వరకు అతడు వేచియున్నాడు.
5 ) 2 సమూయేలు 6 : 20 లో "తన ఇంటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా" అని ఉన్నది. అనేక మైళ్ళు నడచి నాట్యమాడి అలసిపొయినప్పటికీ తన ఇంటివారిని దీవించుటకు వచ్చుట ఎంత రమ్యముగా ఉన్నది. ప్రతి భర్త కూడా ఉద్యోగము(పని) నుండి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, కోపముతో వచ్చి భార్యమీద కేకలు వేయక, దీవించుటకు రావాలని నేను కోరుచున్నాను. నిందించే భార్య (మీకాలు) ఉన్నప్పటికీ, అది దావీదుకు ప్రభువులో ఉన్న ఆనందమును చల్లార్చలేకపోయినది. అతడు ఇంటిలో ప్రవేశించినవెంటనే, అతని భార్య "నీవు రాజువైయుండి ఒక సామాన్యుడి వలె నాట్యమేశావని అతనిని నిందించి మరియు అపహసించింది. దావీదు ఏమన్నాడు? నేను, నా భార్య అభిప్రాయమును లెక్కచేయను కాని నా జీవితకాలమంతయు ప్రభువు యెదుట నాట్యమాడెదను (21 వ).
6 ) 2 సమూయేలు 7 : 2 లో దేవునికి మందిరమును కట్టవలెనని దావీదు కోరియున్నాడు. అలా చేయమని తనకు ఎవరూ చెప్పలేదు. కాని తన హృదయములో ఈలాగు అనుకొన్నాడు, "నేను సుందరమైన భవనములో నివసించుచున్నాను. కాని దేవుని ప్రత్యక్షగుడారము, గుడారములోనే ఉన్నది" ఎక్కువమంది ఈలాగు ఆలోచించవలెనని నేను కోరుచున్నాను: "ప్రభువా నాకొరకు నేను ఎంతమంచి ఇల్లు కట్టుకొన్నాను. దానికొరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టియున్నాను. కాని నీ పరిచర్యకు ఎంత తక్కువ ఇచ్చియున్నాను. నీ పని(పరిచర్య) నిమిత్తము ఎంత తక్కువ ఆలోచిస్తున్నాను". తమ కోరికలను తమ సమయమును మరియు తమ డబ్బును, తమ్మును తామే సమర్పించుకొనే పనివారు దేవుని పనికి అవసరమైయున్నారు. చాలామంది విశ్వాసులు వారి కంపెనీలకు ఎక్కువగా పనిచేసి, వారి కంపెనీలకు లాభాన్ని చేకూర్చుతున్నారు. జీతము తీసుకొనకుండా మరియు ఫిర్యాదు చేయకుండ దేవుని సేవకులముగా మనము ఎక్కువగా చేయలేమా? దావీదు దేవుని హృదయానుసారుడు మరియు దేవుని మందిరము నిమిత్తము ఆలోచనకలిగియున్నాడు. మన స్వంత ఇంటి కంటే, అతనివలె దేవుని మందిరము (పరిచర్య) నిమిత్తము జీవితమంతయు ఆలోచించే అతనివంటి హృదయము మనమందరము కలిగియుందుము గాక. నీవు ఆయన మందిరము (సంఘము) నిమిత్తము శ్రద్ధ వహించినట్లయితే దేవుడు నీ ఇంటిని గూర్చి శ్రద్ధ వహించును.
7 ) దావీదు, ఇశ్రాయేలు శత్రువులందరిని ఓడించుట ద్వారా మందిరము కట్టుటకు సొలొమోనుకు అన్నిటిని సిద్ధపరచాడు. మందిరమునకు అవసరమైన బంగారమును మరియు వెండిని సమకూర్చాడు. కాని మందిరమును సొలొమోను కట్టించాడు. దానిని చేయుటకు మనము సిద్ధముగా ఉన్నామా? కష్టమైన పని అంతయు మనము చేసి, దానికి రావలసిన మెప్పును ఇతరులకు ఇవ్వగలమా? లేక ఆ మెప్పును(ఘనతను) మనమే కోరుచున్నామా? దేవుని హృదయానుసారుడైన వ్యక్తి, ఇతరులకు సులభమగునట్లు పని చేసి దాని ద్వారా వచ్చే ఘనతను వేరేవారు పొందునట్లు అనుమతించును.