వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట పునాది సత్యము
WFTW Body: 

పాపమునకు స్పష్టమైన నిర్వచనము ఏమిటి?

"ఆజ్ఞ అతిక్రమమే పాపము" 1 యోహాను 3:4 చెప్పుచున్నది. ఇవి మనము కావాలని చేసే పాపములైయున్నవి.

"మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును" అని యాకోబు 4:17 చెప్పుచున్నది. అనగా మనము చేయవలసిన వాటిని చేయకుండుట.

రోమా 3:23లో పాపమునకు స్పష్టమైన నిర్వచనము ఉన్నది. "దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుట పాపము". పది ఆజ్ఞలను అతిక్రమించుటయేకాదు లేక ప్రభువైనయేసు కొండమీద చేసే ప్రసంగం (మత్తయి 5 మరియు 7వరకు) అతిక్రమించుట మాత్రమే పాపం కాదు దానికంటే ఎక్కువ అయియున్నది. దేవుని మహిమను పొందకపోవుటయే పాపము.

దేవుని మహిమ అనగా ఏమిటి?

"ఆ వాక్యము శరీరధారియై మరియు కృపసత్య సంపూర్ణుడుగా మనము ఆయన మహిమను కనుగొంటిమి"(యోహాను 1:14). ప్రభువైనయేసుయొక్క జీవితములో దేవుని మహిమను చూడగలము. కాబట్టి ఈ రెండు వచనములు కలిపి చూసినట్లయితే(యోహాను 1:14 మరియు రోమా 3:23), క్రీస్తు కానిదేదైనను పాపమని చూడగలము. కాబట్టి తాను పాపమునుండి సంపూర్ణముగా విడిపించబడియున్నానని ఎవరు చెప్పగలరు? ఎవరూ చెప్పలేరు ఎందుకనగా మనమెవరమైనను క్రీస్తువలె సంపూర్ణముగా రూపాంతరం పొందలేదు.

పాపము యొక్క నిర్వచనాన్ని తగ్గించి వారు పాపమునుండి సంపూర్ణముగా విడుదల పొందియున్నామని ఊహించుకుంటారు. దేవుని రాజ్యములో ఉత్తీర్ణత పొందుటకు 40శాతం కాదుగాని 100శాతం. క్రీస్తుకంటే తక్కువది ఏదైనను పాపమే. ఇతరులకంటే తాము చెడ్డవారము కాదని కొందరు విశ్వాసులు అనుకుంటారు. అది పరీక్షలో 2శాతం పొందినవాడు 1శాతం పొందిన వానికంటే శ్రేష్టమైనవాడు అనుకుంటాడు. కాని వారిద్దరు ఓడిపోయారు. దేవుని రాజ్యములో నీవు 99శాతం పొందినప్పటికిని, సున్నా మార్కులు పొందిన వారితో సమానము. "ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయినయెడల, అజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును"(యాకోబు 2:10).

నాకు అనేకవేలమంది క్రైస్తవులు తెలియును. వారిలో అనేకులు, దేవుని దృష్టిలో దేనికి పనికిరాని పాపులని చూసినట్లుగా నేను కనుగొనలేదు. మేము పాపులమేగాని ఇతరులంత చెడ్డపాపులముకాదని నమ్మెదరు. అందువలన వారు సంపూర్ణరక్షణ పొందుటకు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని సంపూర్ణముగా అనుభవించలేరు.

దేవుడు శిక్షిస్తాడు అను భయములో కొందరు పాపము చేయరు. కాని ఒకడు పాపము చేయుటను దేవుడు చూసినప్పుడు అతడు పోగొట్టుకునే మహిమను గూర్చి ఆయన ఆలోచిస్తాడు. నీ జీవితకాలమంతయు నీవు పాపములో జీవిస్తున్నట్లయితే నిత్యత్వంలో నీవు కొంత మహిమను పోగొట్టుకునెదవు. నీ జీవితములో నీవు ఎంత పాపమును ఉండనిస్తే అంతగా మహిమను కోల్పోతావు.