వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   అన్వేషకుడు
WFTW Body: 

హెబ్రీ 12:15లో చేదైనవేరు మనకు సమస్యను తేవచ్చని బైబిలు చెప్పుచున్నది. అది ఫలముగా మారేవరుకు నీవు ఎదురుచూడనవసరములేదు. నీకు వేరు అంటే ఏమిటో తెలియును. ఒకచెట్టు యొక్క వేరు ఆరంభమైనప్పుడు, ఆమొక్క ఇంకను భూమిపైకి కూడారాదు. మనకు ఏమియు కనపడదు. భూమిలో నీవు ఒక విత్తనము వేసినప్పుడు, అది భూమిలో వేరు కలిగియుండును.

చేదైనవేరు అటువంటిది. నీ హృదయములో నీవు కొంత చేదును విత్తియున్నావు. అది నీలో వేరు పారుతున్నది. ఆ చేదును నీవు తీసిపారవేయనట్లయితే, అది నీకును మరియు ఇతరులకు కూడా సమస్యను తెస్తుంది. ఆ చేదును కలిగిన వ్యక్తి ఇతరుల దగ్గరకు వెళ్ళి దాని గురించి మాట్లాడతాడు కాబట్టి అది అనేకులకు సోకుతుంది. అది ఏలా ఉంటుందనినచో, చిన్న అమ్మవారు (చికెన్‍పాక్స్) కలిగినవ్యక్తిగాని, టి.బి కలిగిన వ్యక్తిగాని లేక జలుబు, జ్వరము కలిగిన వ్యక్తిగాని ఇతరుల దగ్గరకు వెళ్ళినప్పుడు అవి వారికి కూడా సోకును. ఇది ఇతరులలోనికి చాలా సులభముగా వెళుతుంది. అది త్వరగా ఇతరులకు అంటుకుంటుంది. ఇటువంటి చేదు(ద్వేషము)ను కలిగిన వారిని మనము లోకమంతటా చూస్తాము. క్రైస్తవులలో కూడా అనేకులు ఈ విధముగా ఉన్నారు. ఒకవ్యక్తి మీ దగ్గరకు వచ్చి వేరే వారిమీద ఫిర్యాదు చేసినట్లయితే లేక వారి గురించి చెడుగా కొండెములు చెప్పినట్లయితే అతని హృదయములో ఏమి ఉండి ఉంటుంది? ఆ వ్యక్తికి వేరే వారి మీద ద్వేషము ఉన్నది.

ఈ అంటురోగము మీకు రాకుండా ఉండాలంటే, నీవు ఎవరిమాటలు వింటున్నావో, దాని గూర్చి జాగ్రత్త పడాలి. వేరేవారినుండి నీవు ఎయిడ్స్ రోగము పొందాలనుకుంటావా? ఆ విషయము ఎంత జాగ్రత్తగా ఉంటాము. అయితే, ఇది ఇంకా తీవ్రమైనది. ఎయిడ్స్ రోగము కంటే ఇది మిమ్ములను ఎక్కువగా నాశనము చేస్తుంది. కుష్టురోగము ఉన్న వ్యక్తిని నీవు కౌగలించుకొనుటకు ఇష్టపడతావా? ఇది ఇంకా తీవ్రమైనది. కొండెములు చెప్పువారిని, ఇతరుల గూర్చి చెడుగా మాట్లాడేవారిని ఎందుకు నీవు ఆహ్వానించి మరియు కౌగలించుకొనుచున్నావు?. I తిమోతి 5 : 13లో ఇంటింట తిరుగుచు ఆడరాని మాటలాడే వదరుబోతు స్త్రీలను గూర్చి చెప్పబడింది. మన సంఘములలో అటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. వారు సాతానుయొక్క దూతలుగా ఉన్నారనుటలో ఎటువంటి అనుమానము లేదు. సాతాను వారి ద్వారా నీతో మాట్లాడాలని కోరేదంతయు నీవు విని మరియు నిన్ను నీవు చెరుపుకొనునట్లు అటువంటివారిని నీవు ఆహ్వానించటమే కాకుండా వారికి టీ మరియు బిస్కెట్లు ఇచ్చి వారితో కూర్చోని వారు చేప్పేది వింటున్నావు. ఆమె వేరే ఇంటికి వెళ్ళి ఆ కధను (కొండెములు) చెప్పుతుంది మరియు నీవు కూడా వేరే ఇంటికి వెళ్ళి నీవు వినిన కొండెములు అక్కడ చెప్పెదవు. ఆవిధముగా సాతాను ప్రతిరోజు వందలమంది ఏజెంట్లను చేయచున్నాడు. సంఘములోని కొందరువిశ్వాసులు సాతాను కొరకు పనిచేయుచున్నారు. నేరారోపణ చేయువాడుగా సాతాను పిలువబడ్డాడు. ప్రకటన 12 : 10లో నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు. మీ యింటికి వచ్చిన ఆమెగాని, అతడుగాని నేరము మోపేవారుగా ఉన్నారు. నీవు విశ్వాసులైన సహోదరుల మీద నేరము మోపేవాడుగా ఉన్నావా?

నీవు చెప్పేది నిజమా కాదా అనేది ప్రశ్న కాదు. ప్రకటన 12 : 10లో బైబిలు ఈలాగు చెప్పుచున్నది, "దేవునియెదుట అతడు మన సహోదరుల మీద నేరము మోపును". మనుష్యలతో సాతాను చాలాసార్లు అబద్ధము చెప్పవచ్చును. అతడు అబద్ధికుడు కాని అతడు దేవునియెదుట అబద్ధము చెప్పుటకు ధైర్యము చేయలేడు. నీ గురించి సాతాను దేవునియెదుట నేరము మోపినప్పుడు ఎలా చేస్తాడనుకుంటున్నావు. నీవు చెయ్యనివాటిని గూర్చి ఏదోఒక కథ చెప్తాడనుకుంటున్నావా? సాతాను అంత బుద్ధిహీనుడు కాదు. నీవు చేసిన తప్పునే అతడు దేవునికి చెప్తాడు. అతడు నిన్ను జాగ్రత్తగా గమనిస్తుంటాడు. నీవు ఏదైనా తప్పు చేసినప్పుడు అతడు దేవునియొద్దకు వెళ్ళి ఈలాగు చెప్పును, "ఈ వ్యక్తి చేసిన దానిని చూడుము మరియు ఇది అబద్ధము కాదు. ఇది 100% నిజము. అలాగే వేరే వ్యక్తి గురించి చెప్తాడు, "ఆ వ్యక్తి అక్కడ చేసింది చూడండి అది 100% నిజము". కాబట్టి సాతాను దేవునియెదుట నేరము మోపినప్పుడు 90% కాదు గాని నూటికి నూరుశాతం నిజమే చెప్పుతాడు.

కాబట్టి ఎవరైనను నీయొద్దకు వచ్చి ఒక విషయము చెప్పినప్పుడు, అందులో పొగడ్తలు లేనప్పటికీ మరియు అది నూటికి నూరుశాతం నిజమే అయినప్పటికీ అతడు సహోదరుల మీద నేరము మోపువాడేనని మనము అర్ధము చేసుకొనవచ్చును. సహోదరుల మీద ఎక్కువగా నేరము మోపువాడైన సాతానుతో అతడు నూరుశాతం సహవాసము కలిగియున్నాడు. మరియు సాతాను ఆవిధముగా రాత్రింబవళ్ళు చేస్తాడని చెప్పబడింది. అతడు చేసే పని సహోదరుల మీద నేరము మోపుటయే. భూమి మీద అతనికి దూతలు (ఏజెంట్స్) కావాలి. అతనిపిల్లలును మరియు అతనిసేవకులునైన అవిశ్వాసులలో అనేకమంది అతనికి ఏజెంట్స్ ఉన్నారు మరియు విశ్వాసులలో కూడా అతనికి ఏజెంట్స్ ఉన్నారు. ఇతరుల మీద ద్వేషము ఉన్నవారు, ఇతరులని క్షమించనివారు, ఇతరులమీద ఫిర్యాదుకలిగినవారు, వారిమీద వేరేవారికి కొండెములు చెపుతూ తిరుగుతారు. అందుకే కొలస్సీ 3 : 13లో బైబిలు ఈలాగు చెప్పుచున్నది, "ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరు క్షమించుడి". వారు ఎవరైనను సరే. నీకు ఎవరిమీదైనా ఫిర్యాదు ఉన్నాదా? నీకు ఎవరైనా ఏదైనా హాని చేసారా? వారిని క్షమించండి. నీవు వారిని క్షమించనట్లయితే నీవు సాతాను ఏజెంట్‍గా మారుదువు. ఇది చాలా సులభము. "లేదు, లేదు నేను క్షమించాను" అని నీవు అనవచ్చును కాని ఆ వ్యక్తి నీ విషయములో బాధపడునట్లు నీవు వేరేవారికి ఆ వ్యక్తి గురించి చెప్పినట్లయితే, దాని అర్ధము అతనిని నీవు హృదయపూర్వకముగా క్షమించలేదు. మరియు నీవు ఎవరిని నాశనము చేయుచున్నావు? అతని గురించి చెప్పుట ద్వారా అతని పేరుప్రతిష్టలు నాశనము చేయుచున్నావని నీవు అనుకొనవచ్చును. ఒకవేళ అతడు దేవుని ప్రేమించే వ్యక్తి అయినట్లయితే, నీవు అతనికి చేసిన కీడును, అతనిని పరిశుద్ధపరచుటకు మేలుగా దేవుడు దానిని ఉపయోగించును. నష్టపోయేది నీవు మాత్రమే. కాబట్టి దానినుండి పూర్తిగా విడుదల (ప్రార్ధించుటద్వారా) పొందుము. ఓడిపోయిన తన బిడ్డలకొరకు, సహోదర, సహోదరీలకొరకు ప్రభువైనయేసు ప్రార్ధిస్తున్నారు. సాతాను వారిమీద నేరము మోపుతాడు. నీవు ఒకదానిని ఎన్నుకొనవచ్చును. నీవు ప్రభువైనయేసుతో సహవాసము కలిగి వారికొరకు విజ్ఞాపన చేయవచ్చును లేక సాతానుతో సహవాసము కలిగి వారిమీద నేరారోపణ చేయవచ్చును. కనీసము ఈరోజు నుండి మీరు మంచి నిర్ణయము తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.