వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   Religious or Spiritual Spiritual Treasure
WFTW Body: 

ఎఫెసీ 1:3 గమనించండి ఇవి ఆత్మసంబంధమైన(నిత్యత్వముండే) ఆశీర్వాదములు కాని భూసంబంధమైన తాత్కాలిక ఆశీర్వాదములు కాదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు భూసంబంధమైన ఆశీర్వాదములు ఇవ్వబడినవి. అవి ద్వితీయో.కా. 28 అధ్యాయములో చదువగలము. ఇది మోషే తెచ్చిన ధర్మశాస్త్రముకంటే ప్రభువైనయేసు పరలోకమునుండి మనకొరకు తెచ్చిన కృపను వేరుచేయుచున్నది. ఇటువంటి వచనములు పాతనిబంధనలో ఉంటే ఇలా ఉంటుంది, భూలోకములో వస్తుసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించిన సర్వశక్తికలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి విశ్వాసులెవరైతే కేవలము స్వస్థత మరియు వస్తుసంబంధమైన ఆశీర్వదములనే వెదకుచున్నారో వారు పాతనిబంధన క్రిందకు వెళ్ళుచున్నారు. అటువంటి విశ్వాసులను క్రైస్తవులనుట కంటే ఇశ్రాయేలీయులనుట మంచిది. వారు క్రీస్తుని కాక మోషేని వెంబడిస్తున్నారు. అనగా విశ్వాసులు దేవుని సంబంధమైన విషయాలలో ఆశీర్వదించడరని అర్ధమా? ఆయన వేరేవిధముగా ఆశీర్వదిస్తాడు. వారు ఆయన రాజ్యమును మరియు నీతిని వెదకినట్లయితే వారి యొక్క భూసంబంధమైన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. పాతనిబంధనలో వారు చాలా మంది పిల్లలను, ఆస్తులను, ఎంతో ధనమును, వారి శత్రువుల మీద జయమును, పేరుప్రతిష్టలను, అధికారాన్ని మొదలగువాటిని వెదకి పొందియున్నారు. కాని క్రొత్తనిబంధనలో మనము ఎన్నటికి నశించని నిత్యమైన ఆత్మసంబంధమైన ఆశీర్వాదలను అనగా ఆత్మీయ బిడ్డలను, శోధింపశక్యముకాని, ఆత్మసంబంధమైన క్రీస్తు ఐశ్వర్యమును, ఆత్మసంబంధమైన ఘనతను, ఆత్మసంబంధమైన జయమును(అనగా సాతాను మీదను, శరీర యిచ్చలమీదను జయము గాని మనుష్యులమీదకాదు. మనము దేవుని చిత్తమును నెరవేర్చుటకు అవసరమైన ఆరోగ్యమును, సిరిని మరియు ప్రతి అవసరమును ఆయన తీర్చును. మనకు ఎంతవరకు సిరిని ఇస్తే చెడిపోకుండా ఉంటామో అంతగా ధనాన్ని ఇస్తారు. పాతనిబంధనలో కొంతమందికి వందల కోట్ల రూపాయలను ఇచ్చారు. కాని ఈనాడు దేవుడు మనకు ఆవిధంగా ఇవ్వడు ఎందుకంటే మనము పైనున్న వాటిని, క్రీస్తులోవున్న శోధింపశక్యముగాని ఐశ్వర్యమునుగాని) వెదకి పొందుకొనకుండా నష్టపోయెదము.

పాతనిబంధనకు మరియు కొత్తనిబంధనకు మధ్య నున్న తేడాను చాలమంది విశ్వాసులు గ్రహించలేరు. అందువలనే పాతనిబంధనలో దేవుడు వాగ్దానము చేసిన వాటినే వారు వెదకుచున్నారు. ఇహలోకములో సిరిని గూర్చి భోదించేవారు బైబిలులో కొన్నిటినే తీసుకొని బోధిస్తారు. ఉదాహరణకు ద్వితీయో.కా. 28:11 లోని ధనసమృద్ధిని మరియు గర్భఫలవిషయములోను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రకటిస్తున్నారు. కాని వీరు రెండవ భాగాన్ని ప్రకటించరు. వారిలో నిష్కాపట్యము కొదువగావున్నది. ఈ బోధకులు దేవుడు ఆయన ప్రియులకు చాలామంది బిడ్డల్ని ఇస్తారని చెప్పుట నేను వినలేదు. వారు మోసగాళ్ళు అని ఇది మీకు రుజువుపరచుచున్నది. వారికి విస్తారమైన సిరిసంపదలను (దానిని వారు పేద ప్రజలనుండి కానుకలను తీసుకొనుటద్వారా ధనవంతులైయారు). దీనిని సమర్ధించుకొనుటకు పాతనిబంధనలో వారికి సరిపోయిన వచనాలను చూపిస్తారు. అటువంటి బోధకుల ద్వారా మోసపోకండి.

ఎఫెసీ 1:3 లో ఉన్న ఆత్మసంబంధమైన ఆశీర్వాదాన్ని ఈ విధంగా తర్జుమా చేయవచ్చును. "పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము". క్రీస్తులో ఉన్న సమస్తమును పరిశుద్ధాత్మలో ఉన్నవి. గనుక దేవుడు మనలను పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము మనలోకి వచ్చింది. ప్రభువైన యేసు నామమున అడిగిపొందుకోవాలి. ఒక భిక్షమెత్తుకొనే అమ్మాయి రోడ్డు ప్రక్కన భిక్షాటన చేయుచున్నదని ఊహించండి. ఆ ప్రక్కనే రాజకుమారుడు వచ్చుచున్నాడు మరియు అతడు ఆమెను పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, ఆమెకు ఎంత డబ్బు కావలంటే అంత తీసుకొని ఖర్చుపెట్టుకొనుటకు అనేక కోట్లరూపాయలు ఆమె అకౌంటులో బ్యాంకులో వేశారనుకోండి. ఆమె ఎంత ధన్యురాలు. ఒకప్పుడు ఆమెకు ఏమియు లేదుకాని కొన్ని నాణెములు కలిగిన గిన్నె మాత్రమే ఉన్నది. కాని ఇప్పుడు ఆమె ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఎంతో సౌఖ్యముగా జీవించుచున్నది. ఆ యువరాజు ఇచ్చిన అనేక బ్యాంకు చెక్కులు ఆమెకు ఉన్నవి కాబట్టి, ఆమెకు ఎంత డబ్బుకావలసి వచ్చినను లేక ఎన్నిసార్లు కావలసి వచ్చినను బ్యాంకులో నుండి తీసుకోవచ్చును. ఆత్మీయముగా ఇది మనకు సాదృశ్యముగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో పరలోకములోని సకల ఆశీర్వాదములు ఉన్నవి. కాబట్టి ప్రార్ధించుట ద్వారా పరలోకబ్యాంకులో నుండి పరిశుద్ధాత్మద్వారా క్రీస్తులో ఉన్న సకల ఆశీర్వాదములు మనము పొందుకోవచ్చును. క్రీస్తులో పరలోకములో వున్న ప్రతియొక్క ఆత్మసంబంధమైన నిత్యమైన ఆశీర్వాదములన్నియు మన సొంతమైయున్నవి. కాబట్టి మనము క్రీస్తుతో ఎల్లప్పుడు సజీవ సహవాసము కలిగి(భార్య భర్తలవలే) ఈ విధముగా చెప్పుచువున్నట్లయితే, ఓ యేసుప్రభువా, నీ పెళ్ళి కుమార్తెగా నేను అన్ని విషయాలలో ఈ భూమిమీద నేను ఉన్నన్ని రోజులు యదార్దముగా ఉండాలని ఆశిస్తున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మలో ఉన్న ప్రతియొక్క ఆశీర్వాదము మనదౌవుతుంది. వాటిని పొందుటకు మనము ఎంత మాత్రము అర్హులంకాదు కాబట్టి, అర్హులం అగునట్లుగా మనం దేవునిని ఒప్పించనవసరం లేదు. ఆ భిక్షమెత్తుకునే అమ్మాయి తాను ఉచ్చితముగా పొందిన శోధింపశక్యముగాని ఐశ్వర్యము పొందుటకు తాను అర్హురాలని ఎప్పుడైనను అనుకుంటుందనుకుంటున్నారా? కానేకాదు. మనము దేవునిలోనుండి పొందుకొనే సమస్తమును కేవలం ఆయన కనికరము మరియు కృపను బట్టియే కాని మన అర్హతనిబట్టికాదు. పరలోకములో వున్న సమస్తమును క్రీస్తులో మనకు ఉచ్చితముగా మనకు అనుగ్రహించబడియున్నది. క్రీస్తులో ఉన్న సమస్తమును మనము ఉపవాసము ద్వారాగాని లేక ప్రార్ధనల ద్వారాగాని సంపాదించలేము. కొంతమంది ఈ పద్ధతులతో ప్రయత్నించి ప్రయాసపడుతున్నందువలన వారు పరిశుద్ధాత్మలోని ప్రతి ఆశీర్వాదమును పొందుకొని అనుభవించరు. ఆ విధంగా మనం ఏ ఆశీర్వాదం అయినను మనము పొందుకొనము. మనకొరకు క్రీస్తు చేసి ముగించిన దానిని బట్టి మాత్రమే పొందుకుంటాము.

భూసంబంధమైన ఒక అవసరముకొరకు నేను ప్రార్ధిస్తున్నప్పుడు దేవుడు ఈ పాఠమును నాకు నేర్పించినట్లు నాకు గుర్తు ఉన్నది. నేను ఈ విధముగా చెప్పాను కాబట్టి ఈ అవసరము నాకు తీరును. అప్పుడు ప్రభువు ఇట్లన్నాడు, "నీనామమున నీవు నాయొద్దకు వచ్చినట్లయితే అది నేను చేయను. ఆ అవసరము తీర్చను". ప్రభువైన యేసునామములో ప్రార్ధించుట లేక అడుగుట అంటే ఏమిటో అప్పుడు అర్ధం చేసుకున్నాను. ఇప్పుడే రక్షణ పొందిన విశ్వాసియైనను మరియు 1959 సంవత్సరములో రక్షణ పొందిన నేనైనను ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసి ముగించినదానినిబట్టి మాత్రమే దేవుని యొద్దకు రాగలనని నేను ఆ రోజున గ్రహించాను. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడో సంతకము చేసిన బ్యాంకు చెక్కును తీసుకొని దేవుని యొద్దకు అనగా పరలోకబ్యాంకు వద్దకు రావాలి. నేను కూడ ప్రభువైన యేసుక్రీస్తు సంతకము చేసిన చెక్కును తీసుకొనే దేవుని యొద్దకు రావాలి. నేను చాలా సంవత్సరముల నుండి నమ్మకముగా పరిచర్య చేయుచున్నానని చెప్పి దేవుని యొద్దకు వస్తే కేవలము నా సంతకము ఉన్న చెక్కుతో వచ్చినట్లుంటుంది. మరియు పరలోకబ్యాంకు ఆ చెక్కును తిరస్కరిస్తుంది. అందువలననే మనయొక్క అనేక ప్రార్ధనలకు సమాధానము రావటంలేదు. మనము ప్రభువైనయేసు నామమున మాత్రమే వెళ్ళుటలేదు. మన నామములో మనము వెళ్ళుచున్నాము. మనము దేవునికి చాలా త్యాగము చేశాము కాబట్టి ఆయన మన ప్రార్ధనకు జవాబు ఇవ్వాలని అనుకూంటాము. మనము 70 సంవత్సరములు నమ్మకముగా జీవించినప్పటికి ఇప్పుడే రక్షణ పొందిన వ్యక్తివలే కేవలం ప్రభువైనయేసు నామమున మాత్రమే దేవుని యొద్దకు వెళ్ళగలము. ఆ ప్రత్యక్షతను బట్టి దేవునికి వందనములు. అప్పటి నుండి నా సంతకము కలిగిన చెక్కుతో దేవుని యొద్దకు నేను వెళ్ళలేదు. అలాంటి శోధన వచ్చినప్పుడు నేనిట్లంటాను, " ఈ చెక్కు చెల్లదు ప్రభువైన యేసు నా కొరకు చేసి ముగించిన దానంతటిని బట్టి, ఆయన నామములో మాత్రమే వెళ్తాను". కాబట్టి క్రీస్తులో మాత్రమే పరలోకసంబంధమైన పరిశుద్ధాత్మలోని సకల ఆశీర్వాదాలను స్వతంత్రించుకొనగలము.