స్తెఫను మాట్లాడినప్పుడు అతడు తన మాటలయందు అగపరచిన జ్ఞానమును మరియు అతనిని ప్రేరేపించిన ఆత్మను యూదా మతనాయకులు ఎదిరించలేకపోయిరి(అపొ.కా. 6:10). అది మనం మాట్లాడినప్పుడు కూడా మన అనుభవం కూడా అవ్వవచ్చును. "మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసించకయుండిరి?" అని అతడు వారినడిగియున్నాడు(అపొ.కా. 7:52). పాతనిబంధనలోని ప్రతి ప్రవక్త హింసించబడియున్నాడు. బోధకుడు వేరు మరియు ప్రవక్త వేరు. ఒక బోధకుడు అనేకులచేత అంగీకరించబడవచ్చునుగాని ఒక ప్రవక్త మామూలుగా తిరస్కరించబడి మరియు అంగీకరించబడడు. ఒక ప్రవక్త వివాదాస్పదముగా ఉంటాడుగాని బోధకులు వివాదాస్పదముగా ఉండరు. ప్రవక్తలు ఎల్లప్పుడు హింసించబడతారుగాని బోధకులు మరియు సువార్తికులు హింసించబడకపోవచ్చును. వారు ఒప్పించబడునట్లుగా స్తెఫను బోధించాడు. దానిని బట్టి వారు కోపించి, అతనిని చంపారు. క్రైస్తవసంఘములో అతడు మొదటి హతసాక్షి(అపొ.కా. 7:54,55).
అపొ.కా. 7:55-60లో నిజమైన ఆత్మీయప్రవక్త యొక్క గుర్తులు చూస్తాము.
1. పరలోక విషయముల(క్రీస్తు)మీదనే అతని మనస్సు ఉన్నది.
2. ప్రతి పరిస్థితిలోను అతడు దేవుని మహిమను చూస్తున్నాడు.
3. మనుష్యులు తనను వ్యతిరేకించినప్పటికీ అతడు కలత చెందడు.
4. దేవుని కుడిపార్శ్యమున ఉన్న ప్రభువైనయేసునే అతడు విశ్వసిస్తూ, ఆయననే చూస్తున్నాడు.
5. మృత్యుంజయుడైన క్రీస్తును గూర్చి ధైర్యముగా సాక్ష్యము చెప్పాడు.
6. అతడు హింసించబడి మరియు చంపబడ్డాడు.
7. అతడు తనను హింసించే వారిని క్షమించి మరియు వారికొరకు ప్రార్ధించాడు.
అనేక కారణములను బట్టి స్తెఫను చంపబడుటకు దేవుడు అనుమతించాడు. అందులో ఒకటి తార్సువాడైన సౌలు రక్షణపొందుట. అతడు చంపబడుచున్నప్పుడు అతని వైఖరిని సౌలు చూచియుండకపోతే, పౌలు రక్షణపొందేవాడోలేదో నాకు తెలియదు.
తనను సిలువవేయు వారికొరకు ప్రభువైనయేసు ప్రార్ధించుటను రోమా శతాధిపతి చూచి ప్రభువైనయేసు దేవునికుమారుడని ఒప్పించబడ్డాడు.
స్తెఫను ప్రార్ధించిన విధానాన్ని పౌలు చూచి వినినప్పుడు, అతని మనస్సాక్షి చేత గద్దించబడ్డాడు, "ఇది తప్పుడుమతము(మార్గము) కాకపోవచ్చును. నాదే తప్పుయి ఉండవచ్చును" అని ఆలోచించుట మొదలుపెట్టాడు. తరువాత దమస్కు మార్గమున ప్రభువు, "మునికోలలకు ఎదురు తిరుగుట కష్టమని" చెప్పారు(అపొ.కా. 26:14) మరియు అతడు ఒప్పించబడ్డాడు.
నీకు కీడుచేసిన వారి విషయంలో నీవు స్పందించే విధానం చూసిన వారు రక్షణపొందే అవకాశం ఉన్నది. తమను హింసించు వారియెడల క్రైస్తవులు చూపించే ప్రేమ వైఖరిని బట్టి గత 2000 సంవత్సరములలో రక్షణపొందిన అనేక వేలమందిలో పౌలు మొదటివాడు. కాని మనము కూడా ఆవిధంగా స్పందించాలంటే, మనం ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడియుండాలి.