న్యాయాధిపతులు 17 నుండి 21 వ అధ్యాయములలో విగ్రహారాధన, అపవిత్రత మరియు ఇశ్రాయేలీయులలోని యుద్ధములనుగూర్చి చదివెదము. భూమిమీద తన ప్రతినిధులుగా ఉండాలని దేవుడు ఏర్పరచుకొనిన దేశము ఏవిధముగా దిగజారిపోయినదో ఇక్కడ బయలుపరచబడినది. సొదొమ, గొమొఱ్ఱాలవలే వారు దిగజారిపోయారు.
న్యాయాధిపతులు 17:7-13 లో బైబిలులో మొదటిగా డబ్బుకొరకు బోధించే బోధకులను చూస్తాము. అతడు ఎక్కడైతే మంచిజీతము దొరుకుతుందో మరియు ఎక్కడైతే తనకు అన్నీ లభిస్తాయో అక్కడకు వెళ్లుటకు సిద్ధముగా ఉన్నాడు. అతడు మంచి జీతానికి యాజకుడుగా పనిచేయుటకు ఒప్పుకొన్న ఒక లేవీయుడు. ఒక వ్యాపారస్థుడు వచ్చి ఇంకా మంచి జీతము, ప్రతి సంవత్సరము క్రొత్త బట్టలు మరియు ఉచితముగా ఇళ్లు ఇస్తానని చెప్పాడు. వెంటనే ఆ బోధకుడు దానిని అంగీకరించాడు. లేవీయుల స్కూలులో డిగ్రీ చదివిన బోధకుణ్ణి ఉద్యోగములో పెట్టుకున్నాను గనుక దేవుడు తనను ఆశీర్వాదిస్తాడని ఆ వ్యాపారస్థుడు అనుకున్నాడు. ఆ విధముగా జరుగుట ఈనాడు మనము చూస్తున్నాము. ఇది 21 వ శతాబ్ధపుకధ అని ఒకడు అనుకొనవచ్చును. ఇటువంటి స్థితికి కారణము తరువాత వచనములో ఇవ్వబడినది “ ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను” (17:6).
న్యాయాధిపతుల కాలములో జరిగినదంతయు ఈ ఒక్క వచనములో చెప్పబడినది. ఈ గ్రంధములోని చివరి వచనములో కూడా ఇదే మాట చెప్పబడినది “ ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను (న్యాయాధిపతులు 21:25).
ఆ దినములలో ఇశ్రాయేలీయులు ఆవిధముగా జీవించిరి. ఈనాడు కూడా క్రైస్తవులు అనేకులు ఆవిధముగా జీవించుచున్నారు. వారి జీవితములలో ప్రభువైన యేసు రాజుగా లేడు కాబట్టి వారికి ఏది ఇష్టమైతే దానిని చేయుచున్నారు. వారి డబ్బును వారికిష్టమొచ్చినట్లు ఖర్చుపెడతారు మరియు వారికి ఇష్టమొచ్చినట్లు జీవిస్తారు. పెద్దజీతము ఎక్కడ వస్తే అక్కడకు బోధకులు వెళ్లుచున్నారు. వారి జీవితాలలో దేవునియొక్క పరిపూర్ణ చిత్తముతో సంబంధము లేకుండా వారు జీవిస్తారు.
ప్రభువైన యేసుక్రీస్తును ఒక మాదిరిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనను మనము ప్రభువుగా మరియు రాజుగా కలిగియుండి ఆయనను వెంబడించని యెడల ఈ గ్రంధములో చెప్పినట్లు ఇశ్రాయేలీయులవలే మనము కూడా అగుదుము.