వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము అన్వేషకుడు
WFTW Body: 

సాతాను యొక్క ఓటమిని గూర్చిన సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఈ భూమిపై జరిగిన గొప్ప యుద్ధము గూర్చి ప్రపంచములో ఏ చరిత్ర పుస్తకములలో కూడా వ్రాయబడలేదు. అది కల్వరిపై, ఈ లోక అధికారియైన సాతానును యేసుప్రభువు తన మరణము ద్వారా ఓడించినప్పుడు జరిగింది.

నీ జీవితమంతటిలో ఒక వచనాన్ని నీవు మరచిపోకూడదు, అది హెబ్రీ 2 : 14, 15. ఈ వచనము నీకు తెలియుట సాతానుకు ఇష్టముండదని నేను తప్పక చెప్పగలను. ఎవ్వరు కూడా తన యొక్క ఓటమి లేక తప్పిపోవుటను వినుటకు ఇష్టపడరు, మరి సాతాను కూడా అంతే. ఆ వచనము ఇలా చెప్తుంది.

"కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా (సిలువపై మరణము ద్వారా) నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, ఆయనకూడా రక్తమాంసములలో పాలివాడాయెను".

ప్రభువైనయేసు చనిపోయినప్పుడు ఆయన అపవాదికి శక్తి లేకుండా చేసెను. ఎందుకు? మనము సాతానునుండియు మరియు మన జీవితకాలమంతా అతడు కల్పించు భయము యొక్క బంధకముల నుండి విడుదల పొందటకొరకు ఆయన చనిపోయెను. లోకములో ప్రజలకు, రోగముల గురించిన భయము, మొదలగు ఎన్నో విధములైన భయములు కలవు. అయితే ఈ భయములన్నిటి కంటే గొపదైన భయము మరణము గురించిన భయమై యున్నది. మిగిలిన ప్రతి భయము మరణ భయము కంటే తక్కువైనది.

ఈమరణము గూర్చిన భయము, మరణము తరువాత ఏమి జరుగుతుంది అనే భయానికి దారితీస్తుంది. పాపములో జీవించువారందరు చివరకు నరకములోనికి వెళ్ళుదురని బైబిలు చాలా తేటగా చెపుతుంది. అది మారమనస్సు(రక్షణ) పొందని వారందరికొరకు దేవుడు ఏర్పరచిన ఒక స్థలము. అపవాది కూడ నిత్యత్వమంతా అగ్ని గుండములో, అతడు ఈ భూమిపై మోసము చేసి పాపములోకి నడిపించిన వారితో కలసి గడుపును.

యేసు క్రీస్తు మనపాపముల యొక్క శిక్షను తానే భరించి, మనలను ఆ నిత్యనరకములో నుండి రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చెను. సాతాను మనకెప్పుడైనను హాని చేయకుండునట్లు మనపై సాతాను కుండిన శక్తిని కూడ ఆయన నాశనము చేసెను.

మీరందరు ఈ ఒక్క సత్యాన్ని మీ జీవితమంతా జ్ఞాపకముంచుకోవాలని కోరుతున్నాను.

దేవుడు సాతానుకు వ్యతిరేకముగా ఎల్లప్పుడు మీపక్షమున ఉన్నాడు.

ఈ గొప్ప సత్యము నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఆదరణను మరియు విజయాన్ని తెచ్చినది. ప్రపంచములో ప్రతిచోట ఉన్న ప్రతి విశ్వాసి దగ్గరకు వెళ్ళి దీని గూర్చి చెప్పాలని నా ఆశ.

బైబిలు "దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును" (యాకోబు 4:7 ) అని చెప్పుతుంది. యేసు నామము పేరిట అపవాది యెల్లప్పుడు పారిపోవును.

అనేక మంది క్రైస్తవుల మనసుల్లో దృశ్యం సాతాను వారిని తరుముతున్నట్లును వారువారి జీవితాలను కాపాడుకొనుటకు అతడి యొద్ద నుండి పారిపోవుతున్నట్లును ఉంటుంది. కాని అది బైబిలు చెపుతున్న దానికి సరిగ్గా వ్యతిరేకమైనది.

మీరేమనుకుంటున్నారు? సాతాను ప్రభువైన యేసునకు భయపడునా లేదా? మన రక్షకుని ముందు నిలుచుటకు సాతాను బయపడుతాడని మనకు తెలియును. ప్రభువైన యేసు ఈ లోకానికి వెలుగైయుండెను మరియు చీకటికి అధికారియైన సాతాను ఆయన యెదుట నుండి మరుగైపోవలెను.

సరే, యౌవ్వన స్నేహితులారా మీకొక విషయము చెబుతాను. సాతానుకు వ్యతిరేకముగా, దైవికమైన అధికారముతో ప్రభువైన యేసునామమును ఉపయోగించు వారెవరికైనను కూడ అతడు భయపడును.

ప్రభువైన యేసు ఆయన శిష్యులతో పరలోకము నుండి సాతాను ఎలా పడెనో చూచినట్లు చెప్పారు. అక్కడ, దేవుడు సాతానును త్రోసివేసినప్పుడు సాతాను’ మెరుపు వలె’ పడెనని యేసు చెప్పారు (లూకా 10:18 ). అరణ్యములో యేసు ప్రభువు సాతానుతో ’ సాతానా పొమ్ము ’ అని చెప్పినప్పుడు, సాతాను మెరుపువేగముతో అక్కడ నుండి పోయెను. అదే విధముగా ఈ రోజు యేసునామములో మనము సాతానును ఎదిరించినప్పుడు, అతడు మన ఎదుటనుండి కూడ వెలుగు వెళ్ళినంత వేగముతో వెళ్ళిపోవును. వెలుగు యొద్ద నుండి చీకటి అట్లే వెళ్ళిపోవును.

యేసునామమునకు సాతాను భయపడును. యేసే ప్రభువనియు మరియు అతడు ప్రభువైనయేసు చేత ఓడింపబడినాడని గుర్తు తెచ్చుకొనుటను అతడు ఇష్టపడడు. దయ్యము పట్టిన వారు " యేసు క్రీస్తే ప్రభువు" అనియు లేక " సాతాను సిలువపై ప్రభువైన యేసుక్రీస్తు చేత ఓడింపబడెను" అను విషయమును ఒప్పుకొనక పోవుటను నేను గమనించాను.

ఎటువంటి దయ్యమునైనా వెళ్ళగొట్టుటకు యేసుక్రీస్తు నామములో శక్తి యున్నది. అంతే కాక ఆ నామములో ఏ దయ్యమైనా నీయొద్ద నుండి మెరుపు వేగముతో పారిపోవును. ఎప్పుడైనను అది మరిచిపోకు.

యౌవ్వనస్థులరా, ఎప్పుడైనా మీ జీవితములలో మీరు ఏదైన కష్టపరిస్థితులలో ఉంటే పరిష్కారము లేని సమస్యను ఎదురుకొన్నట్లయితే లేక మానవమాత్రుడు జవాబివ్వలేరని అనుకొంటున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే యేసు ప్రభువు పేరున ప్రార్ధించు. ఆయనతో ఇలాగు చెప్పు, " ప్రభువైన యేసూ, అపవాదికి వ్యతిరేకముగా నీవు నా పక్షముగా ఉన్నావు. నీకు స్తోత్రం. నాకిప్పుడు సహాయము చెయ్యి". మరి అప్పుడు సాతాను వైపు తిరిగి ఇలా చెప్పుము, " సాతానా, ప్రభువైన యేసు నామములో నిన్ను ఎదురిస్తున్నాను". నేను నీకు చెప్పదలచినదేమంటే యేసు ప్రభువు సాతానును సిలువపై జయించెను. కాబట్టి సాతాను వెంటనే నీ యొద్ద నుండి పారిపోవును. నీవు ఎప్పుడైతే దేవుని వెలుగులో నడుస్తావో, అప్పుడు నీవు యేసునామములో సాతానును ఎదురించినప్పుడు సాతాను నీయెదుట శక్తిహీనుడగును.

సాతాను యొక్క ఓటమి గూర్చి నీకు తెలియుట అతడికి ఇష్టము లేదు. కావున ఈ విషయము నీవు వినకుండా అతడు ఇంత కాలము నిన్ను ఆటంకపరిచాడు. అందుచేతనే అతడు తన ఓటమి గురించి బోధించకుండునట్లు అనేక బోధకులను కూడ ఆటంకపరిచెను.

సిలువపై సాతాను, యేసుక్రీస్తు చేత యుగయుగములకును ఓడింపబడినాడని నీవు ఖచ్చితముగా తెలుసుకొనాలని నేను ఆశిస్తున్నాను. అప్పుడు నీవు ఎప్పుడును సాతానును గూర్చి భయపడనక్కరలేదు. అతడు నిన్ను ఎన్నటికిని ఇబ్బంది పెట్టలేడు. అతడు నీకు హాని చేయలేడు. అతడు నిన్ను శోధింపవచ్చును. అతడు నీపై దాడిచేయవచ్చును. కాని నిన్ను నీవు తగ్గించుకొని, దేవునికి లోబడి, అన్ని వేళలలో ఆయన వెలుగులో నడిచినట్లయితే క్రీస్తులో దేవుని కృప సాతానుపై ఎల్లప్పుడును నిన్ను జయించువానిగా చేయును. వెలుగులో గొప్ప శక్తి వున్నది. చీకటికి అధికారియైన సాతాను, వెలుగులో ఉన్న ప్రదేశములోనికి ఎప్పుడును ప్రవేశింపలేడు.

ఈనాడు అనేక విశ్వాసులపై సాతానుకు అధికారమున్నదంటే దానికి కారణం, వారు చీకటిలో నడుస్తున్నారు, ఏదో ఒక రహస్యపాపములో జీవిస్తున్నారు, ఇతరులను క్షమించలేకపోవుట, ఎవరిపైనో అసూయ కలిగియుండుట లేక వారి జీవితాల్లో ఏదో స్వార్ధపూరితమైన అభిలాషను నెరవేర్చుకొనుటకు ప్రయత్నములో నుండుట మొదలైనవి ఏవో ఉన్నవి. అందుచేత సాతాను వారిని ఏలుచుండెను. అలాకానట్లయితే అతడు వారిని తాకలేడు.