కీర్తనలు 34:11 లో దావీదు ఈలాగు చెప్పుచున్నాడు “పిల్లలారా, మీరు వచ్చి నామాటవినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను”. ప్రజలకు దేవుని భయమును నేర్పుట అంత సులభమైన పనికాదు. రోమాపత్రిక మరియు ఎఫెసీపత్రికలను విభజించి పరిశీలించుట చాలా సులభము! ఇతరులకు మనము దేవునియందలి భయభక్తులను నేర్పవలెననినచో మొదటిగా మనము ఆయనయందు భయభక్తులు నేర్చుకొనవలెను. దేవునియందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. దేవునికి భయపడువ్యక్తి, కేవలము బైబులును ఎరిగినవ్యక్తికంటే ఎక్కువగా తన ప్రజలకు నేర్పగలడు. దేవునికి భయపడని వ్యక్తి జ్ఞానమునుకాదు కాని తెలివిని మాత్రమే ఇతరులకు ఇవ్వగలడు. తెలివి మనుష్యుని ఉప్పొంగజేయును అని 1 కొరింథి 8:1 లో చదివెదము. కాని జ్ఞానము మనుష్యుని పరిపూర్ణుడుగా చేసి మరియు అతని జీవితము ఎదుర్కొనే సమస్యలకు తెలివిని ఏవిధముగా ఉపయోగించవలెనో జ్ఞానము బోధించును. జ్ఞానము కలిగినవారు మాత్రమే యేసుక్రీస్తు సంఘమును కట్టగలరు.
దేవునియందలి భయభక్తులే క్రైస్తవజీవితమునకు అ, ఆ లు అయిఉన్నవి. నీ సంఘప్రజలకు మొదటిగా దేవునియెడల భయభక్తులు నేర్పనియెడల నీవు వారికి ఎన్ని అంశములు బోధించినను, నీవు ముఖ్యమైన విషయములోనే విఫలమగుదువు. అది, చదువుటరాక ముందే, వారికి భూగోళశాస్తము మరియు చరిత్రను బోధించినట్లుండును. ప్రపంచములో ఏ ఒక్క టీచరు(ఉపాధ్యాయుడు) అటువంటి పొరపాటు చేయడు.
దేవునియందలి భయభక్తులు నేర్చుకొనుట, చదవడము నేర్చుకొనినట్లే ఉండును. కాని చాలా సంఘములలో సంఘపెద్దలు వారి ప్రజలకు మొదట దేవునియందలి భయభక్తులు నేర్పించుటలేదు. వెలుగు సంబంధులకంటే లోక సంబంధులు వారి తరములో తెలివి కలిగి ఉండెదరని వినుటకు ఇది ఋజువుగా ఉన్నది.
సెమినరినుండి డిగ్రీపొందినవారిని ఒకప్రశ్న అడుగుచున్నాను. నీవు అక్కడ దేవునియందలి భయభక్తులు నేర్చుకున్నావా? లేక కేవలము డిగ్రీ సర్టిఫికెట్ మాత్రమేనా? నన్ను రెండవప్రశ్న అడుగనివ్వండి. సెమినరిలో నీవెందుకు చేరియున్నావు? ఒక ఉద్యోగము సంపాదించుటకా లేక దేవునియందలి భయభక్తులు నేర్చుకొనుటకా? వేరే సెమినరిలో కాకుండా దీనిలోనే ఎందుకు చేరియున్నావు? అది చాలా ప్రసిద్దిగాంచిన సెమినరీఅని చేరియున్నావా? అది సిద్దాంతపరముగా ఇవాంజలికల్ కాకుండా లిబరల్(స్వతంత్రము)గా ఉన్నదని తెలిసికూడా నీవు దానిలో చేరియున్నావా? యేసుప్రభువు ఆయన పరిచర్యకొరకు తనశిష్యులను అటువంటి సెమినరీకి పంపునని నీవు ఊహించగలవా? దేవునియందలి భయభక్తులు నేర్చుకొనుటకు మాత్రమే సెమినరిలో చేరియున్నామని మీలో ఎంతమంది యదార్ధముగా చెప్పగలరు? దాదాపు ఒక్కరుకూడా ఉండరు. ఇది బాధాకరము కాదా? అమెరికావెళ్ళి డబ్బు సంపాదించుటకు మొదటిమెట్టుగా ఇండియాలోని చాలామంది బైబులు స్కూలులో చేరుచున్నారని నాకు తెలియును. కొందరు అమెరికాలోనే ఉండిపోవుటకు అక్కడి బైబులుస్కూళ్ళకు వెళ్ళుటకు ప్రయత్నించెదరు. అటువంటివారు ప్రభువును ఏవిధముగా సేవించగలరు? తప్పుడు ఉద్దేశ్యములతో బైబులుస్కూలులో చేరియున్నానని నీవు ఒప్పుకొనగలవా? దేవుడు యదార్ధవంతులను ప్రేమించును గనుక నీవు యదార్ధముగా ఉండగోరినయెడల అప్పుడు నీకు నిరీక్షణ కలదు. ఇప్పుడు, నీవు చేసిన పొరపాటు ఇతరులు చేయకుండునట్లు వారిని హెచ్చరించుము. మొదటిగా వారికి దేవునియెడల భయభక్తులు నేర్పించుము. మనము చేసినపొరపాట్లు మనపిల్లలు చేయనవసరములేదు.
సామెతలు 24:3,4 లో జ్ఞానమువలన ఇల్లుకట్టబడును మరియు తెలివిచేత దానిగదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడునని చెప్పబడియున్నది. జ్ఞానమునకు మరియు తెలివికి ఉన్న వ్యత్యాసము గమనించుము. బైబులుజ్ఞానముయొక్క విలువను నేను తగ్గించుటలేదు. ఎంతమాత్రముకాదు. 40 సం||ల నుండి బైబులును చదువుచున్నాను మరియు అందరివలె నాకు బైబులు తెలుసునని నేననుకొనుచున్నాను. కాని నేను మొదటగా జ్ఞానమును వెదకెదను. ప్రపంచమంతటిలో దైవికమైనప్రేమ ఎంతోశ్రేష్టమైనది. కాని దైవికమైనప్రేమ ఎల్లప్పుడు దైవికమైనజ్ఞానముచేత నడిపించబడును. ప్రేమలేని జ్ఞానము అపాయకరమైనది.
ఒక బస్సుట్యాంకులో ఉన్న పెట్రోలుతో ప్రేమను పోల్చవచ్చును మరియు బస్సు డ్రైవరును జ్ఞానముతో పోల్చవచ్చును. నీసంఘప్రజలను నడిపించుటకు నిశ్చయముగా నీకు ప్రేమ అవసరమైయున్నది. కాని వారిని ఏమార్గములో నడిపించవలెనో నిర్ణయించుటకు నీకు జ్ఞానము అవసరము.
జ్ఞానము మూలాధారమైయున్నది. బైబులుగూర్చిన తెలివిలో 100% పొంది మరియు జ్ఞానములో సున్నా(జీరో) పొందవచ్చును. ఒక విద్యార్ధి పి.టి. (ఆటలు మొ||నవి)లో 100% పొంది మరియు లెక్కలలో సున్నా మార్కులు పొందవచ్చును. అతడు లెక్కలలో 100% పొంది మరియు పి.టి.లో సున్నా పొందినచో బాగుండును. ఎందుకనగా బవిష్యత్తులో పి.టి. కన్నా లెక్కలు ముఖ్యముకాబట్టి. మరియు బవిష్యత్తులో పి.టి. కన్నా లెక్కలు చాలా ప్రాముఖ్యమైయున్నవి. తెలివిచేత గదులు నింపబడునని మనము చూచియున్నాము. మనము గదులలో పెట్టే కుర్చీలు, బల్లలు మరియు మంచములవంటి వస్తువులవలే తెలివియున్నది. గనుక నీకు జ్ఞానము లేకుండ కేవలము తెలివిమాత్రమే ఉన్నయెడల, అప్పుడు నీవు విలువైనవస్తువులన్నిటినీ ఖాళీస్థలములో ఉంచినట్లుండును! చాలా ఖరీదైన బల్లలు మరియు సోఫాలు అక్కడ ఉన్నవి. అక్కడ లేనిదల్లా ఇల్లు మాత్రమే! అతడు చుట్టుప్రక్కలవారికి ఎంతో హాస్యాస్పదముగా ఉండునని నీవు బాగుగానే ఊహించవచ్చును. కాని ఈదినమున క్రైస్తత్వములో చాలామంది పెద్దలు మరియు బోధకులు అదేవిధముగా ఉన్నట్లు చూడగలము. వారికి దేవునిభయము లేనందున వారికి తెలివి ఉన్నది కాని జ్ఞానము లేదు.
దేవునియందలి భయభక్తులనుగూర్చి బోధించే బోధకులు చాలా అరుదుగా ఉన్నారు. అందువలన చాలామంది విశ్వాసులు జ్ఞానములేనివారైయుండి మరియు అనేకభయములు కలిగియున్నారు.