దేవుని సేవకులుగా మనము ఆర్ధము చేసుకొనవలసిన మరియొక విషయము పరిశుద్ధాత్మ శక్తికి మరియు మానసిక శక్తికి మధ్యనుండిన వ్యత్యాసము.
పేతురు ఒకమారు ప్రభువుతో "నీవు జీవముగల దేవుని కుమారుడవు" అని చెప్పెను. యేసు ప్రభువు వెంటనే "రక్తమాంసములు నీకు ఈ విషయమును బయలుపరచలేదు" అనెను. వేరొక విధముగా చెప్పవలెనంటే పేతురు ఆ ఆత్మీయ సత్యమును అతని మానసిక శక్తిచేత - అతని మానవ తెలివితేటలు లేక చురుకుతనము చేత తెలుసుకొనలేదు.
మన మనస్సు మనకు దైవిక బయల్పాటు నివ్వదు. మనము వివేకవంతులు మైనట్లయితే, మనకు బైబిలు నుండి తెలివైన ఆలోచనలు వచ్చును. మనము ఆ ఆలోచనలను సంఘములో మాటలాడుదుము మరియు వాటిద్వారా వివేచన లేనివారిమీద ముద్రవేయుదుము. కాని తెలివైన మానవ ఆలోచనలకు మరియు దేవుని యొక్క బయల్పాటునకు మధ్య ఆకాశమునకు భూమికిని ఉన్నంతటి వ్యత్యాసమున్నది.
పౌలు దేవుని వాక్యమును బోధించుటలో తన స్వంత జ్ఞానమును ఉపయోగించుదునేమో అని దాని ద్వారా ఇతరుల యొక్క విశ్వాసము దేవుని శక్తిపై కాక తన స్వంత జ్ఞానముపై ఆధారపడుదురేమో అని భయపడి భయముతో వణకుతో భోదించెను (I కొరంథీ 2: 1-5).
మానవరీత్య చెప్పవలెనంటే, పౌలు యూదుల మధ్య పని చేయుటకు (ఆయనకు వారి లేఖనములు తెలిసియున్నందున), పేతురు అన్యజనులలో పని చేయుటకును సరిపోయియుండిరి. అయితే దేవుడు వారికి వ్యతిరేకమైన పరిచర్య ఇచ్చెను (గలతీ 2:8). కనుక వారు వారికుండిన సామర్ధ్యములపై కాక పరిశుద్ధాత్మపై అధారపడిరి.
సాధారణముగా తెలివైన ఆలోచనలు ఇతరులకు మనము బోధించుటకు మరియు వారినుండి ఘనత పొందుటకు మనకు పనికి వచ్చును. అయితే వేరొక ప్రక్క ప్రత్యక్షత మనము దేవుని యెదుట ముఖము నేలపై వంచి సాష్టాంగ పడేటట్లు చేయును. మన తేలివితేటలతో మనము మనుష్యులను ప్రభావితము చేయవచ్చు. కాని దేవుని ప్రత్యక్షతతో వారికి సహాయము చేయగలము.
యెషయాకు దేవుని యొక్క మహిమను గూర్చిన దర్శనము కలిగినప్పుడు, ఆయన తన తరువాత ప్రసంగమునకు ఒక అంశము దొరికిందని ఆలోచించలేదు!! ఆయన నేలను పడిపోయి దేవునిని ఆరాధించాడు. పత్మాసు దీపమున యోహానుకు ఇదే జరిగినది. వారిరువురూ అట్లు దేవుని యెదుట నేలను పడిపోయిన తరువాత మాత్రమే ఆయన యొక్క సందేశమును ఇతరులకు తీసుకువెళ్ళమని ఆయన చెప్పెను. మనము దేవుని యొక్క సేవ చేయుటకు ముందు ఆయనను ఆరాధించవలెను.
ఈ మానసిక శక్తిని మనము జనులను క్రింద పడద్రోసే లేక అదుపులేకుండా నవ్వుతూ ఉండే మరియు వారిసొమ్మును బోధించేవారికిచ్చేటట్లు వారికి ఉద్రేకాన్ని (సుషుప్తావస్థమును) కలిగించే శక్తిగల బోధకులలో చూడగలము. అటువంటి కూటములలో మనోవికృతి రోగము (తప్పుడు మానసిక వైఖరుల వలన కలిగే రుగ్మత)లు కూడ స్వస్థపడును. ఇవన్ని కూడా మానవ మానసిక శక్తి వలన జరుగును. కాని అక్కడ యేసు ప్రభువు నామము ఉపయోగించుదురు. అందువలన అనేక విశ్వాసులు కూడ మోసపోవుదురు. దేవుని సేవకులుగా మనము అటువంటి మోసకరమైన వాటిని బహిర్గతము చేయవలెను.
మానసిక శక్తిని ఉపయోగించి అనేక క్రైస్తవ నాయకులు వారిని వెంబడించే వారికంటే అన్ని విధముల అధిగమించి వారికుండిన తలాంతులను బట్టి ఇతరులు వీరి యెడల గౌరవ భావముతో మునిగిపోయేటట్లు చేయుదురు. జనులు అటువంటి నాయకులను చూచి వారిని "పరిశుద్ధ దైవజనులు" గా గౌరవించెదురు. ఈ నాయకులు వారిని వెంబడించు వారి నుండి అటువంటి మెప్పును పొందుటను ప్రేమించెదరు.
సంగీతమునకు కూడా గొప్ప మానసిక ప్రభావితం చేసే శక్తియున్నది. అది మన ఉద్రేకములను కదలించును. అయితే అదే పరిశుద్ధాత్మ శక్తియని మనము మోసపోకూడదు. మనము మన సంఘములకు మంచి సంగీతముతో అనేక మందిని ఆకర్షించుకొనవచ్చును. అయితే మనము ఎవరిని ఆకర్షించుకొనుచున్నాము? భక్తిగా జీవించుట కొరకు సహాయాన్ని కోరే ఆత్మ విషయములో దీనులైన వారిని కాదు, కాని నాగరికులుగా నవీన కాలమునకు చెందిన వారుగా ఉండి వీరికుండిన గ్రహింపును బట్టి మరియు వారి సంగీత పరిజ్ఞానమును బట్టి గర్వించువారిని ఆకర్షించుకొనుచున్నాము.
బెంగుళూరులో ఒక ఆదివారము మా కూటమునకు సంగీతము బాగుగా తెలిసిన ఒక జంట వచ్చిరి. వారు మా సంఘములో నుండిన సంగీతము చాలా తక్కువ స్థితిలోనున్నదని భావించి మరల ఎప్పుడూ రాలేదు. భక్తిగలిగిన సంఘము కాక, సంగీతము గురించి చూచేవారి నుండి మమ్ములను కాపాడుచున్నందుకు దేవునికి కృతజ్ఞులమై యున్నాము!! సంఘములో మనకు కావలసినది మంచి వాద్య బృందము కాదు, కాని పరిశుద్ధాత్మ శక్తియైయున్నది. పెంతెకోస్తు దినాన పేతురు సమూహములను ఆకర్షించినది కీబోర్డు మరియు డ్రమ్ముల సమూహముతో కాదు, గాని దేవుని యొక్క అభిషేకముతో. ఎప్పుడైతే ఆ అభిషేకము పోవునో, అప్పుడు విశ్వాసులు దానిని చక్కని సంగీతముతో, హాస్యము కలిపిన ప్రసంగములతో మరియు గొప్ప కట్టడాలు మొదలైనవాటితో నింపుటకు ప్రయత్నింతురు.
ఈ కాలములో మనకు అందుబాటులో ఉన్న వస్తువులు కూడా ఒక ఉచ్చువంటివే. దేవుని అభిషేకము ఉన్న దైవ సేవకులు బోధించిన బైబిలు ప్రసంగములు తప్పక మన ఆత్మీయ అభివృద్ధికి సహాయపడును. అయితే దేవుడు మనతో మాటలాడినది వినవలెనంటే మనము పరిశుద్ధాత్ముని కంటే అటువంటి కేసెట్లు, సిడీలపై ఆధారపడుట ప్రారంభించకూడదు. మనకు ఒక వేళ అపొస్తులుడైన పౌలు మాటలాడిన టేపులుండినను, వాటితో మనము క్రీస్తు శరీరము కట్టలేము!
ఈ లోకములో గొప్ప శక్తి కలిగిన వాటిలో ధనము ఒకటి. అందువలన మనము దానిపై సులువుగా ఆధారపడుదుము. సుమారుగా ప్రతి క్రైస్తవ సంస్థ ఈ రోజు ధనము యొక్క అవసరము గూర్చి మాట్లాడుచున్నది. వారు వారి యొక్క సువార్త ఫలితములు తెలియ జేసే ఉత్తరాలు మరియు వారు ప్రచురించే పత్రికలను పశ్చిమ దేశాలలో నుండే సామాన్యమైన మరియు నిష్కపటమైన (కాని సరియైన అవగాహనలేని) విశ్వాసుల నుండి "సర్వోన్నతమైన డాలర్"ను పొందుకొనుటకు పంపుదురు. అపోస్తలుల విషయములో చూచినట్లయితే, వారు ఎప్పుడు ఒకసారియైన వారి కొరకు గాని, లేక వారి పని గూర్చిగాని డబ్బును అడగలేదు. వారు "బీదలను జ్ఞాపకము చేసుకొనుమని" (గలతీ 2: 10)) మరియు అవసరంలో ఉన్న వారికి సహాయము చేయుమని మాత్రమే విశ్వాసులకు సూచించారు (II కొరంథీ 8 & 9 అధ్యాయములు). కాని అయ్యో, అపోస్తలులు ఒకసారి కూడా మాట్లాడనిది ఈ రోజుల్లో క్రైస్తవ పనిలో ఎల్లవేళల మాటలాడుచున్నారు. "లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలిగొనినను నీతో చెప్పను" అని దేవుడు చెప్పెను (కీర్తన 50 : 12).
ఈ విషయములో ఆ దేవునికి సేవకులమైన మన సంగతేమిటీ? ఆహారము లేక ధనము అవసరమైనప్పుడు - మనమేమి చేయుదుము? మనము నిజముగా దేవుని చేత పిలవబడినవారమైతే, మనకు ఈ లోక సంబంధమైన అవసరాలు తీరుటలో లోటు ఉండదు. దేవునికి ధనము విషయములో లోటు లేదు. ఆయనకు లోటైనదేమంటే విరిగి నలిగిన మనస్సు విశ్వాసపాత్రులైన నమ్మకమైన సేవకులు. దేవుడు రోషముగలవాడు. ఆయన తన మహిమను వేరొకరికి ఇవ్వడు. ఆయన తన సంఘమును ఆయన శక్తితో తప్ప మరియొక శక్తితో నిర్మింపడు.
దేవుని యొక్క పని, ఈనాడు కూడా పాత రోజులలో వలె - మానసిక శక్తితో కాని లేక ఎలక్ట్రానిక్ పరికరాలు వలన కాని లేక అధిక ధనముండుట వలన గాని కాక పరిశుద్ధాత్మని శక్తితోనే జరుగుచున్నది.