WFTW Body: 

మనము వెలుగులో నడువనియెడల దేవునితో అన్యోన్య సహవాసము చేయలేమని 1 యోహాను 1:7 లో బైబిలు చెప్పుచున్నది. వెలుగు సమస్తమును ప్రత్యక్షపరచును కాబట్టి, మనము వెలుగులో నడచినయెడల దేనిని దాచలేము. తన జీవితములో ఇతరులకు తెలియకుండా ఏదైన విషయము ఉన్నట్లయితే, అతడు చీకటిలో నడుచును.

మనము వెలుగులో నడచినయెడల, మన జీవితము ఒక తెరువబడిన పుస్తకమువలే ఉండును. అప్పుడు మన వ్యక్తిగత జీవితము, మన లెక్కల(అకౌంటు) పుస్తకములు మరియు ప్రతిదానిని చూచుటకు ఇతరులను ఆహ్వానించగలము. దేనినైనను మనము దాచుకొనవలెనని ప్రయత్నించము. దాని అర్ధము మనము పరిపూర్ణులమని కాదు. దాని అర్ధము కేవలము మనము యధార్ధవంతులమని మాత్రమే.

యధార్ధతను మొదటిగా దేవుడు మన యొద్దనుండి కోరుచున్నాడు అనగా సంపూర్ణమైన యధార్ధతను. మొదటిగా మనము యధార్ధముగా ఉండుటకు (ఉన్నది ఉన్నట్లు ఒప్పుకొనుటకు) ఇష్టపడినయెడల, మన అనేకసమస్యలు త్వరగా పరిష్కారమగును. దేవునియెదుట మరియు మానవులయెదుట యధార్ధముగా ఉండుట అనేనియమమును మనము కలిగియుండినయెడల ఆత్మీయముగా ఎంతో ఎక్కువగా క్షేమాభివృద్ధిని పొందెదము. కాని ఇది ఒక పోరాటమని మనము కనుగొనెదము. ఈ హెచ్చరికను నేను తీవ్రముగా తీసుకుంటాను. ఇప్పటినుండి యధార్ధముగా ఉంటాను అని నీవు చెప్పవచ్చును. కాని ఒక వారములోనె, దేవుని మెప్పుకంటే మనుష్యుని మెప్పు ఎక్కువగా కోరుకొనుచు వేషధారివగుదువు అని కనుగొందువు. కాబట్టి ఈ పోరాటమును పోరాడి గెలుచుటకు తీర్మానించుకొనవలెను.

యధార్ధముగా ఉండుట నేర్చుకొనని అనేకమంది క్రైస్తవులు ఈనాడు ఉన్నారు. వారు నూతనజన్మను పొంది 20, 30 లేక 40 సం||లు గడచినప్పటికీ ఆత్మీయాభివృద్ధి పొందకపోవుటనుబట్టి దేవుడు విచారించుచున్నాడు. మన జీవితములలో వేషధారణ ఉన్నట్లయితే ఆత్మీయముగా క్షేమాభివృద్ధిని పొందలేము. మన ప్రార్ధనలను దేవుడు వినడు. మనము రాత్రంతయు ప్రార్ధించినను, సమయము వృధాచేయుటయే అగును. మొదటిగా మనము వేషధారణనుండి విడుదల పొందనట్లయితే మన ప్రార్ధనలు దేవునికి వినపడవు.

మనము దేవునియెదుట ఏమైయున్నామో అది మాత్రమే ఆత్మీయముగా విలువైనదిగాని మరింకేదియు కాదు. మనకున్న బైబిలు జ్ఞానమునుబట్టి గాని లేక ఎంత సమయము ప్రార్ధన చేస్తున్నదానినిబట్టిగాని మనము ఎన్ని కూటములకు వెళ్ళుచున్నామనే దానినిబట్టిగాని లేక ఇప్పుడు సంఘములోని పెద్దలు లేక ఇతరులు మన గురించి ఏమి అనుకుంటున్నారనే దానినిబట్టిగాని మన ఆత్మీయస్థితిని అంచనా వేయలేము. అలాకాకుండా, నిన్ను నీవే ఈ ప్రశ్న వేసుకొనుము, “నా సర్వమును ఎరిగిన దేవునికి నా గురించి ఉన్న అభిప్రాయమేమిటి?”. దీనికి సరియైన జవాబే ఆత్మీయముగా నీవు ఏమైయున్నావనేదానిని తెలియజేయును. దినదినము ఈ విధముగా మనము గుర్తుచేసుకొనాలి. లేనియెడల నెమ్మదిగా మరలా వేషధారులమయ్యే అవకాశమున్నది.

నతనయేలును గురించి ప్రభువైనయేసు పలికిన మాటలు నాకు ఇష్టము. “ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు” (యోహాను 1:47). నీ గురించి మరియు నా గురించి ప్రభువైనయేసు ఈలాగు చెప్పినచో, దానికంటే గొప్ప మెప్పు ఇంకేదియు లేదు. నతనయేలు పరిపూర్ణుడు కాదు. అతడు అసంపూర్ణుడు. కాని అతని బలహీనతల విషయములో నిజాయితీగా (యధార్ధముగా) ఉన్నాడు. తానేమైయుండలేదో అది అయ్యి యున్నట్లుగా అతడు నటించలేదు. అననీయ మరియు సఫేరాలకు ఈ విధముగా అతడు వేరుగా ఉన్నాడు.